శివం - 93 - అచ్చంగా తెలుగు

శివం - 93

రాజ కార్తీక్ 




భక్తులారా ! ఇప్పటివరకు.. మీరు విన్న గుహని కథ శ్రీకరుని కథ ,చెప్పుల సాంబయ్య కథ రావణుడి కథ, నంది కథ, ఉద్భవ రాజు కథ, కల్పనా భారతి కథ, శివమ్మ కథ, హార సిద్ధుని కథ, ఈ భక్తుల కథలలో వైరాగ్యము నేను పెట్టిన పరీక్షలు... సమయాను సందర్భంగా. వారి నుంచి వచ్చిన వేదాంతాన్ని తత్వాన్ని వారు నా యందు చూపిన భక్తిని చూశారు

ఇప్పుడు మీరు వినపోయే కథ నా భక్తుడిది కాదు ఒక కళాకారుడిది.. కళ కి  అంకితం అయిన తన మనసుని నేను ఎలా స్వీకరించాను దాన్ని నా పూజ గా ఎలా అనుగ్రహించాను... కళారాధన నటరాజ పూజ . మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తిని ఎలా నేను కరుణించాను ఈ జగన్నాటకంలో ఈ నాటక సూత్రధారిని ఎలా పావుగా కదిపాను.. చదివి తరించండి..

గు హు డు లోని రామభక్తిని, శ్రీకరుడు లోని ఆంజనేయ భక్తిని, చెప్పుల సాంబయ్య వైరాగ్య భక్తిని, రావణుడు నా యందు చూపిన అజరామరభక్తిని, నంది యొక్క ఆత్మార్పణ భక్తిని, ఉద్భవరాజు లోని వైర భక్తి ని, కల్పనాభారతి లోని రాగ మిళితమైన ప్రేమ అనే భక్తి ని, శివమ్మ తన బిడ్డగా నాయందు చూపించిన మాతృభక్తిని,.. హరసిద్ధుడు నా యందు చూపించిన స్నేహం అనే భక్తి ను ఆస్వాదించారు..
ఇప్పుడు కేవలం కళాతపస్సు చేస్తూ తెలియకుండానే నా నటరాజా రూపాన్ని ఆరాధిస్తున్న కార్తికేయ భక్తుని
చదివి తరించండి..


కోటప్పకొండ.. శివ రాత్రి ..ఉత్సవం

కోటి ప్రభలు ఒకసారి వస్తే కొండ దిగి వచ్చేంత ఆనందం నాది..

అలాంటి కోటి ప్రభ లు వచ్చిన ఆనందాన్ని కలగజేసే ఒక భక్తుడు వస్తే.. భక్తుడు కాదు రచన నేర్పరి.. దర్శక దిగ్గజం.. అతడే కార్తికేయుడు..

ఇప్పుడే పరుగు మొదలుపెట్టిన విధంగా తన కండువాని తలకి కట్టుకుంటూ కోటప్పకొండ వైపు అడుగు వేస్తున్నాడు మన కార్తికేయుడు..

అతగాడి కళ్ళకి దూరంగా కోటప్పకొండ.. ఆ కోటప్పకొండను చూస్తూ.. అక్కడ వస్తున్న నాప్రబల ముందు ఆనందంగా కేరింతల కొడుతూ నర్తిస్త
"చే దు కో కోటయ్య ఆదుకో కోటయ్య"అని పిచ్చ సంతోషంతో పిలుస్తున్నాడు

చేదుకో  అంటే చేదు కోకుండా ఉంటానా? ఆదుకోమంటే ఆదుకోకుండా ఉంటాను ?


ఎడ్ల బండ్లని పట్టుకొని కొన్ని వందల మంది నాకోసం ప్రభలు కట్టుకుని తీసుకువస్తున్నారు ఒక్కొక్కరి ప్రభలో ఒక్కొక్క ముచ్చట ఒక  కొక్కరి ముచ్చటలో ఒక్కొక్కరి ఆనందం ఒక్కొక్కరి ఆనందంలో ఒక్కరి భావం ఒక్కొక్కరిభావంలో ఒక్కొక్క లాస్యం ఒక్కొక్కరి లాస్యంలో  ఒక్కొక్క బావన.. .. ఒక్కొక్క భంగిమలో ఒకొక్క లావణ్యం ..అదే చిదానందం

కార్తికేయుడు ఒక్కొక్క అడుగు కోటప్పకొండ వైపు వేస్తుంటే సాక్షాత్తు నాకే  వద్దామని అనిపిస్తుంది వచ్చేస్తాను కూడా..

