జ్యోతిష్య పాఠాలు - 14 - అచ్చంగా తెలుగు

 జ్యోతిష్య పాఠాలు - 14

పాఠం -  14

పి.ఎస్.వి.రవి కుమార్ 



నవమాధిపతి:

ఈ స్థానం ను భాగ్య స్థానం అంటారు. నవమం ద్వారా పూర్వ జన్మ పుణ్యం, తండ్రి, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య, తీర్థ యాత్రలు, ధర్మాచరణాల గురించి తెలుసుకోవచ్చు.

భాగ్యాధిపతి లగ్నం లో ఉంటే:

ఇది అద్రుష్టం అనే చెప్పాలి. వీరికి ధర్మానికి సంబందించిన అలోచనలు, ధర్మ కార్యాలు చేసే అలవాట్లు కలిగి ఉంటారు. గురుడు ఉంటే, తీర్థ యాత్రలు చేసే అవకాశం. ధన సంపాదన పై స్పష్టమైన ఆలోచన, వాటిని అమలు పరిచే సమర్దత కలిగిఉంటారు. శుక్రుడు ఉన్న, అన్ని ఆచారాలను తెలుసుకుంటారు. గురుడు, బుధుడు, శుక్రుడు, ఉన్నత విద్య ను ఇస్తారు. శని ఉన్న, క్రమశిక్షణ తో ఆచారాలు పాఠిస్తారు. ఉన్నత విద్య లో ఆలస్యం.

భాగ్యాధిపతి ద్వితీయం  లో ఉంటే:

వీరు ఎక్కువ గా ధన సంబందిత విషయల పై చర్చ లేదా, ధర్మ పరమైన చర్చలు చేసే అవకాశం. రవి ఉన్న, కుటుంబం లో మాట్లాడే విషయం లో జాగ్రథ్థ గా ఉండాలసిన అవసరం. చంద్రుడు ఉన్న, ధన సంపాదన లో ఒడిదుడుకులు. శని ఉన్న, అభివ్రుద్ద్ది లో ఆలస్యం. కుటుంబ బాధ్యతలు ఎక్కువ. గురుడు ఉన్న, అధిక ధన సంపాదన, ధర్మ పరమయిన చర్చలు. శుక్రుడు ఉన్న, వాక్కు ను ఉపయోగించి, క్రియేటివ్ రంగాలలో ధనసంపాదన.

భాగ్యాధిపతి త్రుతీయం లో ఉంటే:

వీరు సమాజం లో ప్రవచనకర్తలు గా ఉండు అవకాశం. వ్యాపారం లో అభివ్రుద్ది.

గురుడు ఉన్న, ప్రవచన కర్త లేదా ఉపాధ్యాయ వ్రుత్తి, ప్రొఫెసర్ వ్రుత్తి చేయు అవకాశం. శని ఉన్న, సమాజం లో అంతగా అకలవరు. వ్యాపారం చేయు అవకాశం. బుధుడు ఉన్న రచయితలు గా కానీ, మీడియా రంగం లో స్థిర పడు అవకాశం.త్రుతీయం కనిష్ట సోదరి సోదరీమణులు గురించి, మీడియా గురించి, సమాజం లో మాట్లాడే విధానాన్ని సూచిస్తుంది. కాబట్టి ఏ గ్రహం ఉన్ననూ, ఆగ్రహ సంబందిత రంగాలలో, ఉన్నత విద్య చేసి ఆ రంగాలలో వ్రుత్తి చేపట్టు అవకాశం. 

 

 

భాగ్యాధిపతి చతుర్దం లో ఉంటే:

ఇది ఒక రాజయోగం.

వీరికి ఉన్నత విద్య లో తల్లి సహకారం ఉండు అవకాశం లేదా ఉన్నత విద్య సొంత ఊర్లో లేదా స్వదేశం లో నే చేయు అవకాశం. శని ఉన్న, ఉన్నత విద్య సమయం లో తల్లి కి దూరం గా ఉండు అవకాశం లేదా ఉన్నత విద్య పూర్తి చేయుటకు ఆలస్యం. గురుడు ఉన్న, ఫైనాన్స్ రంగం లో ఉన్నత విద్య. సాంప్రదాయ విద్యలయందు ఆసక్తి.రవి ఉన్న. తండ్రి సహకారం తో ఉన్నత విద్య. ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్య. ప్రభుత్వ ఉద్యోగం చేయు అవకాశం లేదా తండ్రి ప్రభుత్వ రంగం లో ఉద్యోగం చేయు అవకాశం. కుజుడు ఉన్న, భూలాభం. చంద్రుడు ఉన్న మెడికల్ సంబందిత రంగాలలో ఉన్నత విద్య. బుధుడు ఉన్న, ఇంజనీరింగ్, టీచింగ్ రంగాలలో రాణింపు.

