ఏనాటిదో?
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
కోరికలకు, కన్నీటి చారికలకు
ఉన్న అనుబంధం ఏనాటిదో?
భ్రమలకు,వాటివల్ల కలిగే శ్రమలకు
ఉండే భవబంధం ఏనాటిదో?
కలలకు,అవిరేపే కలతలకు
ఉండే అనుబంధం ఏ నాటిదో?
నష్టాలకు,అవే చూపే నలతలకు
ఉండే భవబంధం ఏనాటిదో?
కర్మలకు అవి కలిగించే జన్మలకు
ఉండే అనుబంధం ఏనాటిదో?
వలపులకు అవి కలిగించే వేదనలకు
ఉండే భవబంధం ఏనాటిదో?
***
No comments:
Post a Comment