మహా భారత పర్వాల (7 నుండి !2) వరకు సంగ్రహ వివరణ - అచ్చంగా తెలుగు

మహా భారత పర్వాల (7 నుండి !2) వరకు సంగ్రహ వివరణ

Share This

 మహా భారత పర్వాల (7 నుండి !2) వరకు సంగ్రహ వివరణ

అంబడిపూడి శ్యామసుందరరావు 


మహాభారతములో ఏడోవ పర్వము భీష్మ పర్వము బీష్ముడు నేలకొరిగిన పిమ్మట ద్రోణునికి సైన్యాధిపత్యము అప్పజెపుతారు అయిదు రోజుల పాటు ద్రోణుని సారధ్యములో జరిగిన యుద్ధ కదా ఈ పర్వంలో వివరింపబడింది. దుర్యోధనుడు ద్రోణుని ధర్మరాజును ప్రాణాలతో పట్టి ఇవ్వమని అడుగుతాడు. కర్ణుడు కూడా ఈ పర్వంలో యుద్ధ ప్రవేశము చేస్తాడు పద్మవ్యూహములో అభిమన్యుని వద అభిమన్యుని చావుకు కారణమైన సైంధవుడిని అర్జునుడు నాటకీయముగా చంపటం,భూరిశ్రవుడి చేయిని అర్జునుడు నరకటము, ప్రాయోపవేశములో ఉన్న అతడి తలను సాత్యకి నరకటము, రాత్రి యుద్దములో ఘటోత్కచుడు విజృంభిస్తే తప్పక కర్ణుడు అర్జునిడి కోసము దాచిన శక్తి ఆయుధాన్ని వాడి ఘటోత్కచుని చంపటం, ఈ పర్వము చివరలో ధర్మరాజుతో  అశ్వత్తమకుంజరః అనే అబద్ధము చెప్పించి యోగములో ఉన్న ద్రోణుడి తలను  ధృష్టద్యుమ్నుడు నరకటము ఆగ్రహముతో అశ్వత్తమ పాండవులపైకి నారాయణ్స్త్రాన్ని ప్రయోగించి తీవ్ర నష్టము కలుగజేయటంతో ఈ పర్వము ముగుస్తుంది.

ఎనిమిదవ పర్వాన్ని కర్ణ పర్వము అంటారు ద్రోణుని మరణము తరువాత కర్ణుడు సర్వ సైన్యాధి పతిగా నియమింపబడ్డప్పటికీ ఇతని నాయకత్వము ఒకటిన్నర రోజులే. దుశ్శాసనుడి తో సహా అనేకమంది కౌరవ యోధులను భీముడు వధించగా కర్ణుడు భార్గవాస్త్రముతో పాండవులకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాడు. తనను పరామర్శించటానికి వచ్చిన అర్జునిడిని ధర్మరాజు కర్ణుడికి భయపడి వచ్చావని నిందిస్తాడు అర్జునిడికి తన గాండీవాన్ని దూషించినవారిని వాదించే నియమము ఉన్నప్పటికీ కృష్ణుని సలహా మేరకు విరమించుకొని తనను తానూ నిందించు కుంటాడు బాధపడి ఆత్మహాత్య చేసుకోవాలనుకుంటే శ్రీ కృష్ణుడు తనని తానూ పొగుడుకుంటే అది ఆత్మహత్యకు సమానని ధర్మ సూక్ష్మణాన్ని చెప్పి అర్జునుడి ఆత్మహత్య పరయత్నాన్ని విరమింపజేసి కర్ణుని వద్దకు తీసుకొని వెళతాడు. ఆరోజే కర్ణునికి శల్యుడు సారధ్యము వహిస్తాడు కానీ ధర్మరాజు కోరిక మేరకు శల్యుడు కొంత తేజోవధ చేయనారంభించగా ఇద్దరికీ ఏర్పడ్డ వాదన దుర్యోధనుని మధ్యవర్తిత్వముతో సద్దుమణుగుతుంది. కర్ణుడి కొడుకు వృషసేనుడిని అర్జునుడు చంపి కర్ణుడి పైకి దాడి చేస్తాడు కర్ణుడి నాగాస్త్రము విఫలమవుతుంది. అతనిఐ ఉన్న శాపాలు ప్రభావము వలన అస్త్రాలు సరిగా ప్రయోగించలేని పరిస్తుతులలో రధ చక్రము భూమిలో కూరుకు పోయినప్పుడు శ్రీ కృష్ణుని ప్రేరణతో అర్జునుడు కర్ణుని సంహరిస్తాడు ధర్మరాజు సంతోషపడతాడు బాధపడుతున్న దుర్యోధనుడిని శల్యుడు ఓదారుస్తాడు ఆవిధముగా 17 వ రోజు యుద్ధములో  కర్ణుని మరణముతో కర్ణ పర్వము ముగుస్తుంది 