భాగ్యాధిపతి పంచమం లో ఉంటే

వీరికి సంతానం కలిగిన తరువాత ఆర్దిక లాభాలు కలుగును. ఉన్నత చదువులలో రాణించును. శని ఉన్న, అభివ్రుద్ది లో ఆలస్యం. గురుడు ఉన్న, సంతాన సంబందిత సమస్యలు, ఉన్నత విద్య లో ఆటంకాలు కలిగించును. శుక్రుడు ఉన్న, స్రుజనాత్మక రంగాలలో రాణింపు, స్త్రీ సంతానం కలుగటానికి అవకాశాలు ఎక్కువ.  కుజుడు ఉన్న ఇంజనీరింగ్ సంబందిత రంగాలలో ఉన్నత విద్య. బుధుడు ఉన్న, వ్యాపారం లో రాణింపు. రవి ఉన్న, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం. చంద్రుడు ఉన్న, రచనలు చేయు అవకాశం.

భాగ్యాధిపతి షష్టం లో ఉంటే

తండ్రి తో వాదనలు లేదా తండ్రి కి అనారోగ్య సమస్యలు, స్వంత ప్రదేశం నుండి దూరంగా నివసించు అవకాశం.

కుజుడు ఉన్న, ఉన్నత విద్య లో ఆటంకాలు, తండ్రి తో ఇబ్బందులు. శని ఉన్న, ఉన్నత విద్య ను అభ్యసించడం లో ఆలస్యం. మంచి ఆరోగ్యం. గురుడు ఉన్న, ధర్మాల గురించి మంచి జ్ఞానం, ఆర్దిక రంగాలలో ఉద్యోగం. 

భాగ్యాధిపతి సప్తమం లో ఉంటే

ఇది కూడా రాజయోగమే. రవి ఉన్న, ఆలస్య వివాహం లేదా వివాహానంతరం భాగస్వామి తో ఇబ్బందులు. గురుడు ఉన్న, ఉన్నత విద్య, ఆర్దికం గా అభివ్రుద్ది. శుక్రుడు ఉన్న, చూడచక్కనైన భాగస్వామి, ధర్మాచరణాలలో ఆసక్తి. కుజుడు ఉన్న, భాగస్వామి కి కోపం ఎక్కువ ఉండు అవకాశం. శని ఉన్న, ఆలస్య వివాహం లేదా భాగస్వామి తో తరచూ ఇబ్బందులు.

భాగ్యాధిపతి అష్టమం లో ఉంటే

రీసెర్చ్ విద్యలకు మంచి స్థానం. ఉన్నత విద్య లో తరచూ ఆటంకాలు లేదా అనుకున్న మార్కులు సాదించలేకపోవుట జరుగును.

గురుడు ఉన్న, అనవసరమయిన ఖర్చులు, జ్యోతిష్యం, వాస్తు, తత్సంబందిత విద్యలపై ఆసక్తి లేదా ఆర్దిక రంగాలకు సంబందించిన విద్య పై మక్కువ కలుగును. శని ఉన్న, ఆర్దిక అభివ్రుద్ది కి ఆలస్యం. శుక్రుడు ఉన్న, అత్తగారింటి నుండి ఎదో ఒక రకమయిన సహాయము అందును. చంద్రుడు ఉన్న, బయాలజి సంబందిత విద్యలలో రాణించును.

భాగ్యాధిపతి నవమం లో ఉంటే

రవి ఉన్న, తండ్రి నుండి సహాయము, ప్రబుత్వ రంగం లో జాతకునికి కానీ, జాతకుని తండ్రి కి గానీ, ఉద్యోగం. శని ఉన్న, తండ్రి తో సంబందాల విషయంలో ఇబ్బందులు కలిగించును. ఉన్నత విద్యల యందు, ఆలస్యం లేదా ఆటంకాలు.

చంద్రుడు ఉన్న, ఉన్నత విద్య ల యందు, తల్లి సహాయము. గురుడు ఉన్న, ఆర్దిక రంగాల యందు ఉన్నత విద్య. జ్యోతిష్యం, వాస్తు, ఇటు వంటి విద్యల యందు ఆసక్తి.

