జ్యోతిష్య పాఠాలు - 13 - అచ్చంగా తెలుగు

 జ్యోతిష్య పాఠాలు - 13 

PSV రవి కుమార్

పాఠం -  13 



సప్తమాధిపతి - సప్తమం ద్వారా వివాహం, భాగస్వామ్యం,  వ్యాపారం, వ్యాపార భాగస్వామ్యం, గుర్తింపు వంటివి తెలుసుకోవచ్చు.

సప్తమాధిపతి లగ్నం లో ఉంటే:

ఇది ఒక రాజయోగం. సమాజం లో చురుకుగా ఉంటూ, నలుగురితో కలుపుగోలుతనం గా ఉంటారు. భార్య లేదా భర్త యందు అమిత ప్రేమ కలిగి ఉంటారు.

శని కనుక సప్తమాధిపతి అయిన, కాస్త ఆ చురుకుదనం తగ్గి, నిదానం గా ఉండును. వివాహంతరం వీరి వ్యక్తిత్వం మెరుగు పడు అవకాశలు ఎక్కువ. శుక్రుడు ఉన్న, అందరి తో స్నేహ భావం కలిగి ఉండచ్చు. బుధుడు ఉన్న, లెక్కల యందు అధిక ప్రావీణ్యం కలిగి ఉందురు.

సప్తమాధిపతి ద్వితీయం లో ఉంటే:

వీరికి కుటుంబం నుంచి స్తిరాస్థి వచ్చు అవకాశం కలదు. కుటుంబ పారంపర్యం గా వచ్చు వ్యాపారం చేయు అవకాశం కలదు.

గురుడు ఉన్న, అధిక ధన సంపద. కుజుడు ఉన్న స్వగ్రుహ యోగం, కుటుంబ వారసత్వం గా వచ్చు గ్రుహం కలుగు అవకాశం. శని ఉన్న జీవిత భాగస్వామి ని అర్దం చేసుకోవటం లో ఇబ్బందులు లేదా ఎక్కువ సమయం పట్టచ్చు.

సప్తమాధిపతి త్రుతీయం  లో ఉంటే:

సప్తమాధిపథి ఇక్కడ ఉంటే, సమాజం లో మంచి వక్తలు అవుతారు. అందరి తోనూ సత్సంబందాలు ఉంటాయి.

శుక్రుడు ఉన్న, మీడియా రంగం లో వ్రుత్తి చేయు అవకాశం ఎక్కువ. బుధుడు సాఫ్ట్వేర్ రంగం లో లేదా లెక్కలయందు వ్రుత్తి చేపట్టు అవకాశం కలదు.

చంద్రుడు ఉన్న, కలుపుగోలు తనం బాగానే ఉన్న, ఒకోసారి ఒంటరి గా ఉండటాన్ని ఇష్టపడతారు. శని ఉన్న, వ్యాపారం చేయు అవకాశం కలదు

 

సప్తమాధిపతి చతుర్దం లో ఉంటే

భాగస్వామి ఎంపిక లో తల్లి కీలక పాత్ర వహిస్తుంది. వ్యాపారానికి అనుకూలమయిన స్థానం.

కుజుడు ఉన్న, భాగస్వామి నుండి భూములు లభించుట లేదా వివాహనంతరం భూలాభం కలగవచ్చు. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగాలకు సంబందించిన విద్య యందు ఆసక్తి మరియు ఉపాధి అవకాశములు ఎక్కువ. శని చంద్రుడు వంటి గ్రహాలు ఉన్న, బయలజీ,కెమిస్ట్రీ, వైద్య రంగానికి సంబందించిన విద్య. గురుడు ఉన్న, ధర్మాల పై ఆసక్తి, ఫైనాన్స్ రంగం లో విద్య మరియు వ్రుత్తి చేపట్టు అవకాశం.

