మానసవీణ - 43
అరుణ చామర్తి ముటుకూరి
మానస మనసు మధురోహల్లో తేలుతోంది. ఇన్నాళ్లు పడ్డ బాధకు దేవుడు
ఒక్కసారిగా వరాలు ఇచ్చినట్టుగా అమ్మ, నాన్న,
తాతయ్య, జీవితాంతం తోడు ఉండే మనిషి అందరూ నా
చెంత చేరారు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. ఆలోచనలతో పాటు ఎక్కడో ఏదో
అనీజినెస్ కూడా మానసని ఇబ్బంది పెడుతుంది. అంతా సవ్యంగా సాగిపోతుంటే ఎందుకే
అనీజినెస్... తనలో తనే అనుకోసాగింది.
ఈ
హడావిడిలో పట్టించుకోలేదు కానీ 'అక్క అక్కా'
అంటూ వచ్చే దేవుడిచ్చిన చెల్లి సందేహాలంటూ రావడం లేదేంటి??
ఆయాని అడిగింది "సమీర ఏది ఆయా??"
అని.
"సమీరా... అన్నట్లు నీ కోసమే కదా బయటికి
వెళ్ళింది, నువ్వు లైబ్రరీ దగ్గర ఉన్నావని, తీసుకురమ్మన్నావని ఎవరో అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు" విషయం అర్థమైన
మానస అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందోనని "అవును మర్చిపోయాను, తను కాసేపు ఉండి వస్తానంది లే.." అంటూ సర్దేసింది.
"ఓహో " అని ఆయా వెళ్ళిపోగానే...
పక్కకు వెళ్లి అనిరుధ్ కి ఫోన్ చేసింది.
"ఏంటి బుట్ట బొమ్మ ఇప్పుడేగా దింపాను
అప్పుడే మళ్ళీ నన్ను చూడాలనిపించిందా మాట్లాడాలనిపించిందా..??"
"అవును మరి "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే
ఉన్నట్టుంటుంది ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ
ఉంది ఇదేం గారడీ" అనిరుధ్ అల్లరికి తన స్టైల్ లో తను సమాధానం చెప్పింది మానస.
"హమ్మయ్యా! టెన్షన్ తగ్గిందా? ఇప్పుడు చెప్పు , అసలు విషయం. ఎందుకు చేసావ్?"
"ఓహో అంటే నా టెన్షన్ గుర్తించి తమరు
కావాలనే నన్ను కూల్ చేయడానికి ఇలా చేశారా?"
"అవును బేబీ."
"మై గాడ్ మాటలే రానట్టు ఉండే నువ్వు మాటల
గారడీలో మత్తులో ముంచేస్తున్నవ్ ముత్యాల్లా రాలిపోతున్నాయి నీ మాటలు..."
"థాంక్ యు థాంక్ యు డియర్, ఇంతకీ విషయం చెప్పు."
"అదే సమీర ఉంది కదా! తనని ఎవరో నా పేరు
చెప్పి లైబ్రరీకి రమ్మన్నారని తీసుకువెళ్లారట."
"కంగారు పడకు, తనో
పుస్తకాల పురుగు కదా. చదువుతూనో, పుస్తకం వెతుకుతూనో
లైబ్రరీలో
ఏమూలో ఉండిపోతే, లాక్డౌన్
టైముకి లాక్ చేసుకుని వెళ్ళిపోయుంటారు. ముందు తన సెల్ కి రింగ్ చెయ్ తెలుస్తుంది
కదా."
"నిజమే నా మతి మండా నీ మాటల్లో పడి అసలు
ఫోనే చేయలేదు చూశావా?"
నిజానికి అనిరుధ్ కీ కంగారుగానే ఉంది. మానస కంగారు గుర్తించి
అలా మాట్లాడాడు. కానీ, వరుసగా జరుగుతున్న
సంఘటనలు అతనికా కంగారు కలిగించాయి.
ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది మానస నుండి.
