- అచ్చంగా తెలుగు

                                                                 నారాయణుడు


పెయ్యేటి రంగారావు




ధన్యము ధన్యము -  జన్మ ధన్యము
అష్టాక్షరితో -  అన్నియు సాధ్యము ||

నారాయణుడే - నను గాచునయా
చింతలు వంతలు - నాకేలనయా? 
ఒక పరి తలచిన - అదియే చాలును
అక్షుల ముందర - అగపడి తీరును || 

కమలనాభుడే - గతి  యంటినయా 
విమలముగా నిక - నను బ్రోచునయా
భవ బంధమ్ముల - తొలగించునయా
ఇహ పర సాధన - చేయించునయా||

శ్రీహరినే మది - శరణంటినయా
ముక్తి సిరిని ఇక - ఇడ బోవునయా
కోరిక లన్నవి - తొలగించెనయా
అహమే నాలో - తొలగించునయా||

నీలోత్పల శ్రీ - శ్యాముని కొలిచితి
శాంతాకారుని - వదలక దలచితి
భవబంధమ్ముల - తొలగించెనయా
విషయ వాంఛలను - పోద్రోలెనయా||

చక్రధారినే మది - ధ్యానింతునయా
సక్రమ మార్గము - తోపించెనయా
నారాయణ యని -  జపియింతునయా
జన్మరహితమని - దీవించెనయా||
 ***

No comments:

Post a Comment

Pages