'న్యూ ఇయర్' వేడుకల ఆరంభం!
-సుజాత. పి.వి.ఎల్.
కొత్త సంవత్సరం ప్ర్రారంభమయ్యే రోజు ప్రతి ఏడాది జనవరి 1 వ తేదీ. ఇది ఆంగ్ల కాలమాన గణన లెక్కల ప్రకారం 'న్యూ ఇయర్' గా పరిగణించడం జరిగింది. అయితే, అనేక దేశాల్లో వారి వారి సంప్రదాయాలు, సంస్కృతులు, అనేక విధాలుగా ఉండటం చేత వేరు వేరు తేదీల్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుంటాయి. జనవరి 1 వ తేదీ 'న్యూ ఇయర్ డే' గా ఎలా పరిగణలోకి వచ్చిందంటే..జూలియన్ క్యాలెండర్ మరియు రోమన్ క్యాలెండర్ క్రీ.పూ.153 తరువాత జనవరి ఫస్ట్ సంవత్సరంలో తొలిరోజు అయ్యింది. అప్పట్నుంచి న్యూ ఇయర్ ని జనవరి ఫస్ట్ న జరుపుకుంటున్నాం. పశ్చిమ ఐరోపాలో జూలియన్ క్యాలెండర్ ఇప్పటికి వాడుకలో ఉన్నా కూడా అక్కడి అధికారులు లొకేల్ ను బట్టి మొదట నూతన సంవత్సర దినోత్సవాన్ని మార్చి 1, మార్చి 25, సెప్టెంబర్ 1మరియు డిసెంబర్ 25 ఇలా అనేక రోజులు మార్పులు, చేర్పుల అనంతరం జనవరి ఒకటో తేదీనే న్యూ ఇయర్ గా ప్రకటించారు. వివిధ ప్రాంతాలవారు, వారి ఆచార వ్యవహారాలననుసరించి (గెగోరీచున్) 'సౌర క్యాలెండర్' ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. ఉదాహరణకి 'చైనీస్ న్యూ ఇయర్', 'ఇస్లామిక్ న్యూ ఇయర్', 'జాపనీస్ న్యూ ఇయర్' మరియు 'యూదుల న్యూ ఇయర్' ఇలా. వివిధ దేశాల్లో కొత్త సంవత్సరాన్ని చంద్ర నూతన సంవత్సరం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మొదటి మాసమైన చంద్ర నెలలో వచ్చే అమావాస్య నుండి జనవరి 21 మరియు ఫిబ్రవరి 21 తేదీల మధ్య కాలం ఐదు మూలాలకు అనుగుణంగా ఉంటుంది. పది స్వర్గ మార్గాలకు ప్రధానమైన కాలం. సాధారణంగా సంవత్సరాన్ని పన్నెండు నెలలుగా విభజించి లెక్కిస్తారు. ఈ పన్నెండు మాసాలు ఒక్కో నెల ఒక్కో జంతువూ రాసుల ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రాశుల కలయిక 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రాశి చక్రంగా ఏర్పడుతుంది. దీన్నే 'న్యూ ఇయర్' గా పరిగణించడం జరిగింది. కొరియన్ న్యూ ఇయర్ సియోలాల్ చంద్ర మాన కాలం ప్రకారం జనవరి ఒకటవ తేదీన వచ్చింది. వీరికి సంవత్సరంలో మొదటి రోజు అయిన జనవరి 1 అంటే సియోలాల్ కొరియన్లకు అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. వియత్నా మీస్ న్యూ ఇయర్ అనేది టాట్న్గుయాన్. ఇది చైనీస్ క్యాలెండర్ లాగానే చంద్ర క్యాలెండర్ను పోలి ఉండటం వల్ల వారు ఈ క్యాలెండర్ నే అనుసరిస్తారు. అందుకే చైనీస్ న్యూ ఇయర్ అని పేరొచ్చింది. టిబెట్ న్యూ ఇయర్ లోసర్ మరియు జనవరి మార్చి నెలల మధ్య కాలంలో వస్తుంది. బాబిలోనియస్ న్యూ ఇయర్ ఉత్తర దిశ కాలం తరువాత వచ్చే మొదటి అమావాస్యతో ప్రారంభమైనట్టు చెప్పబడింది. ఈ వేడుకలు ప్రాచీన కాలంలో పదకొండు రోజుల పాటు చేసుకునేవారుట. 