నువ్వే కదూ! - అచ్చంగా తెలుగు

 నువ్వే కదూ!

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు


నాడు నీ తల్లితండ్రులను వదిలివచ్చిన కొడుకువే కదా!

ఇప్పుడు ఆపనే నీకొడుకు చేస్తూఉంటే  తప్పంటున్నావు ఎందుకు?

నాడు నీభార్యమాటను జవదాటని భర్తవే కదూ

ఇప్పుడు నీ కోడల్నిమాత్రం  ఎందుకలా నిందిస్తున్నావు.

నాడు మైకంతో నిండిన నీ మనసుకు

నీ తల్లి తండ్రుల ఆవేదన అర్ధం కాలేదుఎందుకనో?

మరి నాటి నీ దుష్ప్రవర్తన వ్యర్ధం కాలేదు అందుకనే.

నీవు నాటిన ఆ విత్తనమే కదా ఫలించింది,

నీకు అలాంటి ఫలాన్నే కదూ నేడు ఇచ్చింది.

నాడు నువ్వు అమలుపరిచిన ఆ పాఠమే

నేడు గుణపాఠమై నీముందు నిలిచింది.

మరి దేనికి వెరచి విలపిస్తున్నావు?

దేనిని  తలచి ఆశిస్తున్నావు?

***

No comments:

Post a Comment

Pages