శ్రీథరమాధురి - 101
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)
చాలాసార్లు, మీలో చాలామంది నన్ను మీ ఇంటికి పిలుస్తారు...
నేను మీ ఇంట్లోనే ఉన్నాను, మీరు నన్ను ఇంటికి రమ్మని అడుగుతున్నారు. మీ తృప్తి కోసం నేను బయటికి వెళ్లి,మీ తలుపు కొడతాను. మీరు నమ్మకంతో తలుపు తెరిస్తే, నేను లోపలికి రావడం చూడగలుగుతారు. మీకు నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నానన్న నమ్మకమూ లేదు, నేను తలుపు కొట్టినప్పుడు మీరు తలుపూ తీయరు.
ఇంకా నేను ఏం చేయాలని మీరు ఆశిస్తున్నారు?
***
మామూలు జీవుల్ని విశ్వ చైతన్య స్థాయికి ఎదిగేలా సహాయం చేయడానికి నిరాకారమైన పరబ్రహ్మ ఒక ఆకారాన్ని సృష్టించుకున్నారు. శ్రీమన్నారాయణుడి యొక్క దయ అటువంటిది.
*****
గురువాణి
మీరు దేనినైనా కొంతవరకే నిర్వచించగలరు, అంతకుమించి వీలుకాదు.
మీరు ప్రేమను ఎలా నిర్వచిస్తారు?
మీరు చైతన్యాన్ని ఎలా నిర్వచిస్తారు?
మీరు తేనెను ఎలా నిర్వచిస్తారు? మహా అయితే అది తియ్యగా ఉందని చెబుతారు. అంతేగా?
మీరు తేన తింటూ ఉండగా పొందిన అనుభూతిని ఏ విధంగా నిర్వచిస్తారు?
దాన్ని అనుభూతి చెందగలమే గాని, నిర్వచించలేము.
అలాగే భగవంతుడు ఒక అనుభూతి, దాన్ని నిర్వచించలేము.
చైతన్యం అనేది పరమానందానికి శిఖరం వంటిది, దాన్ని నిర్వచించలేము.
కానీ వి.వి.శ్రీథర్ వంటి సామాన్య వ్యక్తికి అటువంటి అనుభూతిని పొందే అదృష్టం ఉండదు. శ్రీధర్ కు ఏదైనా స్థూలమైనది, కంటికి కనిపించేది కావాలి. అందుకే సత్పురుషులు, మునులు, ఋషులు, ఆశ్రమవాసులు, సాధువులు, నాకు దాన్ని మానవ నేత్రాలతో చూడగలిగేలా చేసేందుకు వచ్చారు.
వారి భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు, 'హే భగవాన్! నీ సృష్టిలో వి.వి.శ్రీథర్ అనే అతను ఉన్నాడు. నీవు నిరాకారుడివై ఉన్నప్పుడు, అతను నిన్ను గుర్తించలేకపోతున్నాడు. నిరాకారుడివైన నిన్ను అతను చూడలేకపోతున్నాడు. అందుకే మిమ్మల్ని అతను చూసి, గుర్తించే విధంగా, దయచేసి ఒక ఆకారాన్ని ధరించి అందుబాటులో ఉండండి
విశ్వ చైతన్యమే ఈ పుణ్యవంతుల, మహనీయుల మనవిని మన్నించారు. జీవ చైతన్యం జీవుని గా జన్మించినట్టే, విశ్వ చైతన్యమైన పరమాత్మ భగవాన్ నారాయణుడు, భగవాన్ శివుడు వంటి వారిగా మారారు.
విశ్వశక్తిని శ్రీధర్ వంటి వారు అనుభూతి చెందే విధంగా, భగవానుడిగా పిలువబడే ఈ విశ్వ చైతన్యం, తనకు 'వైకుంఠం' లేక 'శ్రీ కైలాసం' అనే నివాస స్థానాల్ని సృష్టించుకుని, అందులో నివసించసాగింది.
'వైకుంఠము' లేక 'శ్రీ కైలాసము' అనే స్థానాలు విష్ణువు యొక్క చైతన్యానికి, లేక శివుడి యొక్క చైతన్యానికి ధామాలుగా మారాయి.
అత్యంత ఉన్నతమైన ధ్యానస్థితిలో, ఒకరు భగవంతునితో ఐక్యం కాగలిగినప్పుడు, ఈ శివుడు లేక విష్ణువు యొక్క చైతన్యాన్ని 'సహస్రారము' అనే తన స్వీయ భౌతిక క్షేత్రంలో అనుభూతి చెందగలుగుతాడు.
మానవులు, భగవంతుడికి కూడా తమ వంటి నిర్మాణమే ఉండాలని ఆశించారు. అందుకే భగవంతుడికి కూడా ఒక కుటుంబ నిర్మాణం ఉంది. ఆయన కూడా వివాహం చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. విశ్వాన్ని నిర్వహించడానికి ఒక మేనేజ్మెంట్ ఆకృతిని నిర్మించారు. ఇందులో దేవతలు, అసురులు, అనేక విశ్వశక్తులు అనేక విభాగాలుగా ఉంటూ, పరంపరాగతమైన వివిధ స్థాయిలను నిర్వహించడానికి వచ్చి, ఈ సమస్త విశ్వాన్ని నిర్వహిస్తున్నారు.
భగవంతుడు కూడా విశ్వంలో తాను సృష్టించిన అనేక ప్రాంతాలను దర్శిస్తూ అందరిలో నమ్మకాన్ని పాదుకొల్పసాగరు. దైవం భూమిని దర్శించినప్పుడు వాటిని 'అవతారాలు' అన్నారు.
ఈ సమస్త సృష్టిని భగవంతుడు తన వినోదం కోసం సృష్టించారు. ఈ ప్రక్రియలో ఆయన వినోదాన్ని కూడా కల్పిస్తూ, తనను నమ్ముకున్న వారి కోరికలను తీర్చసాగారు. కాబట్టి వినోదించే వారే వినోదాన్ని పంచసాగారు. భగవంతుని లీలావినోదాన్ని, వినోదాన్ని పంచేవారే ఆస్వాదిస్తూ ఆనందించారు.
*****
No comments:
Post a Comment