ఏదీ అస్తిత్వస్పృహ...
లక్ష్మీ రాధిక
విముక్తిలేని గతమో జ్ఞాపకమై నిలిచి
భవిష్యత్తుకి దారులు మూసేసినట్లు
హృదయపులోతుల్లోనే ఉనికిని వెతుక్కురావడం
జీవితాన్ని ముక్కలుగా చేసి తరుక్కోవడమేగా..
విశ్వాసాలన్నీ సృష్టిగానుగలో పడి నిరాశానిస్పృహలతో..
దృక్పధాన్ని కోల్పోతే మరణానికి చేరువయినట్టేగా
మరణానికి చేరువయ్యానప్పుడే..
నాలోని అసలు నన్ను దాచేసినప్పుడే
చిరునవ్వు పెదవికి చేటని వేటేసినప్పుడే
అస్తిత్వానికి అరాటం దండగని భావించినప్పుడే
చదివిన శోకమనే శ్లోకంలో నన్ను చూసుకున్నప్పుడే
మరణనికి చేరువయ్యానప్పుడే
చీకట్లో దారితప్పి వెలుతురుకు దూరమైనప్పుడే
ఆలోచించడం మానేసి కాలాన్ని అనుసరించినప్పుడే
కన్నీటికి విలువిచ్చి మనసును ఎండగట్టినప్పుడే
నిర్భర ప్రేమవాంఛలన్నీ నిగ్రహించినప్పుడే
మరణానికి చేరువయ్యానప్పుడే
మార్పు కోరని జీవితములో కూరుకుపోయినప్పుడే
విషాదం నీడగా నన్ను కప్పినప్పుడే
చేసిన యవ్వనతపస్సు పూర్తిగా నిష్ఫలమైనప్పుడే
ఊహాతీతమైన భావాలకు ఉరేసినప్పుడే
***
No comments:
Post a Comment