గురు గ్రహ ఫలితాలు
ఈ పాఠం లో గురు
గ్రహ కారకత్వాలు, గురుడు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం.
గురుడు ధనస్సు, మీన రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు,
విశాఖ, పూర్వాభాద్రా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు.. గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. పైన చెప్పిన నక్ష్త్రాలలఓ ఎవరైతే
జన్మిస్తారో వారి జీవితం గురు మహాదశ తో ప్రారంభం అవుతుంది.
గురుడు ముఖ్యంగా ధనమునకు, ఆధ్యాత్మిక
ఆలోచనలకు కారకుడు అవుతాడు. ఎవరికైతే గురుడు మిత్ర క్షేత్రాలలో కానీ, స్వక్షేత్రాలలో
కానీ, ఉచ్చ
లో గానీ ఉంటాడో,
వారికి ధన సంపాదన బాగుంటుంది. భక్తి భావనకు కారకత్వమయిన నవమ స్థానం లేదా భాగ్య
స్థానం లో గురుడు ఉంటే వారికి అమిత మయిన భక్తి ఉంటుంది.
గురుడు విద్య కు కారకత్వం వహిస్తే వీరు, ఎంబీయే
ఫైనాన్స్, చార్టెడ్
అకౌంటెంట్స్,
బీకాం వంటి విద్యలభ్యసిస్తారు.
లగ్నం లో గురుడు ఉంటే, వీరికి ధన సంపాదన పై ఎక్కువ మక్కువ. వీరు యుక్త వయసు నుండే
ధన సంపాదన కు తగిన ప్రణాళిక వేసుకుంటారు. స్వక్షేత్రాలో కానీ, ఉచ్చ క్షేత్రం
అయిన, బాల్యం
నుండే భక్తి భావనలు ఎక్కువ గా ఉంటాయి.
ద్వితీయం లో గురుడు ఉంటే, వీరికి ధన సంపాదన బాగుంటుంది. ఉద్యోగం లో తగిన గుర్తింపు
లభిస్తుంది. వీరికి మాటల ద్వారా ధన సంపాదన కలుగు అవకాశం ఉంది, అనగా టీచింగ్, పౌరహిత్యం, ప్రవచనాలు వంటి
వ్రుత్తులు చేపట్టి ధనం సంపాదిస్తారు. కొన్ని సార్లు, ఇన్స్యూరెన్స్
ఏజంట్లగా గుర్తింపు తెచ్చుకుంటారు. బ్యాంక్ జాబ్స్ సంపాదిస్తారు.
త్రుతీయం లో గురుడు ఉంటే వీరు కూడా ప్రవచన కర్తలుగా, టీచర్లగా
గుర్తింపు తెచ్చుకుంటారు. దేవాలాయ శాఖలో ఉద్యోగం సంపాదిస్తారు. బుధుడి తో
సత్సంబందం కలిగి ఉంటే చార్టెడ్ అకౌంటెట్ గా కూడా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు.
చతుర్దం లో గురుడు ఉంటే, గ్రుహం నందు ఆధ్యాత్మికత ను
ఇష్టపడతారు. తల్లి తండ్రులతో సత్సంబందాలు కలిగి ఉంటారు. రీసెర్చ్ విద్యలపై మక్కువ
కలిగి ఉంటారు. జ్యోతిష్యం,
వాస్తు వంటి విద్యలు అభ్యసిస్తారు.
పంచమం లో గురుడు ఉంటే, సంతానం కాస్త ఆలస్యం అవుతుంది. చదివిన విద్య కు సంబందిత
ఉద్యోగం లో ఉంటారు. ధన సంపాదన బాగుంటుంది. మ్యూట్యువల్ ఫండ్స్ ద్వారా లేదా స్టాక్
మార్కెట్ ద్వారా ధన సంపాదన కలుగుతుంది.
షష్టమం లో గురుడు ఉంటే, వీరు లీగల్ వ్యవహారాలలో జాగ్రత్తా గా ఉండాలి. ఇన్స్యూరెన్స్
ఏజంట్లగా వ్రుద్ది లోకి వస్తారు. రుణములు ఇచ్చు విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు.
