అమ్మ ప్రేమ
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
అమ్మ ప్రేమ
లౌక్యంఎరుగనిది,
వేరొకరికి శక్యం కానిది.
ఆదిదేవుడైనా వర్ణించలేనిది,
తుది వరకు వర్జించలేనిది,
సానుభూతికి అందనిది,
అనుభూతికి చెందినది.
అంతం లేనిది,పంతం
తెలియనిది.
జీవితాంతం మారనిది.
కథలా కంచికి చేరనిది.
ప్రతిఫలం కోరనిది.
పోలిక లేనిది,(చీ)ఏలిక
లేనిది.
ఆరోగ్యపు మూలిక లాంటిది,
అనుబంధపు మాలిక లాంటిది.
అమృతపు బిందువు,
ఆత్మబంధువు,దయా సింధువు.
అనుబంధానికి తొలి
మెట్టు,
భవబంధాలకు చెంపపెట్టు.
***
No comments:
Post a Comment