శివం -81
రాజ కార్తీక్
(హర సిద్ధుడు తను ఉంటున్న రాజ్యంలో రాజు గారి ఆహ్వానం మీద వెళ్లి పురాతన భవనాన్ని దేవాలయంగా మారుద్దామని అలాగే ఆ రాజధాని చిహ్నం ప్రతిధ్వనించే విధంగా చేయాలని రాజు గారి తలంపు ని, నెరవేరుస్తానని మాట్లాడుతూ ఉంటాడు)
అయ్యన్న .."భళా మిత్రమా హర సిద్ధ! తమరి ప్రణాళిక ఇంక ను మాకు తెలపండి అని చాలా ఉత్సుకత గా అడిగాడు."
హ సి "మహారాజా! మొదట ఒకసారి ఆ భవనాన్ని పూర్తిగా శుభ్రం చేస్తే.. నేను మరొకమారు పరిశీలించుకుని.. పూర్తి ప్రణాళికను సిద్ధం చేసి సాధ్యమైనంత వేగంగా పని పూర్తి చేస్తాను."
అయ్యన్న *"హర సిద్దు.. మీకు గతంలో ఇంకేమన్నా దేవాలయాన్ని బాగు చేసినది అనుభవం ఉందా."
సభలోని ఒక కురువృద్ధుడు.
లేచి మహారాజా.. ఒకసారి మీతో మాట్లాడ వలెను అని కొద్దిపాటి గౌరవం తో కూడిన అజ్ఞా లాగా ఉంది అతని స్వరం..
ఒక్క నిమిషము హర సిద్ధ అని. ఆ మహారాజు పక్కకు వెళ్ళిపోయాడు..
ఇప్పుడు సభ ని చూస్తున్నాడు హార సిద్ధుడు.. అందర్నీ పరికించి చూస్తున్నాడు..
అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ తనకు తెలిసిన వారే తనతో ఓ రకమైన వాగ్వివాదం ఉన్నవారే..
ప్రధానంగా ఉన్నాడు తనని మోసం చేసిన శుశ్రూష చేసిన తన ఆచార్యుడు.. అతన్ని చూసి మౌనం వహించాడు మన సిద్ధూ.. అతడు మాత్రం వెన్నుపోటు పొడిచిన తేనె పుసిన కత్తి వలె, వాత్సల్యంతో నవ్వుతు నటిస్తున్నాడు.. తన కుటుంబం గురించి తెలిసిన రాజోద్యోగులు కూడా, ఆ సభలో ఉన్నారు, అలాగే తాను న్యాయం కోసం భరతం పట్టిన వారు కూడా.. ఆ మందితో కలిసి ఉన్నారు.. రాజా సైనికులు కాకముందు.. ఇప్పుడు హర సిద్ధుని తెచ్చిన వారు కూడా.. మన వాడి చేతిలో తన్నులు తిన్న వారే.. ఎంతోమందికి గుణపాఠం నేర్పాడు, కావున ఒకరి ఏం గుర్తుపెట్టుకుంటాడు హర సిద్ధుడ.. ఇంకా ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ముందు చూద్దురుగాని లే..
వారందరికీ మాత్రం ఎంతో ఈర్ష అసూయ గా ఉంది.. తాము ఇంత కాలం.. రాజు దగ్గర ఎంతో కీర్తి సంపాదించారు.. కానీ వీడు మాత్రం రాజుగారు చేత పిలిపించుకొని మర్యాద మన్ననలు పొందుతున్నాడు, ఖచ్చితంగా రాజు గారు చెప్పిన పని చేసిన తర్వాత.. మరింత ఆదరణ పొంది మన కన్నా ఎక్కువ ప్రతిఫలం అనుభవ స్తాడు.అని అనుకుంటున్నారు.
హర సిద్ధు దేహశుద్ధి చేసిన.. వారు కూడా అందులో చాలామంది ఉన్నారు.. హర సిద్ధితో వాగ్వాదం గెలవలేక. దెబ్బ కొడదామని చూసేవారు..ఇలా ఒకటేంటి ముందరే చెప్పాగా.. యదార్థవాది లోకవిరోధి.. అసలు సిసలు కథానాయకుడికి ప్రతి నాయకులు కూడా ఎక్కువే కద..