సప్తమాధిపతి పంచమం లో ఉంటే

ఇది ఒక రాజయోగం. వీరు చాలా విషయముల యందు పరిజ్ఞానం కలిగి యుందురు. శని ఉన్న వీరు జ్ఞాన సముపార్జన లో కాస్త నిదానం గా ఉందును. వీరికి సంతానం ఆలస్యం గా కలగవచ్చు. రవి ఉన్నవీరికి సంతాన సంబందిత సమస్యలు కలగవచ్చు.  వీరికి సంతానం కలిగిన తరువాత జీవితం లో  అభివ్రుద్ది కలుగును.

సప్తమాధిపతి షష్టం లో ఉంటే

ఇది కాస్త ఇబ్బంది పెట్టే స్థానం. వీరి భాగస్వామి కి కాస్త ఆరోగ్య సమస్యలు కలగవచ్చు లేదా వారి తో గొడవలు, ఇబ్బందులు కలుగవచ్చు. శుక్రుడు ఉన్న, భాగస్వామి తో గొడవలు లేదా ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.

ఈ స్థానం లో ఏ గ్రహం ఉన్న, తత్సంబందిత ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. వీరికి విదేశాలలో స్థిరపడు అవకాశములు ఎక్కువ. జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం లేదా ఇతరత్రా కారణాల వలన కానీ, అధిక ధన వ్యయం చేయవలసి రావచ్చు.  

సప్తమాధిపతి సప్తమం  లో ఉంటే

ఇది వ్యాపారానికి అనుకూలమయిన స్థానం. వీరి జీవిత భాగస్వామి ని బాగా అర్దం చేసుకోగలరు.

రవి ఉన్న రాజకీయం గా మంచి ఎదుగుదల. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగాలలో విజయం సాధించు అవకాశం. గురుడు ఉన్న, ఫైనాన్స్ రంగం లో వ్రుత్తి. ఆచార సాంప్రదాయలను పాఠించు అవకాశం. శని ఉన్న, కళత్ర విషయం లో ఇబ్బందులు. ఆలస్య వివాహం కానీ, లేదా, భాగస్వామి ని అర్దం చేసుకునే విషయం లో కాస్త ఎక్కువ సమయం పట్టచ్చు. బుధుడు ఉన్న వ్యాపారం లో విజయం. 

 

 

సప్తమాధిపతి అష్టమం లో ఉంటే

ఈ స్థానం కూడా కాస్త ఇబ్బందికరమయిన స్థానం. అధిక శ్రమ అనంతరం ఎదుగుదల

వివాహం మరియు కళత్ర విషయం లో కాస్త ఇబ్బందులు. ఆలస్య వివాహం, కళత్రం కు అనారోగ్య సమస్యలు లేదా భాగస్వామి తో గొడవలు కలిగవచ్చు.వివాహనంతరం ఆర్దిక అభివ్రుద్ది.వ్యాపారం లో కష్టపడి అభివ్రుద్ది లోకి వచ్చే అవకాశం. బుధుడు ఉన్న, సాంప్రదాయల పై విముఖత.  కుజూడు ఉన్న, ఆపరేషన్ అయ్యే అవకాశం. 

సప్తమాధిపతి నవమం లో ఉంటే

ఇది ఒక రాజయోగం. ఇది చాలా మంచి స్థానం. వివాహ జీవితం చాలా అద్భుతం గా ఉంటుంది. వివాహనంతరం ఉన్నత విద్య. శుక్రుడు ఉన్న, మామగారి తరపు నుంచి అద్రుష్టం కలిసి వచ్చు అవకాశం. విదేశాలకు వెళ్ళు అవకాశం. శని ఉన్న, నిదానం గా అద్రుష్టం కలుగును, ఉన్నత విద్య ఆలస్యం గా కానీ, లేదా ఉన్నత విద్య లో ఆటంకాలు గానీ కలుగవచ్చు.  