'నౌరోజ్' అని పిలవబడే ఇరానియన్ న్యూ ఇయర్ ఉత్తర కాలంలో వచ్చే ప్రత్యేక మాసంగా గుర్తించబడింది. ఇది సాధారణంగా మార్చి 20లేదా 21 తేదీలలో వస్తుంది. ఇది వసంత ఋతువుకి ప్రారంభ చిహ్నంగా భావిస్తారు. జోరాస్ట్రియన్ న్యూ ఇయర్ ఇరానియన్ న్యూ ఇయర్ ఆఫ్ నౌరోజ్ తో సమానంగా ఉంటుంది. దీనిని భారత దేశంలో పార్సీలుమరియు జొరాస్ట్రియన్ లు ఈ న్యూ ఇయర్ ని జరుపుకుంటారు. సాకా క్యాలెండర్ ప్రకారం బాలనీస్ జవానిస్ కాల మాన లెక్కల ఆధారంగా బాలనీస్ న్యూ ఇయర్ ను 'నైఫీ' అని పిలుస్తారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం న్యూ ఇయర్ ఏప్రిల్ మాసంలో వచ్చే మొదటి పున్నమి రోజుగా పరిగణించారు. వీరు పౌర్ణమి నుండి మూడు రోజులు వరుసగాకొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. అయితే మహాయాన బౌద్దులు మాత్రం జనవరిలో వచ్చే పౌర్ణమి నుండి మూడు రోజులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. సిక్కులు బైసాకి పేరుతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13 లేక14వతేదీన ఈ కొత్త సంవత్సర వేడుకలు చేసుకుంటారు. నానక్ సాహి క్యాలెండర్ననుసరించి జరుపుకుంటారు. ఎందుకంటే సిక్కుల పదవ గురువు గురుగోవింద సింగ్ స్మృత్యార్థం.వారు ఆరోజునే నూతన సంవత్సరం గా భావిస్తారు. ఇంకా ప్రపంచంలోని ఇతర దేశాలు వారి సంప్రదాయాల ప్రకారం వారికి నిర్ణయించబడిన వివిధ తేదీల ప్రకారం ప్రతి ఏడాది ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సర సంబరాలు జరుపుకుంటున్నారు. జనవరి 7ఈజిప్టియన్ న్యూ ఇయర్, జనవరి 14 ఓల్డ్ స్కాటిష్ న్యూ ఇయర్, జనవరి 21 సెల్టిక్ న్యూ ఇయర్ మరియు కోరియన్స్ న్యూ ఇయర్. ఫిబ్రవరి లో వచ్చే అమావాస్య టిబెటియన్స్ కు న్యూ ఇయర్. మార్చి 1 రొమాన్స్ న్యూ ఇయర్ డే. మార్చి 14 సిక్కుల నూతన సంవత్సర దినోత్సవం. మార్చి 21 బహాయ్ జనుల న్యూ ఇయర్. ఉగాది తెలుగు ప్రజల నూతన వత్సరం. ఏప్రిల్ 14 ఆగ్నేయాసియా దేశాలు, నేపాలీయన్లకు కొత్త సంవత్సరం. మే నెలలో వచ్చే బుద్ధ పూర్ణిమ బౌద్దులకు అత్యంత ముఖ్యమైనది. బౌద్దులు జూన్ 21 న ఏనిసెంట్ గ్రీక్ న్యూ ఇయర్ ను జరుపుకుంటారు. జూలై 9 ఆర్మేనియం న్యూ ఇయర్.ఆగస్టు 8 మలయాళీలన్యూ ఇయర్. ఆగస్టు 23జోరాస్ట్రియన్, సెప్టెంబర్ 1 రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్, సెప్టెంబర్ 1ఇథియోపియన్, అక్టోబర్ 3 మొరాకో, నవంబర్ దీపావళి జైనులు, డిసెంబర్ మాసం సిక్కిం లు. .ఇలా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు.దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులో చిత్రాయ్ మొదటి తేదీన ఏప్రిల్ 13,14 ,15 తారీఖుల్లో చిత్రాయ్ విశు పేరిట న్యూ ఇయర్ ని జరుపుకుంటారు. బెంగాలీలు పహేషా బొయిషాక్ పేరుతో, మణిపూర్ ప్రజలు చౌరాబాన్ పేరుతో , తుళు ప్రాంతం వారు బిసు పేరుతో 'గుడి పద్వా'కు అనుగుణంగా న్యూ ఇయర్ ని జరుపుకుంటారు. ఇలా పలు దేశాలలో పలురకాల పేరుతో వివిధ తేదీల్లో ఆంగ్ల సంవత్సరాదిని ఆనందంతో ఆహ్వానిస్తూ న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకుంటారు.
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2022 !
******
No comments:
Post a Comment