"అనిరుధ్, సమీర
తెలివిగా నాకు మెసేజ్ పెట్టింది రమేషే తనను కిడ్నాప్ చేయించి తీసుకెళ్లాడట.
తప్పించుకునే ప్రయత్నం చేస్తాను" అని పెట్టింది.
"నేను వచ్చేస్తున్నాను ఉండు" అంటూ
బయలుదేరి వచ్చేసాడు. "నీ ఫోన్ లో లొకేషన్ ఆన్ చేసి, రా
నాతో. బయల్దేరుదాం" చకచకా చెప్పాడు అనిరుధ్.
ఇద్దరూ కలిసి, వెతికే
ప్రయత్నంలో ఒక నాలుగు రోడ్ల కూడలి దగ్గర, బహుశా వాళ్లకి
ఇవ్వడానికి ఏమో మానస సమీరా పుట్టినరోజుకి కొనిచ్చిన కీ చైన్ ని పడేసింది. ఆ
దారిలోనే ముందుకు కొనసాగుతుండగా వాళ్ళ ముందు వేగంగా ఒక పోలీస్ వ్యాన్ వెళ్లడం
గమనించారు. వాళ్ల దగ్గరగా వెళ్లి, వాళ్లకు విషయం చెబుదాం
అనుకుంటుండగా వాళ్లు మరోదారి లో మలుపు తిరిగి కనిపించలేదు. అయ్యో అనుకుంటూ తిరిగి
వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
***
ఇక సమీర విషయానికి వస్తే సమీర కి కూడా పరిస్థితులు నేర్పిన
ధైర్యం ఎక్కువే. మానస ఎప్పుడూ అలా పిలవదని గ్రహించి, తన పర్సులో పెప్పర్ స్ప్రే పెట్టుకునే వచ్చింది. ఆ జీప్ వేగంగా
వెళుతున్నపుడు, ఒక ఇంటి మల్లె చెట్టు నుండి మల్లె పూల వాసన
గుప్పుమని రావడంతో సమీర కి ఒక ఆలోచన వచ్చింది.
వాళ్ల అనుకున్న ప్లేస్ కి రాగానే, రమేష్
వెనక్కి తిరిగి చూసి,
"వెధవలు తాగి పడిపోయారు" అని విసుక్కుంటూ... కిందికి
దిగాడు.
కానీ వాళ్లంతట వాళ్లు పడిపోలేదు, తాగిన మత్తులో వాగుతున్నారు ఏదో అనుకున్నాడు కానీ, అది
చూసి సమీర కళ్లలో కొట్టిన పెప్పర్ స్ప్రే వల్ల అని తెలుసుకోలేకపోయాడు.
"రా దిగు" అంటూ సమీర ని పట్టుకు
లాగాడు.
"అయ్యో రమేష్ ముట్టుకోకు నన్ను. కరోనా
పాజిటివ్ అని కన్ఫర్మ్ ఐ మూడు రోజులు అవుతుంది." సమీర మాటలకి బెదిరినట్టుగా
"కరోనానా?" అని గొణుక్కుంటూ చెయ్యొదిలేశాడు.
"మరి ట్రీట్మెంట్? " సన్నగా తనలో తను అనుకున్నాడు.
"అనాధని కదా నాకోసం ఎవరు ట్రీట్మెంట్
చేయిస్తారు?"
"నేను చెప్పినట్లుగా మానస మనసు నా వైపు
తిప్పి ఉంటే నీకు ట్రీట్మెంట్ నేను చేయించే వాడిని."
"నేను ప్రయత్నం చేశాను రమేష్, నేనేం చేయను, సిఫార్సులతో ప్రేమలు పుడతాయా?"
అని కొట్టిపారేసింది" సమయానికి గుర్తు వచ్చిన ముత్యాల ముగ్గు
డైలాగు వాడేసింది.
"ఛీ పో" అంటూ
ఒక్క తోపు తోశాడు.