సప్తమాధిపతి దశమం లో ఉంటే

వివాహానంతరం వీరికి వ్రుత్తి యందు అభివ్రుద్ది. కీర్తి ప్రతిష్టలు కలుగు అవకాశం.

గురుడు, శని ఉన్న, ఉద్యోగం లో అభివ్రుద్ది ఆలస్యం. రవి ఉన్న, ఉద్యోగం లో అధికారయోగం లేదా రాజకీయలలో విజయం.ఏ గ్రహం ఉంటే ఆ  గ్రహ కారకత్వం బట్టి ఉద్యోగం లో అవకాశం కలుగును.

సప్తమాధిపతి ఏకాదశం లో ఉంటే

ఇది చాలా మంచి స్థానం. వివాహనంతరం ఆర్ధిక అభివ్రుద్ది. శని ఉన్న, ఫలితాలు పొందడం లో ఆలస్యం కలుగవచ్చు, కానీ ఖచ్చితం గా కలుగును. వ్యాపారం లో విజయం కలుగవచ్చు.

శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగలాలో లాభాలు కలుగును. కుజుడు ఉన్న, ఇంజనీరింగ్  ఫీల్డ్స్ లో లాభాలు కలుగును. శుక్రుడు గానీ, బుధుడు గానీ ఉన్న ప్రేమ వివాహానికి అవకాశాలు ఎక్కువ. 

సప్తమాధిపతి ద్వాదశం లో ఉంటే

వీరికి వివాహ సంబందిత సమస్యలు కలుగవచ్చు, అనగా, ఆలస్య వివాహం లేదా, వివాహానంతరం గొడవలు, మనస్పర్దలు వంటివి. అనుకూలమయిన గ్రహాలు ఈస్థానం లో ఉంటే, వివాహానంతరం విదేశాలకు వెళ్ళూ అవకాశం. జీవిత భాగస్వామి కి అనారోగ్య సమస్యలు. బుధుడు, శుక్రుడు శని, ఉన్న ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు అనుకూలం. శని, రవి ఉన్న రాజకీయ సంబందిత ఎదుగుదల.

అష్టమాధిపతి

అష్టమాధిపతి లగ్నం లో ఉంటే

అష్టమం ఆరోగ్యం, అయుష్షు, రహస్యాలు, అత్తగారిల్లు, ఆసుపత్రి వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

లగ్నం లో అష్టమాధిపతిఉంటే, వీరిని అర్దం చేసుకోవడం చాలా కస్టం. వీరు బహిర్గతం అవ్వరు. వీరికి రీసెర్చ్ పైన ఇంటరెస్ట్ ఉండు అవకాశాలు ఎక్కువ. గ్రహమును బట్టి ఏదయినా విషయం తెలుసుకోవాలని తపన ఉంటుంది.

గురుడు ఉన్న, ధన సంపాదన చేయటం లో విజయం సాధిస్తారు. కుజుడు ఉన్న, వైద్య రంగం లేదా తత్సంబందిత వ్రుత్తి చేపట్టు అవకాశం కలదు. శుక్రుడు ఉన్న, ప్రేమ వివాహం చేసుకొను అవకాశం. చంద్రుడు ఉన్న, బయాలజీ, ఫార్మసీ లేదా సైకాలజీ వంటి విద్యలు అభ్యసించి ఆ రంగం లో వ్రుత్తి చేపట్టూ అవకాశం కలదు.

అష్టమాధిపతి ద్వితీయం లో ఉంటే

శని, గురుడు ఉన్న ధన సంపాదన బాగుండును. శుక్రుడు ఉన్న, అనవసరమయిన సంబందాలు కలుగు అవకాశాలు ఎక్కువ.  కుజుడు ఉన్న, భూలాభాలు కలుగును, కానీ అది బహిర్గతం గా చాలా మందికి తెలియపరచరు. రవి ఉన్న, ధన సంపాదన లో తండ్రి పాత్ర ఉండును అనగా, తండ్రి సలహాలు తీసుకొనుట లేదా, తండ్రి నుండి ఆస్తి వచ్చు అవకాశం కలదు. కానీ, సంపాదన, లేదా ధనం విషయం లో ఒడిదుడుకులు ఎదురుకోవలసి రావచ్చు.

