మనీషా పంచకం - అచ్చంగా తెలుగు

 మనీషా పంచకం వైశిష్టత

రచన: సి.హెచ్.ప్రతాప్ 



ఒకరోజు మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడ్డాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.

అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి |


ఓ మహానుభావా! చెప్పు. నన్ను దారికి పక్కగా తొలిగిపొమ్మని నువ్వన్నది, నేను తక్కువ జాతికి చెందినవాడననా? అన్నంతో రూపొదిన ఒక శరీరం, అన్నంతోనే రూపొందిన మరో శరీరాన్ని పక్కకు తొలగమంటుందా లేక ఒక శరీరంలో ఉన్న ఆత్మ, మరో శరీరంలోని ఆత్మను పక్కకి తొలగిపొమ్మని చెబుతుందా?


ఈ రెండిటిలో ఏది పక్కకి తప్పుకొని దూరంగా ఉండాలి? చెప్పు మహానుభావా, చెప్పు!   ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు.  అద్వైతం అనగా భగవంతుడు-భక్తుడు ఒకటే అని నమ్మే సిద్ధాంతం. అహం బ్రహ్మాస్మి తత్త్వం. అద్వైతానికి కుల, మత, స్త్రీ/పురుష, చిన్నా/పెద్దా, తేడాలు లేవు. ఎందుకంటే ఒకే పరబ్రహ్మ యొక్క వివిధ స్వరూపాలమందరమూను

ఆ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడినట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.



ఈ సమస్త జగత్తు అశాశ్వతమని, దానికి ఆధారమైన పరబ్రహ్మం మాత్రమే సత్యమన్న నిజాన్ని గ్రహించడమే కాకుండా దానిని  అనుభవపూర్వకంగా ఆచరణలోకి తీసుకురావడమే ప్రతీ మనిషి కర్తవ్యమని,తమ కర్మ ఫలాలను జ్ఞానమమే అగ్నిలో దహింపజేసి , వాటిని నిజ జీవితంలో ఆచరించిన వ్యక్తి ఎవరైనా , అతని కుల మత, ప్రాంత, వర్ణ, లింగ బేధాలతో ప్రమేయం లేకుండా గురువుగా ఏ చైతన్యం అయితే జాగ్రత్, సుషుప్తి, స్వప్న అవస్థ లందు, చాలా చక్కగా ప్రకాశిస్తుందోబ్రహ్మ మొదలు చిన్న చీమ వరకు , సర్వ ప్రదేశం లందు, సర్వ వేళలా, అన్నిటా సాక్షీ భూతమై నిలిచి వున్నదో,

నేను అలాంటి చైతన్య స్వరూపుడ ను. నేను జడత్వాన్ని కాను, అనే నిశ్చిత జ్ఞానం ఎవరికైతే కలదో వారు, బ్రాహ్మణుడైన, చండాలుడైనా నాకు గురుతుల్యులు, వారిపట్ల, నాకెలాంటి భాద భావం లేదుస్వీకరించి  సేవిస్తాను  అని  ఆదిశంకరులు ఈ మనీషా పంచకం ద్వారా అపూర్వంగా తెలియజేసారు. 


బేధ భావం నశించిన స్థితే మనీష . ఎటువంటి బేధం లేకపోవడమే అద్వైతం.ఇది ఆధ్యాత్మికంగా ఆకళింపు చేసుకోవడమే కాక అనుభవపూర్వకంగా ఆచరణలో ఎరుక కలగాలని ఆయన ప్రబోధిస్తున్నారు. ఈ విధంగా మనీషా పంచకం అనే ఈ గొప్ప స్త్రోత్ర రాజం కేవలం జ్ఞాన భాండాగారమే కాక సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. సర్వ మానవ సమానత్వాన్ని బోధించింది.అందుకే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

No comments:

Post a Comment

Pages