ఇంకా సందేహమా? - అచ్చంగా తెలుగు

ఇంకా సందేహమా?

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


సంభవామి యుగేయుగే అన్నందుకే స్పందిస్తున్నాను.

సునామీలు,భూకంపాలు,

వాహనప్రమాదాల రూపంలో

మీ పాపాల ఫలితాన్ని అందిస్తూనే ఉన్నాను.

మీలా నేను వ్యక్తిలా కాకుండా

అనంతమైన శక్తిలా నినదిస్తున్నాను.

సమయసందర్భాలను పాటించటం నా మొదటి నియమం.

కుండ నిండేవరకు వేచిఉండటం నా రెండవ నియమం.

నీలా ఆవేశపడి ప్రశించను,

వేవేకం కోల్పోయి విమర్శించను,

అజ్ఞానంతో ప్రవర్తించను.

ఎవరు తీసుకున్న గోయిలో వారే పడతారు,

ఎవరు చేసుకున్న పాపాలతో వారే చేడతారు.

అలా చేయబడుతుంది నా పాలన,

అర్ధంచేసుకున్న వారికే అర్ధమౌతుంది నా లాలన.

 ***

No comments:

Post a Comment

Pages