అష్టమాధిపతి త్రుతీయం లో ఉంటే

వీరి ప్రవర్తన సమాజం లో ఎక్కువగా కలవరు అనే విధం గా ఉంటుంది. వీరికి తమ్ముడు, లేదా చెల్లెళ్ళు ఉన్న, వారి తో తరచూ గొడవలు రావటం లేదా, వారికి ఆరోగ్య సమస్యలు కలుగవచ్చు.

కుజుడు ఉన్న, వైద్య వ్రుత్తి (సర్జన్లు) లేదా తత్సంబందిత వ్రుత్తులలో రాణీంచును. శని ఉన్న, భూగర్బ శాస్త్రం కానీ, కెమికల్ ఇండస్ట్రీ లో కానీ, రాణించు అవకాశం కలదు. శని వ్యాపారం లో ఆలస్యం గా నయినా విజయం ఇస్తాడు.

అష్టమాధిపతి చతుర్దం లో ఉంటే

చంద్రుడు ఉన్న, తల్లి కి ఆరోగ్య సమస్యలు లేదా తల్లి తో అనవసరమయిన వాదనలు కలుగును. వీరు, జీవశాస్త్రం లేదా మెడికల్ తత్సంబందిత వ్రుత్తులలో రాణించును. వీరికి రీసెర్చ్ చేయు అవకాశం కలదు. శని ఉన్న, వీరికి ప్రాధమిక విద్యలో ఆటంకాలు కలిగును, అనగా, ఒకే తరగతి రెండు సార్లు చదవటం కానీ, తక్కువ శ్రేణీ మార్కులతో ఉత్తీర్ణత చేందటం కానీ జరుగును. కుజుడు ఉన్న, ఆర్మీ, లేదా పోలీస్ రంగాలలో వ్రుత్తి చేపట్టు అవకాశం కలదు.

అష్టమాధిపతి పంచమం లో ఉంటే

సంతాన కలుగు విషయాం లో ఇబ్బందులు కలుగవచ్చు. వీరికి స్టాక్ మార్కెట్ విషయాలలో మంచి జ్ఞానం కలిగి ఉండు అవకాశం.

గురుడు ఉన్న, ధర్మాల పై ఆసక్తి. ఎంబియె వంటి విద్యలభ్యసించు అవకాశం కలదు. విద్యాభ్యాసం లో ఆటంకాలు కలుగు అవకాశం కలదు. రవి ఉన్న, తండ్రి క్రమశిక్షణ తో మెలుగు అవకాశం. బుధుడు ఉన్న, రచనలు చేయు అవకాశం. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగాలలో రాణించు అవకాశం.

అష్టమాధిపతి షష్టం లో ఉంటే

ఇది మంచి స్థానం అనే చెప్పాలి. వీరికి కష్టములు అనుభవించిన పిమ్మట, విజయాలు కలుగును. శని, కుజుడు,చంద్రుడు ఉన్న, వైద్య లేదా తత్సంబందిత వ్రుత్తి చేపట్టు అవకాశం కలదు. 

గురుడు ఉన్న, ఫైనాన్స్ రంగం లో విజయం సాధించును. కానీ, వీరు ఆర్దికంగా ఒడిదొడుకులు ఎదుర్కోంటారు.  శుక్రుడు, శని ఉన్న, విదేశీ యోగం.

అష్టమాధిపతి సప్తమం  లో ఉంటే

వివాహా సమస్యలు కలుగవచ్చు లేదా కళత్రానికి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.