సప్తమం లో గురుడు ఉంటే, అనుకూలమయిన జీవిత భాగస్వామి. పార్ట్నర్షిప్ బిజినస్ లో
లాభాలు. జీవిత భాగస్వామి నుండి ధన సంపాదన ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో లాభాలు కలుగుతాయి.
ప్రవచనకారులుగా పేరు తెచ్చుకుంటారు. మీడియా రంగం లో లేదా యూట్యూబ్ లేదా ఇంటర్నెట్
ద్వారా ధన సంపాదన.
అష్టమం లో గురుడు ఉన్న, వీరికి ధన సంపాదన విషయం లో ఎప్పుడూ ఆటంకాలు కలుగుతాయి.
రీసెర్చ్ లేదా పీహచ్ డీ చేసి టీచింగ్ లో రాణిస్తారు. లేదా స్కూలు టీచర్లగా కూడా
రాణిస్తారు. హాస్పిటల్లలో,
మెడికల్ రిలేటడ్ సంస్థలలో అకౌంట్ సెక్షన్ లో ఉద్యోగాలు చేస్తారు. జీర్ణ
సంబందిత సమస్యలు ఇబ్బంది పెడతాయి.
నవమం లో గురుడు ఉంటే, వీరు ఉన్నత విద్యనభ్యసించి టీచింగ్ వ్రుత్తిని ఎంచుకుంటారు.
కొన్ని సందర్బాలలో పౌరహిత్యం చేసి ధన సంపాదన చేస్తారు. తీర్థ యాత్రలు అన్న ఇష్టం
ఎక్కువ. వేరే దేశం లో ఉండే దేవాలయాలు చూడటం అంటే కూడా ఇష్టపడతారు. ఎంబీయే, ఎంకాం, ఫైనాన్స్
సంబందిత విద్యలు చదువుతారు.
దశమం లో గురుడు ఉంటే, వీరు ఎక్కువగా ఉన్న దేశంలోనే ఉద్యోగం చేస్తారు. టీచింగ్, బ్యాంక్, పౌరహిత్యం, చార్టెడ్
అకౌంటెంట్ సంబందిత ఉద్యోగాలు చేస్తారు. ప్రవచనకర్తలుగా కూడా మారతారు.ఇన్స్యూరెన్స్
ఏజంట్లుగా, ఇన్స్యూరెన్స్
సంస్థలలో ఉద్యోగాలు చేస్తారు. సాఫ్ట్వేర్లలో ఇన్స్యూరెన్స్ ప్రోడక్ట్స్ కు
సంబందిచిన ప్రోజెక్ట్లలో లేదా లెర్నింగ్ సిస్టెం
డిజైన్ వంటి ఉద్యోగాలు చేస్తారు.
ఏకాదశం లో గురుడు ఉంటే, వీరు స్టాక్ మార్కెట్ ల ద్వారా, మ్యూట్యువల్
ఫండ్ల ద్వారా ధనం సంపాదిస్తారు. దేవాలాయల సంబందిత వ్యాపారాలు, ఉద్యోగాలు
చేస్తారు. కోచింగ్ సెంటర్లు,
కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తారు.
వ్యయం లో గురుడు ఉన్న, వీరికి తీర్థ యాత్రలంటే చాలా ఇష్టం. రీసెర్చ్ విద్య పై
మక్కువ ఎక్కువ. బ్యాంక్ ఉద్యోగాలు చేస్తారు. వీరు రుణములు ఇచ్చు విషయం లో కానీ, రుణములు
తీసుకొను విషయం లో కానీ,
జాగ్రత్త గాఉండాలి. హాస్పిటల్స్ లో
అకౌంట్ సెక్షన్ లో ఉద్యోగాలు చేస్తారు.
గురుడు నుండి శుభ ఫలితాలు పొందాలంటే, నిత్యం, సాయిబాబా ను
కానీ, రాఘవేంద్ర
స్వామిని కానీ,
దత్తత్రేయ స్వామిని కానీ,
పూజించాలి.
ఎవరికయినా జాతకం తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ చేయవలసిన నంబర్ 9740387536. కన్సల్టేషన్ చార్జస్ వర్తిస్తాయి.
***
No comments:
Post a Comment