శివం - 83
రాజ కార్తీక్
(నూతన దేవాలయంలో రాజముద్ర చెక్కుతూ ఉండటం. ఉన్నపళంగా మెరుపు వచ్చి పగలే ఉరుముల వల్ల ఆకాశం చిమ్మచీకటి ఆవ్వడం.. అక్కడ ఉన్న రాజముద్రిక ఒకటి మాయమవడం దాని కోసం వెతకడం.. రాజు హర సిద్ధుని.. దొంగ అనడం... ఇంక చదవండి.)
హార సిద్దా "మహారాజా ఏమంటున్నారు మీరు .. తమరు అలా ఎందుకు అన్నారు? అది సబబు కాదు,"
అయ్యన్న రాజు "నోరు ముయ్యి రా.. నిన్ను నమ్మి చెప్పినంత చేశాను. ప్రణాళికాబద్ధంగా ఇదంతా చేసి రాజముద్ర ను ఆపహరించవు.."
హార సిద్ద "మహారాజా! మాటలు మర్యాదగా రానివ్వండి.. ఎవర్ని పట్టుకుని మీరు దొంగ అంటున్నారు, నిజానిజాలు తెలియకుండా ఇలా మాట్లాడినందుకు తరువాత మీరు ఎంతో పశ్చాతాప పడతారు.."
హార సిద్ధుడు ఎదురుగా ఉన్నది మహారాజు అయినా సరే తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకో లేదు..
రాజు "నన్నే పట్టుకొని పశ్చాత్తాప పడతాడు అంటున్నావా..?'
అనడంతోనే కొంతమంది సైనికులు దగ్గరికి వచ్చారు, హర సిద్దా దగ్గరకు..
"ఎదురుగా ఉన్నది రాజు! మహారాజు అని కూడా మర్చి పోయి పశ్చాత్తాప పడతారు, కుమిలిపోతారని నన్నే నువ్వు వారిస్తావా? ఎంత కండ కావరం రా నీకు?"
హర సిద్దు "తప్పు ఎవరు చేసినా ఒకటే మహారాజా.. ఆపై వాడికి అందరి తప్పులూ ఒకేలాగా కనపడతాయి.. పైగా ఈ నూతన దేవాలయంలో మీరు.. ఇలా నన్ను అనటమ్.. సబబు కాదు"
రాజు "ఓహో అలాగా అయితే.. మరి దొంగలంటే వేరొకరు ఉంటే.. ఈ ప్రాంగణం దాటి పోలేరు ఒక్క మనిషి కూడా ఇక్కడ లేడు.. మన సైనికులు అందరినీ శోధన చేసిన తర్వాతే.. ఇక మిగిలింది ఒక్కటే.. నిన్ను శోధించటం మీ దగ్గర నుంచి నిజాన్ని రాబట్టటం" అని చప్పట్లు కొట్టాడు.
సైనికులు వచ్చి హరసిద్దు ను వెతకటానికి హర సిద్ధుని అనుమతి లేకుండానే తన శరీరమంతా వెతికారు.. కానీ వారికి ఏమీ దొరకలేదు..
హర సిద్దా.. "చూశారా మహారాజా అనవసరంగా మీరు నోరు జారారు.."
మహారాజుకి కోపం కపాలం దాటిపోయింది.. కోపంలో ఆలోచన చేస్తున్నాడు.. వీడు కావాలనే నా కంట పడాలని ఆ దేవాలయాన్ని బాగా చేశాడు.. వీడు కావాలనే నా ముందు మంచివాడిగా నటించి నాకు మంచి ప్రణాళికలు చెప్పి నా దగ్గర ఉన్నతంగా నటించి.. ఆ రాజ ముద్రికలు దొంగలించి.. పూర్తిగా మా సామ్రాజ్యం నాశనం చేయాలని. మా రాజ్యపు శత్రు దేశాల గూఢచారులు పంపిన వ్యక్తి, అని మానసికంగా తనకున్న అనుభవంతో ఒక నిర్ధారణకు వచ్చారు.
హర సిద్ధుని బంధించి విచారణ చేయవలసిందిగా, ఆదేశించాడు
హర సిద్దు "మహారాజా నేను ఇక్కడే ఉన్నాను కదా! మీ తర్కం ప్రకారమే మాట్లాడదాము.. నేను ఎక్కడికి పోలేదు కదా.. నేను మరి రాజముద్రిక ను ఎక్కడ దాచి ఉంటాను.. ఆలోచించండి మహారాజా! కోపంలో మీరు నన్ను అన్నా పితృ సమానులు గా భావించి పోనీలే అనుకుంటా కానీ చేయని నేరం నా మీద వేసి ఇలా అసత్య ఆరోపణలు చేస్తే నా వ్యక్తిత్వం దెబ్బతింటుంది.."
రాజు మనసులో.."ఇతగాడుచెప్పింది కూడా సమంజసమే కదా. ఇతను ఇక్కడే ఉన్నాడు. మరి ఆ
హారం ఎక్కడికి పోయి ఉంటుంది?"
హర సిద్ధుని వ్యతిరేకులకు ఇప్పుడు సమయం వచ్చింది..
కొన్ని రోజుల క్రితం రాజ మర్యాదలతో వచ్చిన సైనికులు ఇప్పుడు ఆ హర సిద్దు మీద పగ తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైందని తమలో తాము చాలా ఆనంద పడుతున్నారు..
అందులో ఒక సైనికుడు "నోరు ముయ్యి రా.. మహారాజా మీ సమక్షంలో లో మీ పక్షంలో నేను మాట్లాడుతున్నానని దయచేసి తప్పుగా అనుకోకండి. అని నక్క వినయం చూపించాడు..
సహజంగా మహారాజు ఆకర్షితుడయ్యాడు.
"మహారాజా వీడొక పిడివాది.. వీడికి చెయ్యి దురద
.. ఎంతో మదిని చితకబాదాడు.. కొలువులో చేరక ముందు .. వీడి పాల బడ్డవారిలో నేను కూడా ఒకడిని. పిడి వాదనలు చేయటం, గొడవ పెట్టుకోవడం వాడి తల మీదకు రాగానే నంగనాచి లాగా చక్కగా సరళంగా మాట్లాడటం అది ఒక కళ.."అన్నాడు వెటకారంగా.
అప్పుడు గుర్తొచ్చింది హర సిద్ధుడు కి "వాడు గతంలో జింక మాంసం తిందామని అప్పుడే పుట్టిన తల్లిని, బిడ్డని వేరు చేసి చిన్న జింకని చంపకపోతే.. హరసిద్ధుడు అడ్డుపడి సరైన గుణపాఠం చెప్పి జింక పిల్లల్ని అడవిలోకి సాగనంపాడు"
అంతకుముందు హర సిద్ధుని మనసులో ఉన్నదంతా ఆనందం. అందుకే ఇవి గుర్తు రాలేదు ఇప్పుడు అంతా అయోమయం. అందుకే అన్ని సంఘటనలను పూర్తిగా, వరుస క్రమం గా గుర్తుకు వస్తున్నాయి.
మరి కొంత మంది "ప్రభు! నీ మన్ననలు పొందాడు, పోనీలే మనిషి మారి ఒక గాడిలో పడ్డాడు. మా పూర్వ స్నేహితుడు అని.. గొడవ అయినా కాకపోయినా ఒక ఊరి వాడు కదా అని .. మేము ఆనందపడ్డాము.. వీడు ఒక పనికిమాలిన వాడు."
హార సిద్దు "మర్యాదగా మాట్లాడు.. నోరు జారి మాట్లాడితే నాలుక చీరేస్తా!"
చూశారా మహారాజా మీ ముందే మీ రాజ సైనికుడి ఇట్లా భయపెడుతున్నాడు అంటే మీరు లేకపోతే మా పరిస్థితి ఏంటి.. ఒకవేళ ఈ సంఘటన అంతా మీరు లేకపోతే.. మమ్మల్ని కొట్టి, రాజముద్రిక నామాల్లో ఒకటి దొంగలించడం మీకు చెప్పి తన మంచి మాటలతో నమ్మించినా కూడా మీరు నమ్మే వాళ్లేమో.. అందుకే కదా ఆంతరంగిక మందిరంలోకి తీసుకువెళ్ళి కూడా మాట్లాడారు.
హర సిద్ధుని కి వాడి తెలివి అర్థమవుతుంది..