భాగ్యాధిపతి దశమం లో ఉంటే

ఇది కూడా రాజయోగమే. రవి ఉన్న, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం చేయు అవకాశాలు ఎక్కువ. చంద్రుడు ఉన్న, బయాలజీ, తత్సంబందిత రంగాలలో ఉద్యోగం. ఉద్యోగం యందు ఒడిదుడుకులు. కుజుడు ఉన్న, ఇంజనీరింగ్ రంగాలలో వ్రుత్తి. భూసంబందిత వ్యాపారం లేదా భూలాభం. శుక్రుడు ఉన్న, కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఉన్నత విద్య లేదా క్రియేటివ్ రంగాలఓ ఉన్నత విద్య, తత్సంబందిత రంగాలో ఉద్యోగం. గురుడు ఉన్న, ఉద్యోగం సాదించడం లో ఆలస్యం లేదా ఆర్దికంగా స్తిరపడటానికి ఆలస్యం అయ్యే అవకాశం. శని ఉన్న ఉద్యోగం లో ఆలస్య స్తిరత్వం. తరచూ ఉద్యోగాలు మారటం. 

భాగ్యాధిపతి ఏకాదశం లో ఉంటే

ఇది ఒక మంచి స్థానం అనే చెప్పాలి. వీరు ఆర్దికం గా బలవంతులు. రవి ఉన్న, తండ్రి చేసిన ఉద్యోగం చేయు అవకాశం, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం. చంద్రుడు ఉన్న ఒకోసారి, లాభాలు కలుగక నష్టాలు కలుగవచ్చు. కుజుడు ఉన్న,భూలాభాలు, ఇంజనీరింఘ్ సంబందిత ఇండస్ట్రీస్ లలో ఉద్యోగం చేయు అవకాశం. శుక్రుడు ఉన్న, అందరితో స్నేహభావం కలిగి ఉంటారు. స్రుజానాత్మక రంగాలలో ఉద్యోగం, లాభాలు. శని ఉన్న, లాభాలలో ఆలస్యం. అందరితో కలలేక పోవటం. స్నేహితులు కూడా తక్కువ. గురుడు ఉన్న, ఉపాధ్యాయ వ్రుత్తి, లేదా ప్రవచానాల ద్వార ధన సంపాదన జ్యోతిష్యం వాస్తు చెప్పడం ద్వారా కూడా సంపాదన.

భాగ్యాధిపతి ద్వాదశం లో ఉంటే

రవి ఉన్న, ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్యోగం చేయు అవకాశం. తండ్రి కి అనారోగ్యం చేయు అవకాశం. చంద్రుడు ఉన్న, ఫార్మసీ, వైద్య వ్రుత్తి చేయు అవకాశం. కుజుడు ఉన్న, ఆర్మీ, పోలీస్ సంబందిత రంగాలలో ఉద్యోగం. బుధుడు ఉన్న, ఎగుమతి, దిగుమతి వ్యాపారం, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇన్స్యూరన్స్ రంగాలలో ఉన్నత విద్య. శుక్రుడు ఉన్న, ప్రేమ వైఫల్యం అవ్వు అవకాశం, గురుడు ఉన్న, తీర్త యాత్రలు చేయును. గుడి దేవాలయాలలో వ్రుత్తి చేబట్టు అవకాశం. శని ఉన్న, విదేశాలకు వెళ్ళు అవకాశం.

***

దశమాధిపతి

దశమం ద్వారా, రాజ్యం, ఉద్యోగం, కర్మ, వ్యాపారం వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

దశమాధిపతి లగ్నం లో ఉంటే

రవి ఉన్న, నాయకత్వ లక్షణాలు కలిగి ఊంటారు. ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం సాధించును. చంద్రుడు ఉన్న, వ్రుత్తి యందు, భావోద్వేగాలు అధికం. కుజుడు ఉన్న, వ్రుత్తిని జీవితంగా భావిస్తారు. బుధుడు ఉన్న, సాఫ్ట్వేర్ రంగం లో కానీ, లెక్కల యందు కానీ, మార్కెటింగ్ రంగాలలో కానీ, వ్రుత్తి చేపట్టును, మంచి మార్కెటింగ్ నేర్పు కలిగి ఉందురు. గురుడు ఉన్న, ఉపాధ్యాయ వ్రుత్తి యందు ఆసక్తి. శుక్రుడు ఉన్న, అందరితో సత్సంబందాలు కలిగి ఉంటారు.

దశమాధిపతి ద్వితీయం లో ఉంటే

శని  ఉన్న, ఆర్దికం గా అంచెలంచెలుగా ఎదుగుతారు. కుటుంబం లో కుడా ఎక్కువగా మాట్లడరు. శుక్రుడు ఉన్న, మాట వలన ధన సంపాదన, గురుడు ఉన్న, ధన సంపాదన ఆలస్యం. ఎక్కువగా ధర్మాల గురించి మాట్లాడతారు. రవి ఉన్న, ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలలో రాణించే అవకాశం. చంద్రుడు ఉన్న, ధన సంపాదన లో అప్పుడప్పుడు ఒడిదుడుకులు. 