జీవితం లో ఎదుగుదల బాగుండును కానీ, ఒకోసారి అకస్మాత్తుగా ఒడిదిడుకులు కలుగుతాయి. శుక్రుడు ఉన్న, కళత్ర సమస్యలు. శని ఉన్న, కళత్రం ను అర్దంచేసుకొనుట లో ఆలస్యం. చంద్రుడు ఉన్న, వైద్య విద్య లేదా తత్సమాన విద్య/వ్రుత్తి చేపట్టును.  

అష్టమాధిపతి అష్టమం  లో ఉంటే

వీరికి, కష్టములు ఎదుర్కున్న తర్వాత విజయాలు అనుభవించును. శని ఉన్న, రీసెర్చ్ విద్య లు అభ్యసించును. కుజుడు ఉన్న, వివాహ సమస్యలు కలుగును. రవి ఉన్న తండ్రి కి ఆరోగ్య సమస్యలు. శుక్రుడు ఉన్న, కుటుంబ సౌక్యం బాగానే ఉంటుంది. చంద్రుడు ఉన్న, వైద్య తత్సంబందిత వ్రుత్తి యందు రాణింపు. 

అష్టమాధిపతి నవమం లో ఉంటే

వీరికి అద్రుష్టం చాలా శ్రమ పడిన తర్వాత కలుగును. శని ఉన్న, ఉన్నత విద్యలలో ఆటంకాలు కలుగును. బుధుడు ఉన్న, రీసెర్చ్ విద్యను అభ్యసించును. గురుడు ఉన్న, ఫైనాన్స్ రంగం లో అభివ్రుద్ది. చంద్రుడు ఉన్న, తల్లి నుండి ఆచరణలు నేర్చుకొనును. రవి ఉన్న, తండ్రి నుండి ఆచరణలు నేర్చుకొనును.   

అష్టమాధిపతి దమం లో ఉంటే

ఉద్యోగం లో కష్టపడి ఎదుగుతారు. ఉద్యోగం లో అనుకోని మార్పులు, అనుకోని విధం గా ఉన్నత స్థానం కి ఎదుగుతారు. కుజుడు, శని, చంద్రుడు ఉన్న, వైద్య రంగం లేదా ఫార్మసీ  లో విజయం. రవి ఉన్న, అధికార యోగం లేదా రాజకీయా రంగం లో విజయం. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగం లో విజయం. 

అష్టమాధిపతి ఏకాదశం లో ఉంటే

జీవితం లో విజయాలు సాధించడానికి అధిక క్రుషి అవసరం. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగం లో క్రుషి చేసిన అనంతరం విజయం. శని ఉన్న వీరు, వీరికి ఉన్న ప్రతిభలు బహిర్గతం కావటానికి అధిక సమయం కలుగును. కుజుడు ఉన్న, వైద్య తత్సంబందిత వ్రుత్తి చేపట్టును.  గురుడు ఉన్న ఆలస్యం గా ఆర్దిక వ్రుద్ది జరుగును. 

అష్టమాధిపతి ద్వాదశం లో ఉంటే

శని, కుజ, చంద్ర సంబందం ఉన్న, వైద్య తత్సమాన వ్రుత్తి చేపట్టును. కుజుడు పోలీస్ లేదా ఆర్మీ వ్రుత్తి ఇచ్చు అవకాశం కలదు. రవి ఉన్న, ప్రబుత్వ రంగ ఉద్యోగం లేదా రాజకీయాలలో ఫారిన్ అఫైర్స్ లేదా సంబందిత రంగాలలో విజయం. గురుడు ఆర్దిక ఇబ్బందులు కలిగించును. వీరు, ఆశ్రమాలకు వెళ్ళడం, లేదా ప్రవచనాల ద్వారా ధన సంపాదన చేయటం జరుగును. రవి, శుక్రుడు వంటి గ్రహములు, నిద్ర లేమి సమస్యలు కలిగించును.   

***

No comments:

Post a Comment

Pages