'రావమ్మా! 'శ్రీ శోభకృత్' వత్సరమా!'
-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
అనూహ్య సాంకేతికాభివృద్ధితో
దేశదేశాల మనసులు దగ్గరవుతున్నాయి..
అంతర్జాల వేదికలు
ఆమనికి నీరాజనాలర్పిస్తున్నాయి,
వివిధ దేశాల్లోని తెలుగు కోకిలలన్నీ
మధుర గానాలతో మైమరపిస్తున్నాయి..
మానీటర్ పై జాలువారిన కవితలు
మెరుపులవుతున్నాయి..
అందరి రాశులు
అద్భుతంగా వెలుగొందుతున్నాయి..
మానవజీవిత వికాసానికి
ఇంతకంటే ఇంకేం కావాలి?!
నవ శకానికి శుభస్వాగతాలు పలకడానికి!..
సర్వజనులు సంతోషంగా సమాయత్తమయ్యారు..
మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ
అల్లన మెల్లన అడుగులతో
ప్రన్నదన స్వరూపంతో
శుభ సౌఖ్య సౌభాగ్యాలు అందించేందుకు
అభయ వరప్రదాయ వత్స'రాణి' అడుగిడుతోంది..
అందరి జీవితాల్లో
పండు వెన్నెల పంచే
నిండు దీవెనల వెండి కొండలా..
ముగ్ధమోహన మనోహరిని తలపిస్తూ..
ప్రతి ఇంటి తలుపు తడుతోంది..
ఆ రూపం
నూతనోత్సాహ ప్రద్యోతన త్విషిలా..
ద్వాదశ శ్రామశుభాంగ సౌకుమార్య యోషితలా..అగుపిస్తోంది..
అరవై వత్సరాల్లో
నువ్వో తీపి గుర్తుగా..
మదిలో కొలువై ఉండేందుకు..
మది కోవెల చేసి నిరీక్షిస్తున్నాము...
రావమ్మా 'శ్రీ శోభకృత్ ' నామ వత్సరమా!!
***
No comments:
Post a Comment