శివం -96
రాజ కార్తీక్
(నేను అనగా శివుడు.)
(కార్తికేయుడు కోటప్పకొండ తిరునాళ్ళ కి రావడం, అక్కడ అపశృతి సరి చేయడం, కార్తికేయుడు రచనల గురించి విష్ణువు మొదలు నందిదాకా అందరూ తమ పరవశాన్ని చెప్పటం, కార్తికేయుడు కోసం కోటప్పకొండ మెట్లు దిగుతూ అతగాడికి నేను తారసపడటం, తనతో పాటే నేను కూడా వస్తాను అని చెప్పడం)
కార్తికేయుడు "అయితే నీ పేరు నటరాజ అన్నమాట, బాగుందిలే మంచి పేరు పెట్టుకున్నావ్,"
కైలాసంలో అందరూ నట రాజస్వామికి నటరాజ అనే పేరు అనుకుంటున్నాడు చిదంబర రహస్యం తెలిస్తే ఏమైపోతాడు ..
నేను " సంచారం చేసే నాకు నీ తోటి సరదాగా ఉండే స్నేహితుడు దొరికితే చాలా బాగుంటుందిలే,"
కా "సంచారం అంటే "
నేను "ఒకటేమిటి కాశీ నుండి రామేశ్వరం దాకా అన్ని తిరిగేసాను.. అందరికీ వెళ్లి కనపడతా ఉంటాను, నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను,"
కా "చూస్తే చిన్న వయసు వాడి వలే ఉన్నావు అప్పుడే ఎలా ఇన్ని యాత్రలు చేశావు నాయనా"
నేను "నేను ఒక విరాగి లే.. నాకేమో ఇద్దరు బిడ్డలు ఒకడేమో ఎప్పుడు నెమలితో ఆడుకుంటాడు ఒకడేమో ఎలుకలతో ఆడుకుంటాడు ఇక మా ఆవిడ అంటావా అడిగినప్పుడు అన్నం పెడుతుంది కోపం వచ్చినప్పుడు కాలి తో తొక్కుతుంది"
కా "ఓహో తమరికి పెళ్లి కూడా అయ్యిందా! "
నేను "అయ్యింది వెంటపడి మరీ మా ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంది లే, నన్ను చేసుకుంటే ఇబ్బంది పడతావని చెబుతున్నా కూడా ఇబ్బంది లేదు ఇష్టం అంటూ అంటూ వెంటపడి వేదించి సాధించి మరి పెళ్లి చేసుకుంది కార్తికేయ "
మీ పార్వతి మాత మహాదేవుడు తన కోసం తపస్సు చేసి తనని పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎంత వక్రీకరించాడో చూడండి అంటుంది సరదాగా
కార్తికేయుడు వినాయకుడు కూడా నెమలి వైపు మూషికం వైపు చూసి నవ్వుకున్నారు..
కా "అవునులే అందగాడివి నిజంగా శివుడు చూసినట్టు అనిపిస్తుంది నిన్ను చూసి ప్రేమించే ఎవరు మాత్రం చేసుకోరు నాయనా! మమ్మల్ని చేసుకునే వారు ఎవరు అని వెతుక్కుంటున్నాంలే "అన్నాడు విసుగ్గా
నేను "బాధపడకు లే ఇక మంచి చక్కని అమ్మాయితో పెళ్లి అవుతుందిలే నీ జీవితం సుఖంగా సాగుతుంది లే, సత్సంతానం పుడతారులే, చరిత్ర లికిస్తారులే"
కా "సంతోషం రాజా! శివుడి లాగానే ఉన్న నీవు ఇచ్చిన ఆశీర్వాదం సాక్షాత్తు శివుడే ఇచ్చినట్టు భావించి ఆనందపడుతున్న"
నేను "తధాస్తు"
గంటలు మ్రోగాయి
కా "ఇన్ని ప్రదేశాలు ఒక్కడివే ఎట్లా వెళ్లవ్ రాజా"
నేను "నావి రెండు ఎద్దులు ఉన్నాయి నంది బృంగి అని వాటి తో వెళుతూ ఉంటాను.. అవి ఎక్కడికైనా వెంటనే తీసుకెళ్తాయిలే.. నేనంటే భలే ఇష్టం వాటికి"
నంది బృంగి ఆనందంగా నవ్వుకుంటున్నారు
కా "తమరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఇంతకీ"
నేను " కైలాసం నుండి"
కా "ఓహో కైలాస పర్వతం నుంచి వచ్చేస్తున్నావా గట్టివాడివేలే ముసలివాడి అయిపోతే అక్కడికి వెళ్లే వాతావరణం సరిగా ఉండదని వయసు లో ఉన్నప్పుడే కైలాస పర్వతాన్ని చూసి నమస్కారం చేసుకొని వచ్చావా"
విష్ణు దేవుడు "స్వయాన్ని భగవంతుడు కళ్ళ ముందు కనపడి నిజాలు చెబుతుంటే వాటిని సరదాగా అనుకొని , మాయలో పడిన కార్తికేయను చూసి మందహాసం చేశాడు
కా "మరి ఇన్ని ప్రదేశాలు తిరగడానికి ధనం ఎక్కడి నుంచి వస్తాయి నీకు"
నేను "ధనముకు మాకు ఇబ్బంది ఏముంది సాక్షాత్తు లక్ష్మీదేవి ఏ మా జట్టు" అన్నాను నమ్మకంగా
కా "సంతోషం నీ పని బాగుగా చక్కగా ఉందన్నమాట హాయిగా ధనముకు లోటు లేదు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి పరివారం అంతా నీ చేతుల్లో ఉంది పసుపక్షాదులు సంతోషంగా నీ దగ్గర ఉన్నాయి అన్నం పెట్టే ఆలీ.., అవసరమైతే కాళీల కూడా మారుతుంది అన్నమాట"
మీ మాత తెగ నవ్వుకుంటుంది
నేను "నన్ను ఎవరేమంటారు కార్తికేయ అందరికీ నేనంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు వారితో మాట్లాడుతాను ఎప్పుడు వారికి ఏమైనా పని చెప్తానా అని ఎదురుచూస్తూ ఉంటారు సాక్షాత్తు విష్ణు దేవుడు కూడా"
కా " ఏంటి ఏమైనా నాటకం లో నా"
నేను "జగన్నాటకంలో"
కా "ఓహో జగన్ నాటకం అనే నాటకం ప్రదర్శించారా?"
చక్కగా నవ్వుకున్నాం అందరం
కా "సరే కానీ ఇంతకీ నేనేం చేస్తానో నీకు చెప్పలేదుగా. నిన్ను నాటకాలు రచిస్తూ ఉంటాను రంగస్థలం మీద నాటకాల్ని దర్శకత్వం వహిస్తూ ఉంటాను"
నేను "ఓహో తమరు రచయిత మరియు దర్శకుడు కావున మీరు అంటే మాకు మిక్కిలి అభిమానం కలిగింది కార్తికేయ"
కా "ఎన్నో నాటకాలు వేశాను కానీ నీలాగా శివుడికి సరిపోయే పాత్రధారిని ఇంతవరకు చూడలేదు రాజా! ఈసారి నా నాటకంలో శివుడిగా నువ్వే నటించాలి"
నేను "సంతోషం నేను ఇదే రూపంలో ఉందామనుకున్నా"
కా "శివుడి వేషం వేసుకొని శివుడివి అయిపోయావన్నమాట ఓయ్ ఓయ్" సరదాగా
నేను కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను
కా "నీ నవ్వుకే వచ్చిన ప్రేక్షకులు సగం ఆనంద పడిపోతారు రాజా! ఇక నువ్వు నటిస్తే తనివితీరిపోతారేమో కళారాధకులు నీ కు అంకితమైపోతారు పో. అందుకే కదా మీ చిరునామా ఇవ్వు నీతో పని ఉందని ప్రత్యేకంగా అడిగాను"
నేను "అలాగా అయితే మరొక ఆశీర్వాదం ఇస్తాను నేనే శివుడని నీవు అనుకుంటున్నావు కదా! కళా రంగంలో ఎనలేని సేవ చేసి గొప్ప రచయిత దర్శకుడు అయ్యి ముందు తరాలకి మార్గదర్శకత్వం వహిస్తూ సుస్థిరమై తరువాత శివుడను అదే నటరాజనులు చేరుగాక"
కా "ఆహా త్రికోటేశ్వరుని చూడకుండానే కడుపు నింపావు రాజా నిజంగా నీ ఆశీర్వచనం చూస్తుంటే సాక్షాత్తు శివుడే వరం ఇచ్చినట్టు ఉంది అయ్యా అంటూ చేతులెత్తి మోక్కాడు"