ఆ తోపుకి కింద పడి తల పగిలేదే సమీర కి ఎవరో స్త్రీమూర్తి
పట్టుకోక పోయి ఉంటే. రమేష్ చెంప చెళ్ళు మంది.
మత్తు వదిలి చూస్తే రమేష్ వాళ్ళ అమ్మ వేదవతి.
"అమ్మా!"
"ఛీ, నీకా అర్హత ఉందా?
అల్లరి చిల్లరిగా తిరుగుతున్నప్పుడు మీ నాన్నను చూసి
చెడిపోయావనుకున్నాను. మానస వల్ల మంచివాడివైతే సంతోషపడ్డాను. ఆ అమ్మాయి ఎవరో తెలియక
పోయినా పేపర్లలో సన్మానం అని చూసినప్పుడు తన ఎలాంటిదో అర్థం చేసుకున్నాను. అయినా
మీ నాన్న మొదటినుండి చెడ్డవాడేం కాదు. తన ఉద్యోగంలో ఇబ్బంది వల్ల ఇంట్లో ఉండవలసి
వచ్చింది రెండు సంవత్సరాలు. అప్పుడు ఎమ్మెస్సీ చేసిన నేను లెక్చరర్‌గా పని చేశాను.
నీకు ఇంకా ఊహ కూడా సరిగా రాలేదు. ఆ సమయంలో మేల్ ఇగో ఆయనలో తొంగి చూసింది. ఆ తర్వాత
డోర్నకల్‌లో వసారాలో ఉన్న చెల్లెల్ని ఆడిస్తూ, అడుక్కు తినే
వాడు వస్తే బిచ్చం వేయడానికి లోపలికి వెళ్లి, వచ్చేలోగా
చెల్లెల్ని వాడు ఎత్తుకుపోవడం. ఈ సంఘటన మీ నాన్నని బాగా కుంగదీసింది. అప్పట్నుంచే
నామీద కోపం ఎక్కువైంది. నిజానికి నేను పక్కన గోడ మీద నుండి చెల్లెల్ని
ఆడిస్తున్న నర్స్ ని చూసుకోమని చెప్పి వెళ్ళాను. పేషెంట్ వచ్చాడని
డాక్టర్ పిలవడంతో అమ్మాయి వెళ్ళిపోయింది. ఆరోజుల్లో సెల్‌ఫోన్ లేక జరిగిన విషయం మీ
నాన్నకి వెంటనే చెప్పలేకపోయాను. అప్పటికీ దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది అలాగే
పారిపోయి ఉంటాడు అన్న పక్క వారి మాటలు విని స్టేషన్ కి వెళ్లి కూడా చూశాను. రెండు
ట్రైన్ లు అప్పుడే వెళ్లిపోవడం, ఎక్కడ ఆగుతాయో అక్కడంతా సీసీ
కెమెరాలు చూడడం జరిగింది. ఆ బిచ్చగాడు డోర్నకల్ లో రైలెక్కి న మాట నిజమే కానీ,
ఖమ్మం లో రైలు దిగినప్పుడు వాడి చేతిలో పిల్ల లేదు. ఆ రోజు నుంచి నా
కడుపుకోత ఎవరికి చెప్పుకోను. ఒక్కగానొక్క వాడివి
ఉన్నావని నాన్న చేసిన గారం చెడగొట్టింది నిన్ను. నా కడుపున
చెడబుట్టావ్" అన్ని మాటలు అమ్మ మాట్లాడడం, అంత ఆవేశంగా
మాట్లాడటం, ఎప్పుడూ చూడని, వినని రమేష్
తెల్లబోతూ చూస్తున్నాడు.
ఇంతలో పోలీస్ సైరన్ తో వెనక వ్యాన్
రావడం గమనించారు.
"థాంక్యూ సార్ సమయానికి వచ్చారు. బహుశా
ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే" అని రమేష్ ని పరికించి చూస్తూ పోలీసులకి
ధంసప్ లాగా వేలు చూపించింది.
సరేనని వాళ్ళు వెళ్ళిపోయారు.
