శుక్ర గ్రహ ఫలితాలు
PSV రవి కుమార్
ఈ పాఠం లో శుక్రగ్రహ కారకత్వాలు, శుక్రుడు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం.
శుక్రుడు వ్రుషభ, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. భరణీ, మఖ, పూర్వాషాడ నక్షత్రాలకు, శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. పైన చెప్పిన మూడు నక్షత్రాలలో ఎవరైతే జన్మిస్తారో, వారి జీవితం శుక్రమహాదశ తో ప్రారంభం అవుతుంది
శుక్రుడు, భోగ భాగ్యాలు ఇవ్వడంలో దిట్ట. ఎవరికైతే శుక్రుడు స్వక్షేత్రాలలో కానీ, మిత్రక్షేత్రాలలో కానీ, ఉచ్చ రాశి లో కానీ, ఉంటాడో వారి జీవితం అంతా భోగ భాగ్యాలతో నిండి ఉంటుంది. శుక్రుడు యోగిస్తే యుక్త వయసులో మంచి జీతం తో ఉద్యోగం, ఉద్యోగం లో ఎదుగుదల, విదేశీ ప్రయాణాలు ఉంటాయి.
కళత్ర సుఖానికి, ఎలెక్ట్రానిక్స్ సంబందిత విద్య ఉద్యోగాలకు, లలిత కళలకు, వాహనాలకు, శుక్రుడు కారకత్వం వహిస్తాడు. శుక్ర గ్రహ జాతకులు, చూడచక్కగా ఉంటారు. శుక్ర గ్రహ జాతకులకు, మేకప్ (అలంకరణ) అంటే చాల మక్కువ.
లగ్నం లో శుక్రుడు ఉంటే, వీరికి ఎలెక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అనగా, మొబైల్ ఫోన్, టీవీ, ఆన్లైన్ గేంస్ వంటి పై ఇష్టం ఎక్కువ, వీటి ని ఎక్కువగా వాడుతుంటారు. ఫ్యాషన్ గా తయారవటం కూడా ఇష్టపడతారు, లేటస్ట్ ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటారు. వీరికి కళత్ర సౌఖ్యం బాగుంటుంది.
ద్వితీయం లో శుక్రుడు ఉంటే, ధన సంపాదన బాగుంటుంది. వీరి కి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాలు పెంచుకుంటారు. మాట తీరు మ్రుదువుగా ఉంటుంది.
త్రుతీయం లో శుక్రుడు ఉంటే వీరు సంగీతం, యాంకరింగ్, న్యూస్ రీడింగ్ వంటి వ్రుత్తులను ఇష్టపడి, వాటిలో రాణిస్తారు.
చతుర్దం లో శుక్రుడు ఉంటే, లేటస్ట్ వాహనాలను, స్పోర్ట్స్ కార్లను, ఇష్టపడతారు. స్వగ్రుహ సౌఖ్యం కలుగుతుంది. విద్యార్దులు, లలిత కళల యందు రాణించి, గుర్తింపు తెచ్చుకుంటారు. స్వదేశం లో నే ఉద్యోగం చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ బిజినస్ చేయు అవకాశం కలదు.
పంచమం లో శుక్రుడు ఉంటే, స్తీ సంతానం కలుగు అవకాశం కలదు. సంతానం యందు అమిత ప్రేమ కలిగి ఉంటారు. విజ్ఞానాన్ని పెంచుకోవటం లో ఇష్టం ఉంటుంది.
షష్టమం లో శుక్రుడు ఉంటే, స్వల్ప పాటి అనారోగ్య సమస్యలు, తరచూ ఎవరితో ఒకరితో గొడవలు వస్తాయి (స్త్రీలు అయిన పురుషులతో, పురుషుకు అయిన స్త్రీ లతో).విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తారు, స్థాన బలం, ఇతర గ్రహాల అనుకూలత ఉంటే, విదేశాలలో రాణిస్తారు.