నేను "అయితే ని దర్శకత్వం లో నేను నటించాలని మాట,"
కా "అదే కదా"సరదాగా
కా" కానీ నీకు నేను ధనం పెద్దగా ఇచ్చుకోలేను రాజా! "
నేను "ధనము నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే నీకు ధనం ఇస్తా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండే ధనం నేనే నీకు ఇస్తాను"
కా "ఓహో అంటే నిర్మాతవి కూడా నీవే అన్నమాట"
నేను "అన్నమాట కాదు ఉన్న మాటే"
కా "బాగు బాగు కోటప్పకొండ లో మంచి శకునం"
బ్రహ్మదేవుడు వైకుంఠానికి చేరుకున్నాడు కను సైగ లో
బ్రహ్మ "పితృవర్యా విష్ణు దేవా ! మహాదేవుని వారు నాకు మూడు తల లు అని ఎందుకు అన్నారు"
విష్ణు "బ్రహ్మదేవా తమరికి తెలియంది కాదు వారు మీ గురించి చెప్తూ మూడు ముఖము లు ప్రస్తావించారు దాని అర్థం మీ నాలుగు తలలలో ఒక శిరస్సు ఎప్పుడు వేదమని ఉచ్చరిస్తూనే ఉండాలి బ్రహ్మముని గుణిస్తూనే ఉండాలి మిగతావే కార్తికేయని కళ గురించి చెబుతున్నాయని ఆయన ఉద్దేశం అర్థం అయిందా"
కా "నీకు నటన అనుభవం ఉందా? "
నేను " ఓ"
కా "అయితే ఒక పని చేద్దాం రాజా నేను వెళ్లి దర్శనం చేసుకుని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు రాగానే ఇద్దరం కలిసి పయనం చేద్దాం"
నేను "ఏమయ్యా నన్ను శివుడిలా ఉన్నావ్ అంటున్నావ్ నన్ను చూసిన సరిపోదా మళ్లీ త్రికోటేశ్వర శివలింగాన్ని చూసి రావాల్సిందేనా"
కా "బాబు రాజా ! సాక్షాత్తు శివుడి ఎదురు ఉన్న కోటప్పకొండలో త్రికోటేశ్వరుని చూడాల్సిందే అరుణాచలంలో అరుణాచలేశ్వరుని చూడాల్సిందే కాళహస్తిలో వాయులింగేశ్వరుని చూడాల్సిందే, కాశీలో విశ్వనాథుని చూడాల్సిందే.."
నేను "చాలులే ఇక 12 జ్యోతిర్లింగాలు పంచభూత లింగాలు పంచారామాలు ఇవన్నీ చెప్పకు వెళ్లి దర్శనం చేసుకుని రాపో ఇక్కడే ఉంటాను"
నన్ను చూస్తూ కార్తికేయ ..మెడలో పాము కూడా బలే కుదిరిందయ్యా నీకు..రాజా అంటూ వెళ్తూ
"ఏమన్నా తిన్నవా " అని అడిగాడు
నేను "ఓ నైవేద్యం అయిపోయింది"
కార్తికేయుడు ఇక్కడే ఉండు వెంటనే వస్తా అంటూ వెళ్లిపోయాడు
కైలాసంలో వైకుంఠంలో మిగతా దేవలోకాల్లో అందరికీ ఒకటే మాట
"ఆహా ఇక మీద ఏ పరీక్షలు లేకుండా చక్కటి ఆహ్లాదకరమైన, మంచి లీల చూడబోతున్నామని"
విష్ణు దేవుడు "అందరూ సిద్ధంగా ఉండండి మన పాత్రలు కూడా అవసరము అవుతాయి"
పార్వతీ మాత"మహా దేవుని లీలలు ఏమో కానీ, ఇప్పుడు ఈ కార్తికేయుని చేతిలో మనందరం చిక్కబోతున్నాం"
నేను ఆనందంగా నవ్వుతున్న కాలు మీద కాలు వేసుకొని .. త్రిశూలం ముందు పెట్టి.. జటాజటాలను సవరించుకుంటూ..
దూరంగా కార్తికేయని గొంతు "ఇదిగో నేను వచ్చిన వెంటనే ఈ కోటప్పకొండ స్థల పురాణం అంతా నువ్వు నాకు చెప్పాలి "
నేను "అలాగే" అన్నాను
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment