పంచపదులు
(నూతన ప్రక్రియ పంచపదులు)
అష్టాదశ పురాణాలు..శక్తి పీఠాలు
-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి,సికిందరాబాద్.
బ్రహ్మ పురాణం
ఆదిబ్రాహ్మ్యనామవ్యాప్తి సృష్టివైశిష్ట్యపురాణము
దేవ రాక్షస భగవద్విషయ విశేషాల పురాణము
వైకుంఠవ్యాసాంశ వ్యాసవిరచిత జ్ఞానపురాణము
ధర్మార్థ కామమోక్ష కర్తవ్య విశిష్ట ఫలపురాణము
సర్వశాస్త్ర పురుషార్థ పుణ్య ప్రసాదం బ్రహ్మపురాణం సుజాతా!
***
శ్రీశైల భ్రమరాంబికాదేవి
శ్వేతగిరి నివాస శైలధన్వ హృదయాంబికా
ఖ్యాతి నొసగు నిగమాగోచర నిర్మలాంబికా
శిరస్థ్సానాంతరాధిష్టిత హరార్థ ప్రియాంబికా
ధృతి సౌఖ్యసౌభాగ్య ప్రదాయప్రసాదాంబికా
కృతిగమ్యాయ కృతార్థ శ్రీగిరి భ్రమరాంబికా సుజాతా!
***
జోగులాంబ
హరార్థశరీర సిద్ధరసర్నవ మహాయోగినీదేవి
పరమ సౌఖ్య సంప్రాప్త ఏకవస్త్ర ధారిణీదేవి
బ్రహ్మేశ్వరశరచ్చంద్రబింబ భవానీరూపిణీదేవి
అఖండ భూమండలవ్యాపికా శ్రీచక్రిణీ శ్రీదేవి
పంచమశక్తిపీఠ రౌద్రస్వరూపిణీదేవి జోగులాంబ సుజాతా!
***
విష్ణు పురాణం
బద్ధ నిత్య ముక్తోత్తమ త్రివిధ చైతన్య పురాణము
కోటి జన్మ పుణ్యఫలదాయకము శ్రీహరిస్మరణము
విశ్వసృష్టి విశ్వేశ్వరోపాసన నిర్గుణాకార సగుణము
వరాహకల్ప సంబంధ వాసుదేవ మహా పురాణము
జీవ బ్రహ్మజ్ఞాన మోక్షమొసగేది విష్ణుపురాణం సుజాతా!
***
సౌందర్య లహరి
ఆదిశంకరాచార్య అపూర్వాక్షర కావ్యఝరి
సౌ లహ హ్రీం మంత్ర రమ్య బీజాక్షరలహరి
సత్త్వ రజస్తమో త్రైగుణాధీన షోడశాక్షరి
శ్రీచక్ర శివశివాని వర్ణనాకృత శ్రుతిలయఝరి
శ్రీవిద్య మంత్రరాజ పంచదశాక్షరి సౌందర్యలహరి సుజాతా!
***
కంచి కామాక్షి
శ్రీచక్రాధిష్ట మందస్మిత బిందుస్థానీయ సిద్ధాసని
షట్చక్ర చతుర్భుజ శ్రీవిద్య జ్ఞాన సిద్ధిదాయిని
సుస్మిత చంద్రబింబ ముగ్ధమనోహర సిద్ధయోగిని
సర్వభూమండల నాభి శక్తి క్షేత్ర స్థిర శుద్ధనివాసిని
కాంచీపుర విహారిని కామిత ఫల ప్రదాయిని కామాక్షీదేవి సుజాతా!
***
No comments:
Post a Comment