'దివ్య దీపావళి'
-సుజాత.పి.వి.ఎల్.
జీవితం కమ్మని పాటలా
అలా అలా సాగిపోతే ఎంత బావుణ్ణు..
చేదుని కాసేపలా పక్కన పెట్టి
పంచామృతాల మధురానుభూతిని
మననం చేసుకుంటే చాలదూ !
ప్రతి అనుభూతినీ
సప్త వర్ణ శోభిత ఇంద్రధనుస్సుతో
పోల్చుకుంటే..
బ్రతుకు భగవంతుడిచ్చిన
వరంలా తోస్తుంది
మనసు సున్నితత్వాన్ని
కోల్పోకుండా
స్పందించే గుణాన్ని
అలవర్చుకున్న నాడు
మానవత్వం మహనీయ
తత్వమవుతుంది ..
హృదయం కోటి ప్రకంపనల
నాగారా లా మ్రోగుతుంది
అనురాగ వీణలు మీటుతుంది.
అశాంతిని పారద్రోలి
చీకటి వాకిట్లో ఆనంద
దివ్వెలు వెలిగిస్తే ..
అదే ..దివ్య దీపావళి !!
***
No comments:
Post a Comment