తొమ్మిదవ పర్వము శల్య పర్వము అంటే శల్యుడు సర్వ సైన్యాధిపతి అవటంతో మొదలవుతుంది శల్యుడు అభ్డుతముగా యుద్ధము చేసి ధర్మరాజు చేతిలో మరణిస్తాడు సహదేవుడు శకునిని అతని కుమారుడు ఉలుకూడిని చంపి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాడు కౌరవుల తరుఫున అశ్వత్థామ కృతవర్మ,కృపాచార్యుడు తప్ప ఇతర వీరులు వారి కుమారులు అందరు హతులవుతారు. నిరాశ తో దుర్యోధనుడు జలస్తంభన విద్యతో ఒక మడుగులో దాక్కుంటాడు పాండవులు ఆ మడుగుకు చేరుకొని దుర్యోధనుడిని మాటలతో గదా యుద్దానికి ప్రేరేపిస్తారు ఇద్దరు ద్వంద యుద్దములో భీముడు దుర్యోధనుని తొడల మీద క్రొట్టడాన్నిచుసిన బలరాముడు తప్పు అని ఆక్షేపించగా శ్రీ కృష్ణుడు కౌరవులు చేసిన అకృత్యాలను వివరించగా బలరాముడు నిరసన తో వెళ్ళిపోతాడు. దుర్యోధనుడిని వెతుక్కుంటూ అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు మడుగు దగ్గరకు వచ్చి అతని దుస్థితి చూసి బాధపడతారు. అశ్వత్థామ యుద్ధము ఇంకా ముగియలేదని తానూ ప్రతీకారము తీర్చుకుంటానని అంటే దుర్యోధనుడు అతనిని సర్వ సైన్యాధిపతిగా నియమిస్తే అశ్వత్థామ మిగిలిన ఇరువురిని తీసుకొని బయలు దేరటంతో శల్య పర్వము ముగుస్తుంది. 

పడవ పర్వాన్ని సౌప్తిక పర్వము అంటారు. పాండవులు కౌరవుల శిబిరాలను ఆక్రమించటంతో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు వారి శిబిరాలకు వెళ్లరు. ఒకచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తున్న అశ్వత్తమకు చీకట్లో గుడ్లగూబ పక్షులను నాశనము చేయటము చూచి  ఆ రాత్రికే యుద్ధము చేయాలనీ నిర్ణయించుకొని కృత వర్మ కృపాచార్యులను నిద్రలేపి తన నిశ్చయాన్ని చెప్పగా ముందు వారిద్దరూ వద్దని వారించినా అశ్వత్థామ పట్టుదలను చూసి అతనిని అనుసరిస్తారు. అశ్వత్థామ ఒక్కడే శిబిరంలోకి ప్రవేశించి ధృష్టద్యుమ్నుడు ,శిఖండి,ఉపపాండవులతో పాటు అడ్డువచ్చిన వీరులందరిని ఊచకోత కోస్తాడు పాండవులు అనుకోని ఉపపాండవులు సంహరిస్తాడు కృపాచార్యుడు కృతవర్మలు శిబిరానికి నిప్పు పెట్టి బయటకు వచ్చిన వారిని సంహరిస్తాడు ఈ ముగ్గురు మారణకాండను పూర్తిచేసి చనిపోబోతున్న దుర్యోధనుడికి చెప్పగా దుర్యోధనుడు అశ్వత్థామను కౌగిలించుకొని ఆనందముతో స్వర్గస్తుడవుతాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న భీమార్జునులు అశ్వత్థామను వ్యాసుని ఆశ్రమములో పట్టుకొని యుద్ధము చేయగా అశ్వత్థామ ఓడిపోయి తన శిరోమణిని ఇచ్చేసి ప్రాణాన్ని దక్కించుకుంటాడు కానీ అశ్వత్థామ బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అపాండవము చేయటానికి ఉత్తర గర్భము పైకి ప్రయోగిస్తాడు దీనితో సౌప్తిక పర్వము ముగుస్తుంది.    

పదకొండవ పర్వము స్త్రీ పర్వము. యుద్ధము ముగిసినాక విదురుడు ధృతరాష్ట్రుని ఓదారుస్తాడు. దృతరాష్ట్రుడు, గాంధారి,కుంతీ విదురుడు కౌరవుల భార్యలు కోడళ్ళు కర్ణుని భార్యలు ఇతర రాజుల భార్యలు కురుక్షేత్రానికి వస్తారు. పాండవ పక్షము నుండి పాండవులు ద్రౌపది ఇతరులు వస్తారు వ్యాసుడు గాంధారికి కొడుకులందరిని చూసుకొనే శక్తిని ఇస్తాడు విలపిస్తున్న కోడళ్లను చూసి గాంధారి కోపముతో పాండవులను శపించాలని అనుకుంటే వ్యాసుడు వారిస్తాడు దృతరాష్ట్రుడు భీముడిని కౌగిలించుకోవాలి అని అన్నప్పుడు శ్రీ కృష్ణుడు ధృతరాష్ట్రుని మనోగతము తెలిసిన వాడవటము వలన ఒక ఇనుప ప్రతిమను భీమునికి బదులుగాఉంచితే ధృతరాష్ట్రుని కౌగిలి ఆ విగ్రహము పగిలిపోతుంది ఆ విధముగా భీముడు ధృతరాష్ట్రుని కౌగిలి నుండి రక్షింపబడతాడు. దృతరాష్ట్రుడు చేసేదేమి లేక పాండవులను ఆదరిస్తాడు. పాండవులు గాంధారికి ప్రణామము చేస్తే గాంధారి తన పుత్ర శోకాన్నిఅణుచుకున్నప్పటికీ ఆమె తీక్షణమైన చూపు ధర్మరాజు పాదాల మీద పడతాము వలన ధర్మరాజు గోళ్లు నల్లగా కమిలి పోతాయి. పాండవులను నిష్టూరమాడుతుంది పాండవులు తమ ప్రతిజ్ఞలను నెరవేర్చుకోవటానికే అలా చేసాము అని అంటారు గాంధారి కోపము శ్రీకృష్ణుని మీదకు మళ్లి  శ్రీ కృష్ణ బలరాములతో సహా యదువంశము అంతా నాశనము అవుతుంది అని శపిస్తుంది. విధి నిర్ణయము అలా ఉండబట్టి అని శ్రీ కృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరిస్తాడు దహన సంస్కారాల సమయములో కుంతీ కర్ణుడు తన కొడుకే నాని అతనికి కూడా పాండవులు తర్పణాలు ఇవ్వాలని కుంతీ ఇన్నాళ్లు దాచిన కర్ణుడి జన్మరహస్యాన్నివెల్లడిస్తుంది అప్పుడు ధర్మరాజు ఆడవాళ్ళ నోట్లో రహస్యాలు దాగకూడదని అంటాడు అందుచేతనే అప్పటి నుండి ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింజ కూడా దాగదు అన్న సామెత వచ్చింది.ధర్మరాజు కర్మకాండలు నిర్వర్తించి బాధాతప్త హృదయాలతో పాండవులు గంగా ఒడ్డున నిలిచి ఉండటంతో ఈ పర్వము ముగుస్తుంది. 

పన్నెండవ పర్వము అయినా శాంతి పర్వము అన్నిటికన్నా పెద్దపర్వము ఈ పర్వంలో ధర్మసంబంధమైన విషయాలెన్నో చర్చించబడతాయి. కద  సాగదు ఈ పర్వములోనే కర్ణుని జన్మ వృత్తాంతము,పరుశరాముని శాపము, కర్ణుడి సహాయముతో దుర్యోధనుడు కళింగ రాజకన్యను అపహరించటం,కర్ణుడు జరాసంధుని ఓడించి మాలిని నగరాన్ని స్వాధీనము చేసుకోవటం వంటి వృత్తాంతాలు ఉంటాయి. ధర్మరాజు యుద్దములో గెలిచినా రాజ్యాన్ని స్వికరించటానికి విముఖుత చూపిస్తే అందరు ధర్మరాజును అశ్వమేధయాగము చేయటము ద్వార ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని సలహా ఇస్తారు.అప్పుడు ధర్మరాజు ఒప్పుకుంటే పట్టాభిషేకము జరుగుతుంది శ్రీ కృష్ణుని సలహా మేరకు ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు వెళ్లి అనేక ధర్మ సూక్షమాలను,రాజనీతిని తెలుసుకుంటాడు ఈ పర్వంలో ఎక్కువ భాగము ధర్మరాజుకు భీష్మునికి జరిగిన సంభాషణలే.   

***    

No comments:

Post a Comment

Pages