ఇదెక్కడి న్యాయం?
భమిడిపాటి స్వరాజ్య నాగరాజ రావు.
తల్లితండ్రుల తలపులతో పుట్టటం,
వారిప్రేమ,సేవలతో పెరగటం,
వారి ధనాన్నిఇంధనంగాఅమర్చుకొని,
వారి ఆశలను ఆలంబనగా చేసుకొని ఎదగటం,
రెక్కలు మొలిచాయని, హక్కులు వచ్చాయని,
వయసులు వలచాయని,మనసులు కలిశాయని,
దిక్కులు పిలిచాయని,స్వర్గాలెదుటగా నిలిచాయని
ఎక్కివచ్చిన మెట్లను ఎగతాళి చేసిమరీ ఎగిరిపోవటం,
వివేకాన్నీ,తల్లితండ్రులనూ విడిచి వెళ్లిపోవటం,
ఇదెక్కడి న్యాయం?ఇదేమిటీ ధ్యేయం?
ఇలానా జీవితం? ఇదెలా శాశ్వతం?
***
No comments:
Post a Comment