 

దశమాధిపతి త్రుతీయం లో ఉంటే

చంద్రుడు ఉన్న, బయాలజీ తత్సంబందిత రంగాలలో వ్రుత్తి లేదా సమాజం లేదా కమ్మ్యునికేషన్ రంగలలో వ్రుత్తి. శుక్రుడు ఉన్న, కాస్మెటిక్స్ అమ్ము రంగాలలో వ్రుత్తి లేదా అలంకరణ సంబందిత మార్కెటింగ్ రంగాలలో వ్రుత్తి. గురుడు ఉన్న, ప్రవచనాల ద్వార లేదా ఉపాధ్యాయ వ్రుత్తి ద్వారా సంపాదన. కుజుడు ఉన్న, వైద్య తత్సంబందిత రంగాలలో రాణింపు. 

దశమాధిపతి చతుర్దం లో ఉంటే

రవి ఉన్న, వ్యాపారానికి అవకాశం. నాయకత్వ లక్షణాలు కలిగి ఉందురు. చంద్రుడు ఉన్న, బయలజీ తత్సంబందిత రంగాలలో వ్రుత్తి. కుజుడు ఉన్న, ఇంజనీరింగ్ రంగాలలో వ్రుత్తి. గురుడు ఉన్న, ఉపాధ్యాయ వ్రుత్తి లేదా, ఆర్దిక రంగాలలో వ్రుత్తి. శుక్రుడు ఉన్న, సాఫ్ట్ వేర్ రంగాలలో కానీ, క్రియేటివ్ రంగాలలో కానీ, వ్రుత్తి చేపట్టును. వాహానల సంబందిత వ్యాపారం చేయు అవకాశం. 

దశమాధిపతి పంచమం లో ఉంటే

ఇది ఒక రాజయోగం. గురుడూ ఉన్న ఉపాధ్యాయ వ్రుత్తి చేపట్టు అవకాశం. శని ఉన్న, సంతానానికి కానీ, జీవితం లో నిలదొక్కుకోవటానికి కానీ, ఆలస్యం అవ్వు అవకాశం. రవి ఉన్న, ప్రభుత్వ రంగాలకు సంబందిచిన వ్రుత్తి. సంతాన సంబందిత సమస్యలు. చంద్రుడు ఉన్న, వైద్య రంగ తత్సంబందిత విద్య యందు ఆసక్తి, ఆ రంగాలలో వ్రుత్తి. శుక్రుడు, బుధుడు  ఉన్న, సాఫ్ట్ వేర్ రంగాలలో రాణింపు.

దశమాధిపతి షష్టం లో ఉంటే

కుజుడు, చంద్రుడు, శని ఉన్న, వైద్య తత్సంబందిత రంగాలలో విద్య ను అభ్యసించి, ఆ రంగాలలో వ్రుత్తి చేపట్టు అవకాశం. గురుడు ఉన్న, తరచూ రుణములు చేయును. రవి ఉన్న, ప్రభుత్వ హాస్పిటల్స్ లో గానీ, ప్రభుత్వ బ్యాంకింగ్ లో కానీ, ఉద్యోగం లభించును. గురుడు ఉన్న, ఆర్దిక రంగాలలో కానీ, బ్యాంకింగ్ రంగాలలో కానీ ఉద్యోగం లభించును. శుక్రుడు, బుధుడు ఉన్న, సాఫ్త్ వేర్ రంగాలలో వ్రుత్తి చేపట్టును. శని ఉన్న, విదేశాలకు వెళ్ళు అవకాశం.

దశమాధిపతి సప్తమం లో ఉంటే

ఈ స్థానం ఎక్కువగా వ్యాపారం లో విజయాన్ని ఇస్తుంది.

బుధుడు ఉన్న, వ్యాపారం లో అభివ్రుద్ది, విజయం. శని, రవి ఉన్న, రాజకీయ రంగాలలో విజయం. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగాలలో విజయం. గురుడు ఉన్న, ప్రవచనాల ద్వారాకానీ, ఆర్దిక రంగాలలో కానీ, ధన సంపాదన ఉండచ్చు.

దశమాధిపతి అష్టమం లో ఉంటే

శని, కుజులు కనుక ఉంటే, ఎదయిన విషయం పై అంతర్లీనం గా తెలుసుకుంటారు. వైద్య రంగానికి కానీ, రసయనాల గురించి కానీ, తత్సంబందిత విద్యల పై ఆసక్తి కనబరుస్తారు.

