శని గ్రహ కారకత్వాలు మరియు ఫలితాలు
ఈ పాఠం లో శని గ్రహ కారకత్వాలు, శని ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం.
శని మకర రాశి కి, కుంభ రాశి కి ఆధిపత్యం వహిస్తాడు. పుష్యమి,
అనురాధ,
ఉత్తరాభాద్ర నక్షత్రాలకు,
శని ఆధిపత్యం వహిస్తాడు.
శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. పైన చెప్పిన మూడు నక్షత్రాలలో ఎవరైతే జన్మిస్తారో, వారి జీవితం శని మహాదశ తో ప్రారంభం అవుతుంది .
శని గ్రహం చాలా నెమ్మది గ్రహం. జాతకుడికి శని గ్రహ ప్రభావం
ఉంటే, నెమ్మది
గా ఉంటారు, స్నేహితుకు
తక్కువగా ఉంటారు,
హుషారుగా ఉండరు. నలుగురి తో కలవటానికి సమయం తీసుకుంటారు. సేవక వృత్తి చేస్తారు.
యోగ శని అయితే కష్టపడిన తర్వాత విదేశాలకు వెళతారు. 36
సంవత్సరముల తర్వాత జీవితం లో స్తిర పడతారు.
శని యోగిస్తే జీవితం లో అన్ని సాధిస్తారు, కానీ, అన్ని మెల్లగా
సాధిస్తారు. ఒకే సారి పై మెట్టుకి ఎదగరు, ఒకొక్క మెట్టూ ఎక్కుతూ జీవితం లో విజయవంతం అవుతారు.
రచనలు చేయువారికి శని గ్రహం కనుక యోగకారకుడు అయితే, సీరియల్లు వంటి
రచనలు, లేదా
దీర్ఘకాలిక రచనలు చేస్తారు.
శని గ్రహం పీడిస్తే ఏ కార్యం తలపెట్టిన అది నెరవేరదు, ఎప్పుడూ జీవితం
లో వైఫల్యాలు.
లగ్నం లో శని ఉంటే నెమ్మదిగా ఉంటారు, బద్దకస్తులుగా
ఉంటారు, ఎవరితో
ఎక్కువ కలవరు. జీవితం లో ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది.
ద్వితీయం లో శని ఉంటే, కుటుంబం
లో ఎక్కువగా కలవరు ధన సంపాదన 36 సంవత్సరములు దాటిన తర్వాత కొంత మేర బాగుంటుంది.
ఆర్దిక ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. వాక్చాతుర్యం ఉండదు.
తృతీయం లో శని ఉంటే, నలుగురితో
కలవరు. మార్కెటింగ్ వృత్తి లో పరవాలేదనిపిస్తారు. ఈ భావాన్ని, ఉపచయం అంటారు.
ఇటువంటి భావాలలో పాప గ్రహాలు యోగిస్తాయి. విదేశాలకు వెళ్ళు అవకాశం ఉంటుంది.
చతుర్ధం లో శని ఉంటే, వాహనాలు
నెమ్మది గా నడుపుతారు. గృహ సౌఖ్యం 36 సంవత్సరముల తర్వాత ఉంటుంది. ప్రాధమిక విద్య
లో సరిగా చదవరు. కొంత మంది చిన్న వయసులో హాస్టల్ లో ఉండి చదువుతారు.
పంచమం లో శని ఉంటే, సంతానం
ఆలస్యం గా కలుగుతుంది. చిన్న వయసులో చదువులో వెనకపడి ఉంటారు.
షష్టమం లో శని ఉంటే, వైద్య
విద్య పై లేదా ఫార్మసీ వంటి విద్య పై మక్కువ ఉంటుంది. విదేశాలకు వెళ్ళు అవకాశం
ఉంది. రుణములు తీసుకుంటారు.
సప్తమం లో శని ఉంటే, వీరికి వివాహం
ఆలస్యం అవుతుంది. వ్యాపారం చేస్తే ఎదుగుదల పెద్దగా ఉండదు. చిన్న చిన్న అనారోగ్య
సమస్యలు వేదిస్తాయి. ఉన్నత విద్య కోసం చేయు ప్రయత్నాలలో ఆటంకాలు, ఆలస్యం. జీవిత భాగస్వామిని అర్దం చేసుకోవటం లో జాప్యం.
అష్టమం లో శని ఉంటే, వైద్య
రంగం లో ఉంటే సఫలం,
లేదంటే నిరంతరం అనారోగ్య సమస్యలు. అత్తగారింటి నుండి సమస్యలు ఎక్కువగా
వస్తాయి. ఉద్యోగం లో ఎదుగుదల లో ఆలస్యం.
భాగ్యం లో శని ఉంటే, ఉన్నత
విద్య లో ఆలస్యం,
అనుకున్న కళాశాలలో ప్రవేశం పోందలేరు. విదేశాలకు వెళ్ళు అవకాశం ఎక్కువ కానీ, మొదటి ప్రయత్నం
లో ఆటంకాలు,
రెండవ ప్రయత్నాలలో విజయం.
రాజ్యం లో శని ఉంటే, ఉద్యోగం
లో ఇబ్బందులు,
ఎదుగుదల,
ప్రమోషన్ల కోసం కష్టపడాలి. విదేశాలలో కార్మిక వృత్తి చేపట్టే వారికి అనుకూలం.
లాభం లో శని ఉంటే ధన సంపాదన లో జాప్యం. షేర్ మార్కెట్ కలిసి రాదు. 36 సంవత్సరముల
తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
వ్యయంలో శని ఉన్న, 36
సంవత్సరములు దాటిన తర్వాత విదేశాలకు వెళతారు. తరచూ అనారోగ్యాలకు గురి అవుతారు.
ఆధ్యాత్మిక చింతన లో కొంత మెరుగు కనపడుతుంది.
ఎవరికయినా జాతకం తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ చేయవలసిన నంబర్ 911 304 8787 . కన్సల్టేషన్ చార్జస్ వర్తిస్తాయి.
No comments:
Post a Comment