శ్రీకృష్ణుడు -జాంబవతి ల పుత్రుడు సాంబుడు - అచ్చంగా తెలుగు

శ్రీకృష్ణుడు -జాంబవతి ల పుత్రుడు సాంబుడు

Share This

 శ్రీకృష్ణుడు -జాంబవతి ల పుత్రుడు సాంబుడు

అంబడిపూడి శ్యామసుందరరావు 


సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతికి  పుట్టిన కుమారుడు ఇతని ఆకతాయి చేష్టలు యదువంశ నాశనానికి కారణమవుతాయి మహాభారతము లోను, దేవి భాగవత పురాణము లోను సాంబుడి పుట్టుక గురించి వివరింపబడింది. చాలాకాలము తనకు పిల్లలు లేకపోవటంతో జాంబవతి శ్రీకృష్ణుని తనకు కూడా ప్రద్యుమ్నుని లాగ అందమైన కుమారుడిని ప్రసాదించమని వేడుకుంటుంది.శ్రీకృష్ణుడికి ఆ పుట్టబోయే కొడుకు యదువంశ నాశనానికి కారణమవుతాడని తెలుసు శ్రీకృష్ణుడు ఉపమన్యుడనే మహర్షిని హిమాలయాల్లో కలిసి అయన సలహా మేరకు శివుడిని ప్రార్ధిస్తాడు  శ్రీకృష్ణుని ప్రార్థనకు శివ పార్వతులు అంగీకరించి  జాంబవతికి పుత్రుడిని ప్రసాదిస్తారు. అతడే సాంబుడు.జాంబవతికి  సాంబుడు కాకుండా సుమిత్ర, పురుజిత్, సహస్రజిత్ విజయ, చిత్రకేతు, వసుమన్, ద్రవిడ,క్రతు అనే కుమారులు ఉన్నట్లు విష్ణు పురాణము లో చెప్పబడింది.

సాంబుడు పెరుగుతున్నప్పటి నుండి అతని ఆకతాయి చేష్టలు యదు వంశానికి ఇబ్బందులను తెచ్చిపెట్టేవి, దుర్యోధనుడి కూతురు లక్ష్మణ కుమారుని చెల్లెలు అయిన లక్ష్మణ స్వయంవర విషయము ఆవిడ అందము గురించి విన్న సాంబుడు స్వయంవరానికి వెళ్లి ఆవిడను పెళ్లి చేసుకోవాలని ఎత్తుకు వస్తాడు. ఈ విషయముతెలిసిన కురు వీరులు అతని పై దాడి చేస్తారు వారితో పోరాడిన సాంబుడు చివరకు వారి చేతిలో బందీ అవుతాడు వారుసాంబుడిని ఖైదీ చేస్తారు. ఆ తరువాత లక్ష్మణకు మళ్లా  స్వయమువరము ఏర్పాటు చేస్తారు కానీ ఇతర రాకుమారులు ఎవ్వరు లక్ష్మణ ను వివాహమాడటానికి ముందుకు రారు యాదవులు సాంబుడి తరుఫునమళ్లా  దాడి చేస్తారన్న భయము, మరియు ఒకరు ఎత్తుకెళ్లిన కన్యను ఇంకొకరు వివాహము ఆడటం ధర్మము కాదని ఇతర రాకుమారులు నిరాకరిస్తారు. బలరాముడు కౌరవుల చెరలో ఉన్న సాంబుడిని విడిపించటానికి హస్తినాపురానికి వస్తాడు కానీ కౌరవులు సాంబుడిని విడుదల చేయటానికి నిరాకరిస్తే ఉగ్రుడైన బలరాముడు తన హలాయుధముతో హస్తినకు పెకలించటానికి సిద్దమవుతాడు పరిస్థితి తీవ్రతను గుర్తించిన దుర్యోధనుడు బలరాముని క్షమించమని అడిగి సాంబుడికి లక్ష్మణకు వివాహము చేయటానికి అంగీకరిస్తాడు ఆ విధముగా సాంబుడి వివాహము ఘనముగా దుర్యోధనుని కుమార్తె తో జరుగుతుంది.

ఇంతటితో సాంబుడి ఆకతాయి చేష్టలకు తెరపడలేదు.నారదుడు ద్వారకకు వచ్చినప్పుడు అందరు ఆయనను సాదరముగా ఆహ్వానిస్తారు కానీ సాంబుడు నారదుని గౌరవించకుండా అవమానపరుస్తాడు సాంబుని ప్రవర్తన గురించి నారదుడు శ్రీకృష్ణుని దృష్టికి తెస్తాడు.నారదుడు ద్వారకా నుండి వెళ్లినాక శ్రీకృష్ణుడు సాంబుని మందలిస్తాడు సాంబునికి కుష్టు వ్యాధి రావటానికి భిన్న కధనాలు ఉన్నాయి.భవిష్య పురాణము, స్కంద పురాణము, మరియు వరాహ పురాణములలో చెప్పిన దాని ప్రకారము శ్రీ కృష్ణుని భార్యలలో(16 వేల గోపికలలో) ఒకరైన నందిని  సాంబుని రూపానికి ఆకర్షించ బడటం నారదుని ద్వారా తెలిసుకున్నశ్రీ కృష్ణుడు సాంబుడు  కుష్టు వ్యాధి గ్రస్తుడవుతాడని శపిస్తాడు తన ఆవతార  పరిసమాప్తి తరువాత వారందరు  దొంగలచే అపహరించబడతారనికూడా శపిస్తాడు ఇంకొక కధనం ప్రకారము సాంబుని ఆకతాయి చెశాతాలకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు సాంబుడు కుష్ఠు వ్యాధి గ్రస్తుడవుతాడని శపిస్తాడని అంటారు.

