బుధ గ్రహ కారకత్వాలు - అచ్చంగా తెలుగు

                                                                     బుధ గ్రహ కారకత్వాలు

PSV రవి కుమార్


ఈ పాఠం లో బుధ గ్రహ కారకత్వాలు, బుధ ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం.

 

బుధ గ్రహం మిథున రాశి కి, కన్యా రాశి కి ఆధిపత్యం వహిస్తాడు. జ్యేష్ట, ఆశ్లేష, రేవతి నక్షత్రాలకు, బుధ గ్రహం  ఆధిపత్యం వహిస్తాడు. బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. పైన చెప్పిన మూడు నక్షత్రాలలో ఎవరైతే జన్మిస్తారో, వారి జీవితం బుధ మహాదశ తో ప్రారంభం అవుతుంది .

 

బుధ గ్రహం, తెలివితేటలకు, లెక్కలకు, వ్యాపారానికి, తర్కమునకు కారకత్వం వహిస్తాడు. బుధ గ్రహం అనుకూలించిన జాతకులు, చాలా తెలివి తేటలతో, చదువులో ముందంజ లో ఉంటారు. మాటకారి తనం ఉంటుంది, చమత్కారం తో మాట్లాడతారు.

 

బుధ గ్రహం, మిథున, కన్యా రాశులకు ఆధిపత్యం వహిస్తుంది, ఈ రెండు రాశులు ద్వి స్వభావ రాశూలు. కనుక, బుధుడు ఏ భావం లో ఉంటే, ఆ భావం లో రెండు కు సంబందిచిన ఫలితాలుఇస్తాడు.

ఉదాహరణకు ద్వి కళత్ర యోగం ( ఈది మొత్తం జాతకం పరిశీలించి తీసుకోవలసిన నిర్ణయం), రెండు డిగ్రీలు లేదా రెండు పోస్ట్ గ్రాడ్యుఎషన్లు ఇలాంటివి.

బుధ గ్రహం కన్యా రాశి లో ఉచ్చ పొందుతాడు, మీన రాశి లో నీచ పొందుతాడు .

 

బుధ కి రవి కి  మద్య 14 డిగ్రీ ల పైన దూరం ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు

లగ్నం లో బుధ ఉంటే తెలివితేటలు కలవారు గా ఉంటారు, ఎటువంటి సమస్యనైనా తేలికగా పరిష్కరిస్తారు.

 

ద్వితీయం లో బుధ ఉంటే, ధన సంపాదన బాగుంటుంది. వీరు వాక్చాతుర్యం తో అందరిని ఆకట్టుకుంటారు. వీరికి రాజ్యాధిపతి తో కనుక సంబందం ఏర్పడితే, వీరు తమ వాక్కు ద్వారా కూడా ధన సంపాద్న చేస్తారు, ఉదాహరణకు, మిమిక్రీ ఆర్టిస్ట్లు, యాంకరింగ్, డీజే వంటి వృత్తులలో రాణిస్తారు.

తృతీయం లో బుధ ఉంటే, తృతీయం లో బుధుడు ఉంటే, వ్యాపారం లో రాణిస్తారు. మార్కెటింగ్ తెలివితేటలు బాగుంటాయి. షేర్ మార్కెట్ లో కూడా ధన సంపాదన చేస్తారు. మాటతీరు ఆకర్షనీయం గా ఉంటుంది.

చతుర్ధం లో బుధ ఉంటే, ప్రాధమిక విద్య లో మంచి మార్కులు సాధిస్తారు. రెండు వాహనాలు కలిగి ఉంటారు. దేశం పై మక్కువ కలిగి ఉంటారు. రెండు గృహములు కలిగి ఉంటారు.

 

పంచమం లో బుధ ఉంటే, తెలివి తేటలు కలవారు గా ఉంటారు. రచన సామర్ద్యం కలిగి ఉంటారు. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంటుంది (జాతకం మొత్తం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి)

 

షష్టమం లో బుధ ఉంటే, అకౌంటింగ్ రంగం లో విద్యనభ్యసించే అవకాశం కలిగి ఉంటారు. కాంపిటిటివ్ పరీక్షలలో ర్యాంక్ సాధించే వారుగాఉంటారు.

 

సప్తమం లో బుధ ఉంటే, వివాహ విషయం లో జాగ్రత్త అవసరం. పొంతన చూసి వివాహం చేయాలి. మేనరికం చేసుకునే అవకాశం ఉంది (పూర్వపు రోజుల్లో ఇది ఎక్కువగా జరిగేది, ఈ రోజుల్లో అంతగా వర్తించదు).

 

అష్టమం లో బుధ ఉంటే, స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగి ఉంటారు. వివాహ విషయం లో పొంతన చూస్కుని చేసుకోవాలి. అత్తగారింటినుండి ధన లాభం కలిగే అవకాశం కలదు. చార్టెడ్ అకౌంట్స్ గా రాణిస్తారు. నిర్ణయాలు తీసుకోవటం లో ఇబ్బందులు ఎదురుకుంటారు.

 

భాగ్యం లో బుధ ఉంటే, ఉన్నత విద్య లో రెండు డిగ్రీలు చేసే అవకాశం ఉన్నది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. విదెశాలకు వెళ్ళు అవకాశం కలదు.

 

రాజ్యం లో బుధ ఉంటే, వ్యాపారం చేసే అవకాశం కలదు. కంప్యూటర్ సంబందిత ఉద్యోగం లేదా అకౌంటింగ్ సంబందిత ఉద్యోగం చేయు అవకాశం కలదు.

 

లాభం లో బుధ ఉంటే, ధన లాభం కలిగి ఉంటారు. వివిధ మార్గాల ద్వారా ధన సంపాదన కలిగి ఉంటారు అనగా, రెండు సంపాదనలు కలిగి ఉంతారు. షేర్ మార్కెట్ ద్వారా ధన లాభం కలుగుతుంది.

వ్యయంలో బుధ ఉన్న, విదేశాలకు వెళ్ళూ అవకాశం కలదు. తరచూ అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు. హాస్పిటల్లలో కానీ, పోలీస్ సంబందిత శాఖలలో ఉద్యోగాలు చేపట్టూ అవకాశం కలదు. ఇన్స్యూరెన్స్ ఎజంట్లగా ఉంటారు.

 

నిత్యం విష్ణు సహస్రనామ స్త్రొత్రం వినటం లేదా చదవటం మంచిది. వేంకటేశ్వర స్వామిని తులసి మాల తో పూజించుట మంచిది. 

 

ఎవరికయినా జాతకం తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ చేయవలసిన నంబర్ 911 304 8787 . కన్సల్టేషన్ చార్జస్ వర్తిస్తాయి.

 

No comments:

Post a Comment

Pages