"వీళ్ళు ఎలా వచ్చారు? "
"వచ్చే దారిలో నేనే పోలీస్ హెల్ప్ లైన్ కి
కనెక్ట్ చేశాను."
"భేష్ సమీరా ,వెరీగుడ్"
చప్పట్లు కొడుతూ వెనక గా వచ్చారు మానస, అనిరుధ్.
అప్పటికి తేరుకున్న రమేష్ "అమ్మా,
అసలు నువ్వు ఎలా వచ్చావ్?"
"నువ్వే ఒకసారి అమ్మ నెంబర్ ఇచ్చావు కదా,
నీ ఫోన్ పాడైపోతే... నేనే చేశాను" మానస చెప్పింది.
"అక్కా" అంటూ ఒక్కసారిగా మానసని హగ్
చేసుకుని, రమేష్ వైపు చూస్తూ,"అది
మానసక్కంటే, నీ ప్లాన్ ఫెయిల్" బొటన వేలిని తలకిందులుగా
పెట్టి వెక్కిరించింది.
అది చూసిన వేదవతి గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి,
"ఏమనుకోకు అమ్మా" అంటూ గబగబా సమీర వెనక్కి వచ్చి, కుడివైపు డ్రెస్సు కొద్దిగా జరిపి గూడ దగ్గర ఉన్న పచ్చబొట్టును చూశారు.
వెంటనే ఆవిడ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్ పోయింది.
"రమేష్ రమేష్ అప్పుడెప్పుడో తప్పిపోయిన నీ
చెల్లి రా, సమీర."
"అమ్మా ఏమంటున్నావ్?"
"అవును, తన బొటన వేలు
మీద నక్షత్ర ఆకారంలో పుట్టుమచ్చ ఉంది చూడు. అది చూసి నాకు అనుమానం వచ్చింది.
అమ్మమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మమ్మ చాదస్తంతో...
దేవుడు అడుగుతాడు అంటూ పచ్చబొట్టు వేయించింది వీపుమీద. ఇదే నక్షత్రాకార పుట్టుమచ్చ
లా. అదే వెతికాను తను నా కూతురే."
"ఆ... అంటే మానసక్కలా నాకు కూడా ఒక కుటుంబం
దొరికిందా" ఆనందంతో పొంగిపోయింది సమీర.
"నన్ను క్షమించమ్మా!" రమేష్ కళ్లల్లో
నీళ్లు.
"అంటే తోడబుట్టినదంటేనే, తెలిసిందా నీ తప్పు..." ఉడికించింది మానస.
"లేదు, మార్పు తీసుకు
వస్తే పెళ్లే చేసుకోవాలా, స్నేహితురాలి గానో, చెల్లెలి
గానో చూస్తే, వాళ్ళ సలహాలు పని చేయవా? అసలు నిజం చెప్పాలంటే తన మీద నీకు ఉన్న గౌరవం నిలబడాలి అంటే... తనని
ఎప్పటికి స్నేహితురాలు గానే చూడు" అని అమ్మ పొద్దున్నే బాగా కోప్పడింది. నేను
స్నేహితులతో ఈ ప్రదేశానికి సమీర ని తీసుకురావాలన్న ప్లాన్ చెప్పినప్పుడు. ఈరోజు
నుండి నువ్వు కూడా నాకు చెల్లెలివే..." మనస్ఫూర్తిగా చెప్పాడు మానసకి.
"కంగ్రాట్స్ బావగారు" చెవిలో సన్నగా
చెప్పాడు అనిరుధ్ కి.
"అమ్మాయిలు నీలా ధైర్యంగా ఉండాలి. కరోనా కి
నేను వైద్యం చేయిస్తాను పద." సమీర తో ఆప్యాయంగా చెప్పాడు రమేష్.
"గాడిద గుడ్డేం కాదన్నయ్య. ఆ పేరు వింటే
ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు వణికిపోతున్నారు అని.. వచ్చే దారిలో మల్లెపూల వాసన
మీ మందు వాసన నాకు ఐడియా ఇచ్చేయ్."
"ఓసి గడుగ్గాయి.." అంటూ తల నిమిరి
దగ్గరకు తీసుకుని "పదపద మీ నాన్నగారు ఎదురుచూస్తుంటారు... నువ్వు దొరికేవంటే
ఎంత సంతోషిస్తారో" అని వేదవతి గారు
అన్నారు.
*****
ఇక్కడికీ పర్వం ముగిసింది. కానీ, మన హీరో హీరోయిన్ల ప్రేమని తల్లిదండ్రుల అంగీకరిస్తారా... ఇదే హీరో మనసులో
ఆలోచన.
కానీ
ఇక్కడికి వచ్చే ముందు ఇద్దరూ మాట్లాడుకోవడం విన్న gtr గారు, వారి భార్య
మధ్య సంభాషణ, ఎవరికీ తెలియదు.
అది విన్న gtr గారు భార్య
వైపు సాలోచనగా చూశారు.
"లోపలికి పద" అన్న కనుసైగతో, ఆవిడ లోపలికి నడిచింది.
"వీడిని చూస్తే పీకల్లోతు ప్రేమలో పడ్డట్టు
ఉంది. మొదట్లో ఏమో కానీ ఇప్పుడు అమ్మాయి కూడా అంగీకారం చెప్పినట్టు ఉంది." gtr
గారు గంభీరంగా అన్నారు.
"అయితే ఏమిటంటారు, మీకు
గుర్తుందో లేదో.. చిన్నప్పుడు మానస చురుకుదనం చూసి
మీరే దత్తు తీసుకుందాం అనుకున్నారు. బహుశా ఆ అమ్మాయి కూతురిగా
కాకుండా కోడలిగా అడుగు పెట్టాలనే ఆ రోజు అలా చేయలేదేమో..."
"అంటే ,అంటే నీకేం
అభ్యంతరం లేదా?"
"నాకు ఏ అభ్యంతరమూ లేదు."
"అమ్మయ్య, ఇలాంటి
విషయాల్లో సాధారణంగా ఆడవాళ్లే అభ్యంతర పెడతారని మధన పడ్డా ఇన్నాళ్ళు. తను చేసే
సాహసాలు చూసి, ఏ ప్రమాదానికీ లోనుకాకుండా ఉండాలని రక్షణగా
మనుషులను కూడా పెట్టాను."
"ఎంత గడుసు వారండి మీరు? ఈ మాట నా నోట చెప్పించాలనా ఇంత నాటకం. ఈ విషయం లో హీరో జగపతిబాబు గారే
నాకు ఆదర్శం. బంధువులు ఏమన్నా కూతురి అభీష్టం ముఖ్యం అనుకున్నాడు."
"అయినా నీకు మరో విషయం చెప్పాలి నిన్ననే
ఊర్లోకి వచ్చి రాలేదేమని కృషిని అడిగితే,
ఆ త్రాష్టుడు భూషణం చేసిన పని చెప్పి,
వరలక్ష్మీ వ్రతం లో నీకు పరిచయం అయింది అన్నావే శ్రావణి, ఆమె కూతురే మానస అని, కలపడానికే వచ్చానని చెప్పాడు.
ఈ పిల్ల కనబడకపోవడం తో పాపం శ్రావణి ఆ
తర్వాత కొద్ది రోజులకి పిచ్చిదవడంతో నీ ఫోన్ కి రెస్పాన్స్ ఇవ్వలేకపోయిందని అర్థం
చేసుకున్నాను."
"ఓహో హో చాలా జరిగేయే" నవ్వుకున్నారు
ఇద్దరు.
అంతా మనం అనుకున్నట్టే జరిగితే ఇక విధిలీల ఏముంది?
అవతల మానస ప్రాణం కోసం అప్పలనాయుడు కాచుకుని ఎదురు
చూస్తున్నాడు మరి.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment