మానసవీణ-26 - అచ్చంగా తెలుగు

 మానసవీణ-26

కూరెళ్ళవరహా సత్యవతి, హైదరాబాద్


         ‘ఇది నిజమా, నా భ్రమా! ఈ అమ్మాయే నా మనుమరాలా! అదేమిటో ఆ పిలుపులో, ఆ స్పర్శలో ఏదో ఆత్మీయతానురాగాలు తొంగి చూస్తున్నాయి. శ్రావణిని, ఆ అమ్మాయిని చూస్తే శ్రావణి పోలికలు ఆ అమ్మాయిలో లీలగా కనిపిస్తున్నాయి. దేవుడా! ఈమెనే నామనుమరాల్ని చెయ్యి. నేను బ్రతికుండగానే ఆ తల్లీ కూతుళ్ళను కలిపి నేను చేసిన ఘోరమైన పాపాన్నికడిగేసుకోనీ, దయచూడు తండ్రీ! ఆడపిల్ల అనే తేలిక భావంతో ఇంటి మహాలక్ష్మిని వెళ్ళగొట్టుకొని, కటిక దరిద్రుడిని అయ్యాను. తెలిసింది స్వామీ! ధనముంటేనే ధనవంతుడు కాదు. మమతలని పంచి, మంచిని పెంచే మనసున్నవాడే అసలైన ధనవంతుడన్న విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇప్పటికైనా నా వేదనను చూసి, నన్ను ఈ బాధనుండి విముక్తుడ్ని చెయ్యి స్వామి.’ వెళుతున్న మానసని సజల నయనాలతో చూస్తున్న భూషణం కన్నుల నుండి అశ్రువులు బుగ్గల మీదుగా జారాయి.

***

ఏమిటో అనిరుధ్! ఆ బెడ్‌మీద ఆ భూషణంగార్ని చూస్తే చాలా బాధగా వుంది. ఘోరమైననేరం చేసి కఠిన శిక్ష అనుభవిస్తున్న బాధ అతని కన్నుల్లో కనిపిస్తోంది. నన్ను చూడగానే అతని కన్నుల్లో కలిగిన సంతోషం చూశావా! పోగొట్టుకున్న వస్తువు ఏదో దొరికనంత ఆనందం కన్నుల్లో ద్యోతకమవుతోంది.

         “అంతే మానసాఉడుకు రక్తంతో చేసిన అనాలోచనఆవేశపూరితమైన పనులు అవసానదశలో ఆలోచనలో పడవేసి పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఆయన కన్నుల్లో నాకు కనిపిస్తున్నది అదే.

         “ఏమిటో అనిరుధ్‌ఎవరి బాధలు వారివి. అసలు ఎప్పుడూ గుడికి వచ్చి నన్ను ఆదరంగా పలకరించే శ్రావణమ్మగారు ఎందుకు ఈ మధ్య గుడికి రావటం లేదో అనుకున్న నాకు, ఇప్పుడు వారువారి మామగారికి బాగుండక పోవడంతో రాలేదని తెలిసింది. నాకైతే ఆవిడని చూడకపోతే ఏదోలా ఉంటుంది అనిరుధ్‌. ఆమె నవ్వులోఆమె స్పర్శలోఆమె మాటలో నాకు అమ్మ ఆత్మీయత తెలుస్తోంది. ఆమె కన్నుల్లో కూడా నన్ను చూడగానే పోయిన పెన్నిధి దొరికినంత ఆనందం తొంగి చూస్తుంది. ఏదోవిచిత్రం జరిగినట్టు మేమిద్దరమూ నిజంగా తల్లీ బిడ్డలమైతే! ఓహ్‌! పిచ్చి ఊహ!” తల విదిలిస్తున్న ఆమెకనుల నుండి చిప్పిల్లిన నీటిని చిటికిన వేలితో విదిలించింది.

         “బాధపడకు మానసా. నీవంటి మంచి మనసున్న మనిషికి మంచే జరుగుతుంది. పదిమంది మంచిని కోరే దానివి. నిస్వార్ధ సేవాతత్పరురాలివి.

         “ఆపుఆపు అంతవద్దు.

         “నీకు అది అంతకాకపోవచ్చు. నీ ప్రతిపనిలో మాకు కనిపించే సహాయతలు నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. సరే! మిమ్మల్నిద్దరిని గుడిలో కలిపిన మీ ఇద్దర్నీ తల్లీకూతుళ్ళను చేస్తుందన్నది నానమ్మకం... ఎందుకో నా మనస్సు పదే పదే చెప్తోంది మానస! ఆమెను చూడగానే నీలో కలిగే అలజడినిన్ను చూడగానే ఆమె పొందే తెలియని ఆనందం చూస్తే, మీ ఇద్దరూ తల్లీ కూతుళ్ళే అని అనిపిస్తోంది.”

నీమాటే నిజమైతే నన్ను మించిన అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు.

         “సరే అనిరుధ్‌ఆమెని అమ్మగా నాకు అందించగలదో లేదోగానిఆ దేవత నిన్ను నాకు మంచి స్నేహితుడిగా అందించి కొంత ఓదార్పు నిచ్చింది. అనుక్షణం నాకు చేదోడు వాదోడుగా ఉండే నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. సరిఅక్కడ సమీర నా గురించి ఎదురు చూస్తూ ఉ౦టుంది. మరి వెళదామా అంది మానస.

         “పద నిన్ను ఆశ్రమం దగ్గర దింపేస్తాను” అని కారెక్కాడు. అనుసరిస్తున్న ఆమెను చూస్తూ 'స్నేహితుడిగానే కానిచెలికానిగా నీ మనసులో చోటివ్వలేవా మానసా!' ఆత్మీయంగా అనుకుంటూ కారు స్టార్టు చేశాడు.

No comments:

Post a Comment

Pages