గురుడు ఉన్న, అనవసరమయిన ఖర్చులు చేయు అవకాశం ఎక్కువ. ఆర్దిక రంగం లో వ్రుత్తి చేపడుతారు.రవి ఉన్న ప్రభుత్వ రంగం లో వ్రుత్తి చేపట్టు అవకాశం కలదు. వీరికి ఏ గ్రహం ఉన్ననూ, వ్రుత్తి లో నయినా, వ్యాపారం లో నయినా ఒడిదుడుకులు ఉంటాయి.

దశమాధిపతి నవమం లో ఉంటే

ఉన్నత విద్య ఎందులో చేస్తారో, ఆ రంగం లో నే వ్రుత్తి చేపడతారు.విదేశాలలో నివసించు అవకాశం ఎక్కువ. బుధుడు, శుక్రుడు ఉంటే, సాఫ్ట్ వేర్ రంగాలలో వ్రుత్తి. శని ఉన్న, వ్రుత్తి లో అభివ్రుద్ది యందు ఆలస్యం. గురుడు ఉన్న, ఆర్దిక రంగాలలో కానీ, ప్రవచనాల ద్వారా ధన సంపాదన ఉండును.  

దశమాధిపతి దశమం లో ఉంటే

వీరు వ్రుత్తి లో త్వరగా అభివ్రుద్ది సాధిస్తారు. శని, బుధుడు ఉన్న, వ్యాపారం లో రాణిస్తారు. బుధుడు ఉన్న, ఉపాధ్యాయ వ్రుత్తి లో కానీ, సాఫ్ట్ వేర్ రంగం లో కానీ విజయం సాధిస్తారు. గురుడు ఉన్న, దేవాలయాల సంబందిత వ్రుత్తులలో కానీ, ఆర్దిక రంగాలలో గానీ, రాణిస్తారు. శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగాలలో కానీ, వాహనాల వ్యాపారం లో కానీ, డిజైనింగ్ వుత్తి వ్యాపారలలో కానీ, రాణిస్తారు. 

దశమాధిపతి ఏకాదశం లో ఉంటే

ఇది కూడా రాజయోగమే.

ఆర్దిక అభివ్రుద్ది బాగుంటుంది. గురుడు ఉన్న, ఆర్దిక లాభాలు కలిగించును.శుక్రుడు ఉన్న, క్రియేటివ్ రంగాలలో రాణింపు, అబ్బయిలకు, అమ్మయిలు, అమ్మయిలకు, అబ్బాయిలు స్నేహితులు ఉంటారు. కుజుడు ఉన్న, స్టాక్ మార్కెట్ లో అభివ్రుద్ది. బుధుడు ఉన్న, సాఫ్ట్ వేర్, మార్కెటింగ్ రంగాలలో రాణింపు, రచనా సామర్ధ్యం కలిగి ఉంటారు. రవి ఉన్న, ప్రభుత్వ రంగాలలో ఉన్నత స్తాయి పదవులు చేపట్టు అవకాశం.

దశమాధిపతి ద్వాదశం లో ఉంటే

ఇటువంటి జాతకులు ఎక్కువగా వేరే రాష్ట్రాలకు గానీ, వేరే దేశాలకు గానీ,వెళ్ళి వ్రుత్తి చేయు అవకాశం ఎక్కువ.

రవి ఉన్న, ప్రభుత్వ హాస్పిటల్స్ లో పని చేపట్టు అవకాశం ఎక్కువ. చంద్రుడు ఉన్న, వైద్య తత్సమాన వ్రుత్తి చేయు అవకాశం ఎక్కువ. కుజుడు ఉన్న, విదేశాలకు వెళ్ళు అవకాశం ఎక్కువ లేదా, పోలీస్ వ్యవస్థ లో కానీ, వైద్య వ్రుత్తి లో కానీ, పని చేయు అవకాశం ఎక్కువ. బుధుడు ఉన్న, ఇన్స్యూరెన్స్ కంపెనీలలో కానీ, సాఫ్ట్వేర్ లో ఇన్స్యూరెన్స్ సంబందిత ప్రాజక్ట్ల లో కానీ, పని చేయును. గురుడు ఉన్న, దేవాలయాల సంబందిత వ్రుత్తులు, పౌరహిత్యం, విదేశీ బ్యాంకింగ్ రంగాలలో అనగా ఫారిన్ ఎక్ష్చేంజ్ లో పని చేయు అవకాశం ఉండును.

(వచ్చే నెల మరికొంత)

No comments:

Post a Comment

Pages