సప్తమం లో శుక్రుడు ఉంటే, అందమయిన జీవిత భాగస్వామి దొరుకుతారు. ఒక వేల సప్తమం లో ఉన్న శుక్రుడు కి రాహువు వంటి గ్రహం కలిసినా, లేక రాహువు చే చూడబడినా, లేక, రాహు నక్షత్రం లో శుక్రుడు ఉన్నా, కులాంతర లేదా మతాంతర వివాహం చేసుకుంటారు.వీరికి వివాహనంతరం ఉద్యోగం లో ఎదుగుదల ఉంటుంది. వీరు, వీరి జీవిత భాగస్వామి పై అమిత ప్రేమ కలిగి ఉంటారు.
అష్టమం లో శుక్రుడు ఉన్న, చెప్పుకోలేని ఆరోగ్య సంస్యలతో బాధ పడతారు. స్త్రీలయిన సంతాన సంబందిత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు, రీసెర్చ్ విద్యల పై మక్కువ చూపుతారు.
నవమం లో శుక్రుడు ఉంటే, ఎలెక్ట్రానిక్స్, గ్రాఫిక్స్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి వాటిలో ఉన్నత విద్య చదువుతారు. జీవిత భాగస్వామి తో కలిసి తీర్థ యాత్రలు చేస్తారు. ఉద్యోగ నిమిత్తమై లేదా చదువు నిమిత్తమై, విదేశాలకి వెళతారు లేదా స్వంత ఊరు నుండి చాలా దూరం వెళ్ళీ విద్య ఉద్యోగాలు చేస్తారు. వీరు నలుగురితో సరదాగా గడుపుతారు. వీరి మాటలకి అందరూ ఆకర్షితులు అవుతారు.
దశమం లో శుక్రుడు ఉంటే, ఎలెక్ట్రానిక్స్ లేదా గ్రాఫిక్స్ సంబందిత ఉద్యోగాలు చేస్తారు. అంటే, సాఫ్ట్వేర్ లలో ఎలక్ట్రానిక్స్ లేదా వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్స్ డిజనింగ్ వంటివి. ఇదే దశమం శుక్రుడికి స్వక్షేత్రం లేదా ఉచ్చ క్షేత్రం అయిన, సినిమాలలో కానీ, టీవీ రంగం లో కానీ, సంగీత విద్వాంసులుగాకానీ, గుర్తింపు పొందుతారు.
ఏకాదశం లో శుక్రుడు ఉంటే, ధన లాభాలు బాగుంటాయి. బంగారం, ఎలక్ట్రానిక్స్, దుస్తులు వంటి వ్యాపారాలు చేస్తారు. ఈ పైన చెప్పిన వాటిలో ఎదో ఒక వాటిలో షేర్ మార్కెట్ లో ఇన్వస్ట్ చేసిన లాభాలు బాగుంటాయి.
వ్యయం లో శుక్రుడు ఉన్న, విదేశాలకు వెళ్ళు అవకాశం కలదు. లేటస్ట్ ఫ్యాషన్, గ్యాడ్జెట్స్ కోసం ధనం ఖర్చు చేస్తారు. ఎదో ఒక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
శుక్రుడు నుంచి ఇంకా శుభ ఫలితాలు పొందాలంటే, నిత్యం మహాలక్ష్మీ ని పూజించాలి. వీరు నిత్యం పరిశుభ్రంగా ఉండాలి. ఎదో ఒక దేవాలయం లో నేతి తో దీపాన్ని వెలిగించాలి. గోసేవ చేయాలి.
శుక్ర గ్రహం చంద్రుని తో కలిసినా, రవి గ్రహం తో కలిసినా, రవి, చంద్ర క్షేత్రాలలో ఉన్నా, లేదా రవి, చంద్ర నక్షత్రాలలో ఉన్నా, ఫలితాలు కొంత తగ్గుతాయి. వీరు నిత్యం దేవాలయం లో నేతి తో చేసిన దీపం వెలిగించాలి, లేదా శుక్ర వారం అయినా వెలిగించాలి. దేవాలయాలలో, బెల్లం, పంచదార, పాలు, దానం ఇవ్వాలి లేదా, నిత్యం ఇంట్లో ఆ పైమూడు లో ఎదో ఒక పదార్దం నివేదన చేయాలి.
ఎవరికయినా జాతకం తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ చేయవలసిన నంబర్ 9740387536. కన్సల్టేషన్ చార్జస్ వర్తిస్తాయి.
***
No comments:
Post a Comment