వృద్ధాప్యపు వ్యధలు-వృద్ధుల సొదలు - అచ్చంగా తెలుగు

వృద్ధాప్యపు వ్యధలు-వృద్ధుల సొదలు

Share This

వృద్ధాప్యపు వ్యధలు-వృద్ధుల సొదలు 

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.




ఇష్టాలన్నీకష్టాలవుతుంటాయి వృద్ధాప్యంలో,

అదృష్టాలన్నీ క్లిష్టాలవుతూ ఉంటాయి ఆ జాప్యంలో.


గతంలో చేసిన పాపాలన్నీకసరుకున్నకోపాలై,

కొసరు కోరుకున్న తాపాలై,

భయంకర రూపాలై భయపెడతాయి, 

చీటికీ మాటికీ చీకటి చీడలై చుట్టుకుంటాయి,

పూట పూటకీ ప్రేతపు పీడలై పట్టుకుంటాయి.


అవగతం కాక గతంలో చేసిన కార్యాలన్నీ

మూకుమ్మడిగా ముసురుకుంటాయి,

కొంచెం కొంచెంగా ఉసురు తీస్తూ ఉంటాయి,

శాఖోపశాకలై శాపాలై మసలుతుంటాయి, 

ఆ తరుణంలో ధుమధుమల ధూపాలై దూసుకొస్తాయి.

 ***

No comments:

Post a Comment

Pages