భక్తులారా ఒకటి గమనించండి.. మన హర సిద్దు ఏనాడు ఎవరిని కావాలని దండించ లేదు.. ధర్మం కోసం మాతృభూమి కోసం... వారికి గుణపాఠం నేర్పడం కోసం మాత్రమే సమర్థవంతంగా న్యాయంగా చేశాడు అదే ఒక రాజు ఉండే లక్షణం.. అతడు తప్పులు చేసి ఉండొచ్చు గాక.. కానీ తన తప్పులకు క్షమాపణ వేడుకొనే తిరిగి ఆ తప్పు చేయకుండా ధర్మం కోసం నిలబడ్డాడు.. అందుకే అతగాడి కోసం నేను వచ్చా.. అలాగే ధర్మం కోసం మీరు నిలబడండి.
ఎక్కడ ఉన్నా మీ కోసం నేను కూడా ఏదో ఒక రూపంలో కచ్చితంగా వస్తాను..
హర సిద్ధుడు మాత్రం.. నాకోసం కుంభన్న వచ్చాడంటే.. నేనంటే ఆయనకి ఇష్టమనే గా.. సాక్షాత్తు శివుడే నా స్నేహితుడు అయిన తర్వాత, ఇక వీరందరి మీద కోపం మనకు అనవసరం.. ఈ రాజ్యం తన పుట్టాడు కాబట్టి .. మాతృభూమి లో. చిరస్థాయిగా గుర్తుండే దైవ సేవ ఒకటి చేసి, తన తల్లిని తన సోదరుని. తీసుకొని వెళ్లి.. కుంభన్న రాజ్యంలో .. అక్కడ రాజు గారిని.. ధర్మయ్య బాబాయిని.. తలుచుకొని ని. తనకేదో ఉన్నతమైన స్థానం ఇవ్వబోతున్నాడని తన మనస్సు చెప్తుంది కాబట్టి.. అక్కడే స్థిరపడదాం అని నిర్ణయించుకున్నాడు.. కానీ ఇదంతా చెప్పకుండా తన తల్లికి ఆశ్చర్యం కలిగించే ఆనందింప చేద్దామనుకున్నాడు.. ఒక్క తాతకి తప్ప.. తాను చేసినది ఎవరికీ చెప్పలేదు.. ఎందుకంటే ఎవరికీ చెప్ప వలసిన అవసరం లేదు..
అయ్యన్న ఆ కురువృద్ధులు మాట్లాడుకుంటున్నారు వాటి సారాంశం ఏమనగా..
"అయ్యన్న రాజు తన ముందు ఉన్న ఎనిమిది వ తరం , కి చెందిన అప్పన్న రాజు కి.. సాక్షాత్తు రాజ్యలక్ష్మి దర్శనమిచ్చిoది.... ఆ రాజ్యలక్ష్మీదేవి కనపడినప్పుడు.. ఆమె వెనక.. శ్రీ చక్రము వలె.. మరొక చక్రం లో దర్శనమిచ్చింది.. అప్పన్న రాజు కోరిక మేరకు.. ఆ చక్ర ముద్రికను.. హారము వలె తీసుకొని.. పట్టపురాణి ఆ హారాన్ని ధరించే విధంగా, శాసనం నిర్ణయించుకొని.. ఆ హారాన్ని పోలిన దాని వలె. ఒక ముద్రను తయారు చేసి అది తన రాజ్య ముద్రగా. చేసుకొని పరిపాలన సాగించారు.. అప్పన్న రాజు నుండి వచ్చే 8వ తరం . అప్పుడు రాజ్యానికి ప్రమాదముందని. ఆ ప్రమాదం నివారించుటకై.. రాజ్య కారకుడైన ఈశ్వరుడికి, రాజ్యలక్ష్మికి మహా విష్ణువు కి ఆలయ నిర్మించాలని .. దానితో రాజ్యము వచ్చే ఆపద పోవునని.. సాక్షాత్తు.. ఆ రాజ్యలక్ష్మి మాత సెలవిచ్చింది.. ఇప్పుడు హర సిద్ధుడు చెప్పిన భవనం నిజంగా ఒక తరం మునుపు దేవాలయం కోసం కట్టినది.. శత్రు దేశాల దండయాత్ర వల్ల అవి ఆగిపోయ.. అలా శిథిలావస్థలో ఉన్నాయి. కానీ ఆ హార సిద్ధుడు మనం ఏమి చెప్పకుండానే. ఆ భవనాన్ని దేవాలయంగా మారుద్దామని ప్రకటించాడు.. రాజ్య లక్ష్మి దేవి ఇచ్చిన చిహ్నాన్ని ఆ చిహ్నం లోని క్రమబద్ధీకరణ చేసే యంత్రాన్ని . ఆ శక్తిని కోల్పోకుండా కొద్దిపాటి మార్పులతో అప్పటి రాజ గురువు చేత.. ప్రజా బాహుళ్యం లోకి రాజముద్ర గా రాజశాసనం ముద్ర గా. విడుదల చేశారు.. కానీ ఇప్పుడు ఆ దేవాలయంలో మాత్రం.. అప్పన్న రాజు సెలవిచ్చిన విధముగా.. నిజమైన చిహ్నం ను చెక్క వలెను. "అని తీర్మానించుకున్నారు.
హార సిద్ధుని ఏకాంత మందిరంలో కి పిలిచారు, భటులు రాజాజ్ఞ మీద..
సభలో ఉన్న హార సిద్ద వ్యతిరేక సంఘం వారు, ఏమి చేయాలో పాలుపోక ఈర్ష అసూయ తో రగిలిపోతున్నారు..
ఏకాంత మందిరంలో జరిగిన కథంతా చెప్పారు వారు సిద్ధుని తో..
దానికి మన హార సిద్ధుడు ఒక సమాధానం సూచించాడు..
భక్తులారా ఎల్లప్పుడూ ఒక సమస్యని పరిష్కరించే మనస్తత్వం పెట్టుకోండి.. కచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది.
హార సిద్దు "మహారాజా.. మహారాణి మాకు తల్లి వంటిది.. దీనికి నేను ఒక సమాధానం చెబుతాను.. ఆ భవనాన్ని బాగు చేసిన వెంటనే, మహారాణి గారిని మీరు తీసుకొచ్చినట్లు అయితే.. ఆమె మెడలోని హారాన్ని నేను పరిశీలనగా గమనించి పెట్టి చిన్న వృత్తాన్ని కూడా గుర్తుంచుకొని.. ఆ యొక్క ప్రతిమ ను కొంచెం కూడా తేడా లేకుండా.. చెక్కు తాను.. అది సాక్షాత్తు గర్భగుడిలో ఉంటుంది.. దాని తర్వాత మీరు కోరిన విధంగా ఆలయమంతా ఎవరికీ తేడా తెలియకుండా మన రాజ చిహ్నం మేర అనుకునే విధంగా చెక్కుతాను.. మరొకమారు మన రాజ శాసనాన్ని పరికించి.. మీరు కోరుకునే విధంగా చేద్దాం."
అయ్యన్న " భళా హార సిద్ధూ.. నీకు ప్రతిఫలం ఏమి కావాలి?"
హర సిద్దు."నా మాతృభూమి లో దైవ సేవ చేయటానికి నాకు ఏమి ప్రతిఫలం వద్దు అండి.. కానీ నాదొక చిన్న విన్నపం.. మా నాన్నగారి చనిపోవడం వలన.. రాజ్య ఖజానా కి మేము కొంత ధనము రుణం లాగా చెల్లించవలెను.. అది ఇప్పటికీ కొంత కడుతున్నాము.. నేను చేసిన ఈ పనికి ప్రతిఫలంగా.. రాజ్యానికి మేమున్న రుణాలు రద్దు చేస్తే సంతోషం మహారాజా అది ప్రస్తుతం మా తల్లిగారి పేరుమీద ఉన్నది.. ఆమెని రుణ విముక్తి రాలు చేద్దామని. నా మనవి."
అయ్యన్న " రద్దు చేయబడింది పని మొదలు పెట్టండి"అని హర సిద్దు ను చూస్తూ అన్నాడు
వచ్చే పౌర్ణమి లోపలే.. అంతా పని సిద్ధం చేస్తాన మహారాజా అని ఉత్సాహంగా బదులిచ్చాడు..
రాజా అజ్ఞా మేర సైనికులు ఇంటికి వచ్చి.. నేటితో మీరు కట్టవలసిన రుణం అంతా రద్దు అయిపోయిందని హర సిద్ధిని తల్లికి సోదరునుకు చెప్పటం వల్ల.. వారు ఎంతో ఆనంద పడి తమ తలపైన భారం లేదని సంతోషపడ్డారు...
తాము కొన్ని సంవత్సరాలుగా చేయలేం దాన్ని హార సిద్దు ఒకే ఒక చర్య తో ఎలా చేశాడు అని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు..
హర సిద్ధుడు మాత్రం పౌర్ణమి తర్వాత తను చూపించే ఆశ్చర్యానికి తన తల్లి ఎంత ఉప్పొంగి పోతుందో అని కలలు కంటున్నాడు..
వైకుంఠపాళి ఆట లో నిచ్చెన ఏ కాదు పాములు కూడా ఉంటాయి...
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment