'హృది'ధ్యానం..మది 'పర'ధ్యానం! - అచ్చంగా తెలుగు

'హృది'ధ్యానం..మది 'పర'ధ్యానం!

Share This

 'హృది'ధ్యానం..మది 'పర'ధ్యానం!

 సుజాత పి.వి.ఎల్.




ఈ విశ్వం ఓ సంచార విద్యాలయం
కాల పరిణామాలు భోధకులు
సుఖదుఃఖాలు శుష్కవలయాలని 
తెలుగు చెప్పింది
మానవ జీవితపు కొలమానాలను గణాంకశాస్త్రం..
దేహం మీద వ్యామోహం వద్దని అర్ధశాస్త్రం...
మనసుకి మబ్బులు వీడితే భావరశ్మి ప్రసరిస్తుందని సామాన్యశాస్త్రం...

దివారాత్రులు  భ్రాంతులు కావు.
చావు పుట్టుకలు భ్రమలు కావని...
అవి..నిత్య సత్యాలని
సాంఘీకశాస్త్రం ద్వారా తెలుసుకున్నాను..

జీవిత పాఠాలకీ..
కాలంపెట్టే పరీక్షలకే పూర్తిగా అలసిపోయాను..
మనసు మాట విననని మోరాయిస్తోంది..
సంసార బాంధవ్యాలు..ఐహిక బంధాలు 
అక్కరకు రాని చుట్టాలైనాయి..
ఇప్పుడు నేనో ఒంటరిని...
'హృది ధ్యానంలో..
'మది' 'పర ధ్యానం'లో జీవిస్తున్న 
వి'గత'జీవిని...!!!
***

No comments:

Post a Comment

Pages