"మహారాజా! మీరు అతని మాటలు నమ్మబాకండి. వారు చేసిన తప్పులకి మాత్రమే తన నేను కొట్టాను.. జింక మాంసం తినడం నిషిద్ధం. మన రాజ్యంలో జింకపిల్లను ఇతడు చంపబోతే నేను కాపాడాను.. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తిని జూదంలో మోసం చేసి .. నీ భార్య వస్త్రాపహరణం చేస్తానని మాట్లాడినందుకు తిరిగి బదులుగా నేను కొట్టాను.. అవన్నీ వాస్తవమే కానీ వారి చర్యకు ప్రతిచర్య మాత్రమే.."
మరొక సైనికుడు.."సరే వారు తప్పు చేస్తే నువ్వు ఎవరివి కొట్టడానికి.. దండించడానికి శిక్షించడానికి.. మహారాజు రాజ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్టు.."
హర సిద్దు కోపంగా "ఆత్మవంచన చేసుకుని కొట్టడము నా పని.. దండించడం రాజు గారి పని, శిక్షించడం రాజ్యవ్యవస్థ పని!"
అందరూ కలిసి "ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. మీరు ఎంత వాదించినా సరే వాదిస్తూనే ఉంటాడు. అతని దగ్గర బుద్ధి తక్కువ అనంతరం జ్ఞానం శూన్యం" అని చెప్పి ఆలోచించడానికి వీలులేకుండా మహారాజు మనసు మారుస్తున్నారు.
హార సిద్ధు "మహారాజా వీళ్ళ మాటలు తర్వాత. ముందు అది ఏమైందో ఒకసారి ఆలోచించండి. నేను కూడా వెతుకుతాను అని చెప్పి, తన ప్రయత్నంగా వెతికాడు. కానీ అతనికి కూడా రాజముద్రిక దొరకలేదు.."
ఏమైంది ఏమిటి ఈ నింద? అని గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని, అదే నన్ను చూస్తున్నాడు..
వారి మాటల్లో .."మహారాజా ఇతడు కొంతకాలంగా రాజ్యంలో లేడు, అది వాస్తవమే ఎందుకంటే గత కొంతకాలంగా మన రాజ్యం లో ఇతడు లేడు అని ఒక నిర్ధారణకు వచ్చారు."
హర సిద్దు కి వ్యతిరేకంగా ఉన్న సైనికుల ఒక ప్రణాళిక ప్రకారం హర సిద్దు రెచ్చగొట్టి, ఖైదు చేసి వారి పగ తీర్చుకోవాలి.. అక్కడున్న సైనికుల గుంపులో కొద్దిమంది మాత్రమే హర సిద్దు మాట్లాడుతున్నది సత్యమే కదా అనుకుంటూ మహారాజు గారికి చెప్ప టానికి చూశారు.. మిగిలిన సైనికులు వారి పాచిక పార నివ్వలేదు..
కొంతమంది రాజు మనసుని కలుషితం చేస్తున్నారు.
హరసిద్ధుడు అంటే పగ ఉన్న సైనికులు కొంతమంది వెళ్లి హర సిద్దు కుటుంబాన్ని దూషిస్తూ.. అసభ్యంగా మాట్లాడారు..
దాంతో చిర్రెత్తి హరసిద్ధు అక్కడున్న వారందరినీ చితకబాదాడు..
హర సిద్ధుడు .. వారు పన్నిన మానసిక ఉచ్చులో చిక్కుకున్న డు..
భక్తులారా మీరు కూడా ఎవరైనా సరే ఎదుటివాడు పన్నిన మానసిక ఉచ్చులో చిక్కుకోకుండా నిలకడగా ఉండాలి. అప్పుడే అనవసరపు సమస్యలు మనల్ని తాకవు..
మహారాజా! తప్పించుకోబోతే నేను పట్టుకున్నాను. అందుకని మమ్మల్ని కొట్టాడు అని ఒక సంఘటన సృష్టించారు. హర సిద్ధుడు మాట్లాడటానికి ఏమీ లేకుండా పోయింది..
మహారాజు "ఇతనిని ఖైదు చేసి రేపు సభలో విచారణకు ప్రవేశపెట్టండి" అంటూ ఉగ్రంగా ఆజ్ఞాపించాడు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment