తెలివి –వివేకం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు
తెలివి వేరు, వివేకం వేరు
తెలివికి గమ్యం ముఖ్యం,
వివేకానికి గమనం ముఖ్యం.
తెలివికి నడక ముఖ్యం
వివేకానికి నడత ముఖ్యం
తెలివికి పేరు,ప్రఖ్యాతి ముఖ్యం
వివేకానికి నీతి,రీతి ముఖ్యం.
తెలివి యుక్తులను పన్నుతుంది,
వివేకం శక్తులను పెంచుతుంది.
తెలివి అప్పుడప్పుడు ఎదురుదెబ్బలను తగిలిస్తుంది,
వివేకం ఎప్పుడూ ఎదురుదెబ్బలను తగ్గిస్తుంది.
తెలివి గర్వంతో కనులు ముయిస్తుంది,
వివేకం సహనంతో కనులు తెరిపిస్తుంది.
తెలివికి ఆరంభశూరత్వం ఎక్కువ,
వివేకానికి అంతిమ విజయాలెక్కువ
తెలివిలేకున్నా వివేకం నడిపిస్తుంది.
వివేకం లేని తెలివి ఏడిపిస్తుంది.
***
No comments:
Post a Comment