ద్వందాతీత స్థితి
జీవిత ప్రయాణం లో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు అనేక ద్వందాలు ఎదురవుతుంటాయి. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం కలుగుతుంటుంది; మనకు జ్ఞానం కావాలి; కాని అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము; పరిశుద్ధమైన ప్రేమని కోరుకుంటాము కాని పదేపదే స్వార్ధపూరితమైన ప్రేమ ఎదురవుతుంది.మన లౌకిక విద్య, సాంకేతికత పాండిత్యములు జీవితం లో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. మనకు జీవితపు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటానికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితి లో ఉన్న నిజమైన గురువు లభించినప్పుడు, మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరువబడుతుంది.ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు. మనం కూడా అర్జునుని మార్గంలో పయనించేందుకు స్థిర చిత్తంతో, ఏకాగ్రతతో ఒక సద్గురువుని సేవించాలి.
***
No comments:
Post a Comment