అసహ్యం - అచ్చంగా తెలుగు

 అసహ్యం

భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.


నీ మేడలో మూడుముళ్ళు వేసి, 

నానుండి నిన్ను దూరం చేసినందుకు 

అతనిపై నాకు కోపంరాలేదు.

నీతో ఏడడుగులు నడిచి ,

నీ భర్త అయినందుకు కూడా 

నేనతనిని ద్వేషించలేదు.

వివాహాన్ని వ్యాపారంగా మార్చి,

పెళ్లి చూపులనే సంతలో 

కట్నం,లాంచనాల బేరాలాడి,

నిన్ను వెర్రిదాన్ని చేసిమరీ 

నీపై అధికారాన్ని సంపాదించుకొని, 

ఆ భావంతో అతడు జీవిస్తున్నందుకే 

నాకు అతడంటే అసహ్యం కలిగింది.

 ***

No comments:

Post a Comment

Pages