సం(Some)హితోక్తులు
శెట్టిపల్లి అరుణా ప్రభాకర్
అవసరం అడగకున్నా
పరుగెత్తుకుని
వస్తుంది,
అవకాశం మాత్రం
పిలిచినా రాదు.
*
అదృష్టం కాలింగ్
బెల్ కొట్టదు,
ప్రయత్నం వెనకాల
దాక్కుని నిన్ను గమనిస్తూ ఉంటుంది.
*
ఆశయాల విత్తనాలు
వాటంతట అవే మొలకెత్తవు.
*
అపజయాల దృష్టి
లోపానికి ఆశల కళ్ల జోడు తగిలించెయ్!
*
ఒక మెత్తని
ఆప్యాయమైన స్పర్శ
కఠిన శిలయై నిరాశా
నిస్పృహల్ని ఫెళ్లున బద్దలు కొట్టగలదు.
*
శిఖరాలను కూల్చే
భూకంపాలు ఉన్నాయి గానీ
గడ్డి పోచను
పేకల్చే తుఫానులు లేవు.
*
ధైర్యం మూలన
పడేసిన నిచ్చెన లాంటిది,
కాస్త ఓపిక ఉంటే
తెచ్చిపెట్టుకుని అటక మీంచి
విజయాన్ని
దించుకోవచ్చు.
*
నువ్వు
పుట్టగానే కాలం ఒక కొవ్వొత్తిని వెలిగించి ఇస్తుంది.
*
అబద్ధాన్ని
వెలిగించడానికి అణుబాంబులు కావాలి,
నిజాన్ని
వెలిగించడానికి ఒక అగ్గి పుల్ల చాలు.
*
పోగొట్టుకున్న
చోటే వెతుక్కొనక్కర్లేనివి కొన్ని ఉంటాయి
అందులో
ముఖ్యమైనది ప్రేమ.
No comments:
Post a Comment