జ్యోతిష్య పాఠాలు -20 - అచ్చంగా తెలుగు

 జ్యోతిష్య పాఠాలు -20 

PSV రవి కుమార్ 

పాఠం -  20




జ్యోతిష్య పరిశీలన

ఇన్ని రోజులు మనం దోషల గురించి, యోగాల గురించి, గ్రహాల స్థానాల బట్టి ఇచ్చే ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఈ పాఠం లో జ్యోతిష్య పరిశీలన అంటే, ఒక జాతక చక్రం ఎలా చూడాలి, ఫలితాలు ఎలా నిర్ణయించాలో తెలుసుకుందాం.

ముందుగా జాతక చక్రం లో లగ్నాదిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్నాదిపతి పై ఏ గ్రహాల ద్రుష్టి ఉంది, లగ్నం పై ఏ గ్రహాల ద్రుష్టి ఉందో చూడాలి. లగ్నాదిపతి, కోణాలలో, కేంద్రాలలో ఉంటే శ్రేష్టం. లగ్నాదిపతి అశుభ స్థానాలలో కాకుండా ఎక్కడ ఉన్నా మంచిదే. లగ్నాదిపతి పాప గ్రహం అయ్యి, ఉపచయ స్థానాలలో ఉంటే మంచిదే. లగ్నాదిపతి ద్వారా, మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు.

తర్వాత ధన స్థానం చూడాలి, ధనాదిపతి ఏ స్థానం లో ఉన్నాడు, ఏ గ్రహ ద్రుష్టి ఉందో తెలుసుకోవాలి. దాంతో బాటు, ధన కారకత్వం వహించే గురు గ్రహం ఎక్కడ ఉందో చూడాలి. ధనాదిపతి, గురు గ్రహం మంచి స్థానాల్లో ఉంటే, జీవించడానికి సరిపడ ధనం ఖచ్చితంగా ఉంటుంది.

తర్వాత, విద్య చూడాలి. ప్రాథమిక విద్య కోసం చతుర్దం, ఉన్నత విద్య కోసం నవమ స్థానం చూడాలి. ఈ స్థానాదిపతులు మంచి స్థానాలలో ఉంటే, విద్య బాగా వస్తుంది. శని గ్రహం, ఎదో ఒక స్థానానికి కానీ, లేదా శని ద్రుష్టి, ఎదైన అధిపతి తో కనుక ఉంటే, విద్య యందు ఆటంకాలు కలుగును. అనగా అనుకున్న మార్కులు సాధించలేక పోవుట లేదా ఒకే తరగతి రెండు సార్లు చదువుట, లేదా ఇంటినుండి దూరంగా హాస్టల్ లో ఉండి చదువుట వంటి ఫలితాలు కలుగును. పంచమ స్థానాధిపతి బాగుంటే, జ్ఞానం బాగుంటుంది. నేర్చుకున్న విద్యకి సార్దకత చేకూరుతుంది.

తర్వాత చూడాలసిన స్థానం, దశమం. ఈ స్థానం ద్వారా వ్రుత్తి తెలుసుకోవచ్చు. ఈ స్థానం లో బుధుడు ఉన్న, లేదా ఈ స్థానాధి పతి బుధుడు అయ్యి, సప్తమం లో ఉన్న, వ్యాపారం చేయు అవకాశం కలదు. రవి దశమం లో ఉన్న, దశమ స్థానానికి రవి గ్రహానికి సంబందం ఉన్న, ప్రభుత్వరంగ ఉద్యోగం చేయును. శుక్రుడు, రాహువు వంటి గ్రహాలకు, దశమం తో సంబందం ఉన్న, సాఫ్ట్ వేర్ రంగం లో రాణీంచును. ఈ గ్రహములకి బుధ గ్రహం సంబందం ఉన్న, ప్రోగ్రామింగ్ లో నైపుణ్యం ఉంఉను. గురు గ్రహం దశమం తో సంబందం ఉన్న, టిచింగ్ వ్రుత్తి చేపట్టును. గురుడు కి, బుధుడు కి సంబందం ఉన్న, ఫైనాన్స్ రంగం లో స్తిరపడును. గురుడు ధన కారకుడు కావున, గురు బలం దశమం లో బాగున్న, ఫైనాన్స్ రంగంలో అనగా అకౌంటంట్, టాక్స్ కన్సల్టెంట్ గా స్తిర పడు అవకాశం కలదు.

తర్వాత ఏకాదశం చూడాలి.  స్థానం బాగుంటే, ఈ స్థానాదిపతిమంచి స్థానాలలో ఉంటే, ధన సంపాదన, బ్యాంక్ బాలన్స్ బాగుండును. ఈ స్థానం పై శని సంబందం ఉంటే, వీరికి 36 ఏళ్ళు వచ్చే వరకు, సంపాదన మామూలుగా ఉండును తర్వాత సంపాదన బాగుండును. ద్వితీయానికి ఏకాదశానికి సంబందం ఉన్న, ధన సంపాదన బాగుండును.

వివాహం కోసం సప్తమాన్ని, చూడాలి. సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమం లో ఏ గ్రహం ఉన్నాది, ఇటువంటి వన్ని పరిశీలించి వివాహ జీవనం ఎలా ఉంటుందో తెలియచేయాలి.

ఇక ముఖ్యం గా తెలుసుకోవాలసినది మహా దశ. జాతక చక్రం చూస్తున్నప్పుడు, అప్పుడు ఏ మహాదశ నడుస్తొందో చూడాలి. ఆ దశానాథుడు ఏ స్థానానికి అధిపతో ఆ ఫలితాలు ఇస్తాడు. ఆ దశానాథుడు, ఏ స్థానం లో ఉన్నాడొ ఆ ఫలితాలు కూడా ఇస్తాడు.

ఉద్యోగం లో మార్పు లేదా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని చూడాలి అంటే, దశానాథుడి ని పరిశీలించి, అంతర్దశలలో 10, 11 అధిపతులు ఎప్పుడు వస్తారో చూసి, మార్పు తెలుసుకోవచ్చు.

అలాగే వివాహం సమయం తెలుసుకోవాలి అంటే, దశానాథుడు, సప్తమాదిపతి అంతర్దశ లేదా సప్తమం లో ఉండే గ్రహ అంతర్దశ లేదా సప్తమాదిపతి ఉన్న రాశ్యాదిపతి అంతర్దశ, శుక్ర అంతర్దశ ఇలా అన్నీ విధాలుగా పరిశీలించి నిరయం చేయాలి.

ఎప్పుడు పరిశీలన చేసినా మహాదశ తో పాటుగా గోచారం చూడాలి. గోచారం లో గురు బలం బాగుండాలి, శని బలం బాగుండాలి.

ఏలినాటి శని

గోచారం ప్రకారం, ఎవరి రాశి చక్రం లో నయినా చంద్రుడి నుండి, శని, 12,1,2 స్థానాలలో సంచరిస్తే దానిని ఏలినాటి శని అంటరు. శని గ్రహం ఒక రాశీ నుండి ఇంకొక రాశి కి సంచారం చేయుటకు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఇలా ఈ పై తెలిపిన 3 స్థానాలలో శని సంచారం పూర్తి అవటానికి ఏడూన్నర సంవత్సారాలు పడుతుంది. అందుకే దీనిని ఏలినాటీ (ఏడున్నర) శని అంటారు.

సాధారణం గా ఈ ఏలినాటి శని 30 సంవత్సరములకు ఒక సారి వచ్చును. అంటే 12 రాశులలో ప్రయాణం చేయ్టానికి 30 సంవత్సరాలు పడుతుంది. మొదటి సారి వచ్చిన ఏలినాటి శని, విపరీతమయిన ఇబ్బందులు కలిగిస్తుంది. రెండవ సారి వచ్చిన ఏలినాటి శని, ఇబ్బందులు కలిగించిననూ, ఉద్యోగం లో అభివ్రుద్ది కలిగించును, కానీ, కుటుంబ సమస్యలు పెంచును. మూడవ సారి వచ్చిన ఏలినాటి శని అనారోగ్య సమస్యలు పెంచును.

ఈ ఏలినాటి శని జరుగుతున్న వారు, కుదిరితే శని త్రయోదశి నాడు శని కి పూజ చేయించుకోవటం మంచిది. కాస్త ఇబ్బందులు తొలుగు అవకాశం కలదు. నిత్యం, శివుడికి, వేంకటేశ్వర స్వామిని పూజించటం మంచిది.

శని గోచారం లో అష్టమ స్థానం లో ఉన్న అనారోగ్య సమస్యలు కలుగును.

గురుడు అష్టమం లో ఉన్న, ఉద్యోగం లో ఇబ్బందులు లేదా అనవసర ధనవ్యయం జరుగును. గురుడు ద్వితీయం లో ఉన్న, ధన లాభం, నవమం లో ఉన్న, తీర్థ యాత్రలు చేయు అవకాశం, ఉన్నత విద్య యందు ఆసక్తి, అనుకోని విధం గా ధన లాభం. దశమం లో ఉన్న, ఉద్యోగం లో ప్రమోషన్లు వచ్చుట, ఉద్యోగం లో మార్పులు వచ్చును. ఏకాదశం లో ఉన్న, ధన లాభం.

***

No comments:

Post a Comment

Pages