సాంబుడు శాపవిమోచనానికి ప్రార్ధించగా కరుణించిన శ్రీకృష్ణుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుని ప్రార్ధించమని చెపుతాడు. సాంబుడు కాశీ చేరి చంద్రభాగ నది తీరాన మిత్రవన అనే ప్రదేశములో  ఒక కొలను నిర్మించి సూర్యునివిగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించి 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ కొలనును సాంబ కుండ్ అనియు సాంబుడు ప్రతిష్టించిన సూర్యుని విగ్రహాన్ని సాంబా ఆదిత్య గా పేర్కొంటారు. కాశీ ఖండము లోని 48 వ అధ్యయము లో పేర్కొన్నట్లుగా ఎవరైనా ఆ సాంబ ఖుండ్ లో సూర్యునికి ప్రీతికరమైన ఆదివారంనాడు స్నానమాచరించి సూర్యుని ప్రార్ధిస్తే వారికి సూర్యుని అనుగ్రహము వలన ఆరోగ్యము ప్రాప్తిస్తుంది.అలాగే వివాహిత స్త్రీలు అక్కడ స్నానము ఆచరించే సూర్యుని ప్రార్ధిస్తే వారు సుమంగళి గా ఉంటారని భక్తుల విశ్వాసము.

సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది అని కూడా నమ్మకము. సాంబ కుండ్ ను సూర్య కుండ్ అని కూడా అంటారు. కురుక్షేత్ర యుద్ధము అనంతరము కురువంశ నాశనానికి శ్రీ కృష్ణుడే కారణమని గాంధారి శ్రీకృష్ణుని నిందించి యదు వంశము కూడా నాశనము అవుతుంది అని శపిస్తుంది శ్రీ కృష్ణుడు  ఆ శాపాన్ని మౌనంగా అంగీకరిస్తాడు తన అవతార పరిసమాప్తి సమయము ఆసన్నమయినదని తెలుసుకుంటాడు మౌసల పర్వంలో ఈ శాపము ఎలా ఫలిస్తుందో వివరించబడింది గాంధారి శాపము తరువాత 36 సంవత్సరాలకు యాదవులు అందరు మధురోన్మత్తులై సముద్రపు ఒడ్డున సంతోషముగా ఉన్నసమయములో దూర్వాసుడు,ఇతర మునివరులు తమ శిష్యులతో శ్రీకృష్ణుని దర్శనము కోసము వస్తుంటారు దూర్వాస మునిని ఆట పట్టించటానికి యాదవులు సాంబునికి  ఆడ వేషము వేసి గర్భిణీ అని చెప్పి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడుతాడా? అని ఋషులను హేళనగా అడుగుతారు ఆగ్రహించిన దూర్వాసుడు యదు వంశ నాశనానికి కారణమయె ముసలం పుడుతంది అని శపిస్తాడు ఆ మరునాడు మునుల శాపము ఫలితముగా సాంబుడు ముసలాన్నీ కంటాడు

యాదవ కుర్రకారు ఈ విషయాన్నీ ఉగ్రసేన మహారాజుకు తెలియజేస్తారు ఆ రాజు యాదవులతో ఆ ముసలాన్ని పూర్తిగా అరగదీసి నామరూపాలు లేకుండా చేయమని ఆదేశిస్తాడు అరగదీయగా ఏర్పడిన ధూళి నీటిలో కలిసి ఆ ప్రాంతములో రెల్లు గడ్డిలా ఏర్పడుతుంది ఆ తరువాత ఎదో శుభ సందర్భముగా సముద్రపు తీరానికి వచ్చిన యాదవులు త్రాగిన మైకంలో తగువులాడుకుంటూ  ఆ రెల్లు గడ్డిని ఆయుధాలుగా చేసుకొని ఒకరినొకరు చంపుకుంటారు ఇదంతా గాంధారి, మరియు దూర్వాస ముని శాపల ఫలితము ముసలన్నీ అరగదీయగా మిగిలిన చిన్న ఇనుప ముక్కను నీటిలో చేప మ్రింగుతుంది ఆ చేపను  పట్టిన జరా అనే ఒక వెటకాడు  ఆ ముక్కను తనబాణము మూలకు గా తయారు చేసుకుంటాడు చెట్టు క్రింద విశ్రాన్తి తీసుకుంటున్న శ్రీకృష్ణుని కాలి బొటన వ్రేలు  ఆ వేటగానికి ఒక లేడి కన్నులాగా కనిపించగా బాణము వదిలితే ఆ బాణము బొటన వ్రేలికి తగిలి శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి చేస్తాడు ఆ విధముగా యదు వంశ నాశనానికి శ్రీకృష్ణుని నిర్యాణానికి సాంబుడు కారణమవుతాడు.

No comments:

Post a Comment

Pages