శ్రీధర మాధురి - 92
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
నిన్న నిన్నటి దృక్పధంలో సరైనది.
ఇవాళ దాని స్వంత పద్ధతిలో సరైనదే.
రెండిటికీ పోలిక లేదు.
***
ఇవాళ తాజాగా, సజీవంగా ఉండండి. ఈ రోజుని, ఈ క్షణాన్ని ఆస్వాదించండి.
***
అహంకారులు దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతారు.
***
మీరు విడాకులు తీసుకుని, మళ్ళీ పెళ్లి చేసుకుని ఉండవచ్చు, కాని చట్టం సమ్మతిస్తే, మీరు మీకు మొదటి వివాహంలో పుట్టిన పిల్లలతో సంబంధాన్ని కొనసాగించాలి. పిల్లలు అమాయకులు, మీ ప్రేమ కోసం తపిస్తారు. వారిని బాధపడేలా చెయ్యడం నిజమైన అపరాధం.
***
భార్యాభర్తలు ఒకరినొకరు తమ అధీనంలో ఉంచుకోవాలని చూస్తే, అది నిజంగా నరకప్రాయం.
***
ఒకరు తన జాతకం నాకు పంపిస్తూ ఒక ఉత్తరం రాసారు ... అందులో అడిగిన ప్రశ్నలు ఇవి...
A. నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?
B. నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది?
C. నా భార్య ఉద్యోగం చేస్తుందా?
D. ఆమె అందంగా ఉంటుందా?
E. ఆమె వల్ల నాకు అదృష్టం కలిసి వస్తుందా?
F. నేను కెనడాలో స్థిరపడతానా, అమెరికాలోనా?
దయించి నా జాతకాన్ని అతి త్వరగా పరిశీలించి జవాబు పంపండి.
నేను ప్రశ్నల క్రమానికి అనుగుణంగా వెంటనే బదులు ఇచ్చాను.
A. నువ్వు మంచి కంపెనీలలో ఇంటర్వ్యూ లకు వెళ్ళినప్పుడల్లా, వారిని మెప్పించే విధంగా జవాబులిస్తే, నీకు మంచి ఉద్యోగం వస్తుంది.
B. మంచి ఉద్యోగం వచ్చాకా నీకు పెళ్లి అవుతుంది.
C. చాలామంది ఉద్యోగినులు ఉన్నారు, పెళ్ళికి వారినే నీవు సంప్రదించవచ్చు.
D. మనసుతో చూస్తే ప్రతి స్త్రీ అందమైనదే. అందుకే నీ భార్యను నువ్వు మనసుతో చూస్తే ఆమె అందంగా కనిపిస్తుంది.
E. నీవు అదృష్టవంతుడివి అయితే, ఆమె నీకు అదృష్టాన్ని తెస్తుంది.
F. గ్రీన్ లాండ్ లో స్థిరపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఈ కుర్రాడికి మహా అయితే 30 ఏళ్ళు ఉంటాయి. కాని నాకు అన్నగారిలా కనిపిస్తాడు. అతి కష్టం మీద ఇతను డిగ్రీ పూర్తి చేసాడు. ఇతను ఇప్పటికే సుమారు 25 కంపెనీలలో ఉద్యోగం చేసాడు, వారు ఇతన్ని తీసేశారు, లేక కంపెనీలే మూసేశారు. జీవితంలో ఇతను దేనికీ కట్టుబడి ఉండడు. అందరి మీదా ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. అతనికి స్నేహితులే లేరు. ఇతనికున్న లోభాన్ని కాస్త గమనించండి. మా ప్రార్ధనలు.
***
మీరు జాగృతితో, జ్ఞానంతో ఉంటే తప్ప, కోరిక లోభంగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయి.
***
No comments:
Post a Comment