ఒక్కొక్క ప్రభ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరి కళ నైపుణ్యం పరిశీలిస్తూ.. ఆనందంగా అక్కడ మారు మోగుతున్న డప్పులకు వాయిద్యాలక అనుగుణంగా నృత్యం చేస్తూ ముందుకు వస్తున్నాడు

అక్కడ ఉన్నపలంగా చెట్టు నుంచి ఒక కొమ్మ విరిగిపడటంతో.. అది కూడా కచ్చితంగా ప్రభ పైన పడటంతో.. ఆ ప్రభ పూర్తిగా కింద పడపోయింది
. ప్రభకి ఆధారంగా చేసుకుని ఉన్న చెక్క వెదురు లు కూడా గతి తప్పి పక్క ప్రభల మీద పడబోఅయి.

కార్తికేయుడు.. పడుతున్న ప్రభకు ఎదురుగా.. తన కాలి కింద ఉన్న వెదురు కర్రలని లా ఘవంగా యుక్తితో పైకి లేపి.. ఆప్పటికీ  ఏటువంటి హాని జరగకుండా గాలిలో నిలబెట్టాడు...

అది చూసిన వారందరూ సెహభాష్అ ని చప్పట్లు కొట్టారు

ప్రభకి ఆధారంగా ఉన్న చెక్క బొంగులు ఇప్పుడు పూర్తిగా పక్కకి వాలిపోవడంతో.
పక్కన వస్తున్న ప్రభలు కూడా మీద పడి కింద పడిపోయాయి ..
ఎలా పడుతున్నాయో వరుసని గమనించిన కార్తికేయుడు.. తాండవం అప్పుడు జరిగే నృత్యంలో నా జటలు గిరాగిరా తిరిగినట్టు ఆ తాడును తిప్పి.
ఏటవాలుగా దాన్ని కట్టి.. ఒక ఎద్దు పైకి ఎక్కి
."బసవ ప్ర భలు కింద పడకూడదు లగేత్తు " అని చెవి దగ్గర చెప్పాడు
వృత్తాకారంలో ఉన్న కో లనులో రాయి వేస్తే సుడి తిరిగినట్టు.. తన కట్టిన తాడుని.
పడబోతున్న ప్రతి ప్రభ కి ఆ నిస్తూ ఎక్కడ ఏ ప్రభ కింద పడకుండా... కింద పోడ పోయే క్షణంలో తాడు సాయంతో గాలిలో అంతే ఆపాడు..

ఆ ప్రభ యజమానులు వెంటనే చేరుకొని  కింద పడకుండా ప్రభ పాడవకుండా జాగ్రత్తగా తిరిగి నిలబెట్టారు..

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. కార్తికేయని మెడ.లో పూలదండ పడింది

పక్కన తిరునాళ్లకి  వచ్చిన వాయిద్య కారులు కొట్టిన డప్పులు కి .. మనవాడు శివతాండవం చేస్తున్నాడు

తన నృత్యం అయిపో కొట్టగానే సరిగ్గా కోటప్పకొండ ఆవరణలోకి అడుగు పెట్టాడు

దగ్గర నుంచి కొండని చూస్తూ..
"ఆహా ఇక్కడే కదా శివయ్య.. సతీ మాత కోసం బాధపడుతూ ఇక్కడికి వచ్చి కూర్చుంది.. విరాగిన అన్నావ్ విభూతి అన్నావ్.. భార్య వద్దన్నావు బంధాలు లేవన్నా వు .. కట్టుకున్న భార్య కొలిమి అయిపోతే తనకోసం ఎంతో బాధపడ్డావు.. నీకు పడ్డ వేదన.. ఈ పాత్ర ఎవరైనా సరైన నటుడు దొరికితే రక్తి కట్టించవచ్చు నాటకంలో

ఇక నా అడుగు కోటప్పకొండ పై నుండి కిందకు వేయటం మొదలుపెట్టాను ఎందుకంటే చెప్పాను కదా కోటి బ్రదర్ వచ్చినా ఆనందం కార్తికేయుడు వస్తే వచ్చింది ఎందుకంటే..
చూస్తారు గా...

No comments:

Post a Comment

Pages