శ్రీధరమాధురి - 109 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 109

Share This

 శ్రీధరమాధురి - 109

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


వైరాగ్యం లేదా నిర్లిప్తత అనేది ఒక సంపూర్ణ జీవితాన్ని జీవించిన తర్వాతే రావాలి.‌ లౌకిక జీవితంలో విరక్తితోనో లేక నిరంతర హింస వల్లనో వైరాగ్యం కలిగితే అది కేవలం నటన మాత్రమే. అటువంటి వారి మనస్సులో అనేక దుష్ట ఆలోచనలు ఉంటాయి, వారు మోసకారులుగా ఉంటారు. లౌకిక జీవనంలో విఫలమవ్వడం వల్ల చాలామంది మతం వైపు మళ్లడాన్ని నేను చూశాను. అలా జరిగింది కనుక వారు మతాన్ని ఒక ఆయుధంగా వాడి ఇతరులను మోసపుచ్చుతారు. వైరాగ్యం అలా రాదు, మనం అటువంటి వారిని నమ్మలేము.
 
***

అతను ఇంటి వద్ద గొప్పలు కొడుతున్నాడు, 'ఈరోజు నుంచి నేను ఉల్లిపాయ తినను.'

 
అది చాలా మంచిది. అతని నిర్ణయం వల్ల, మార్కెట్లో ఉల్లిపాయ ధర తగ్గుతుందని ఆశిద్దాం. పేదవారి దైనందిన జీవితంలో అది చాలా అవసరమైన కూరగాయ...

అయినా ఉల్లిపాయ అతన్ని వదలదు.

మన ప్రకృతిమాత ఎంత తీయనిదంటే, నీవు దేనినైనా ఎంత వద్దనుకుంటే, నీవు పెట్టుకున్న ఆ నియమాన్ని అనేకమార్లు తప్పేలా చేస్తుంది.
 
నీవు ఇంటి నుంచి బయటికి వెళ్ళాక, దగ్గర్లో రోడ్డు మీదున్న టీ దుకాణంలో, వేడివేడి ఉల్లిపాయ సమోసా చేస్తూ ఉంటారు, ఆ వాసన నీ ముక్కులోకి ప్రవేశిస్తుంది. నోటితో ఏదైతే తిననని నీవు అంటావో, ఇది ముక్కు ద్వారా నీలోకి ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిని నీవు ఎలా తప్పించుకోగలవు?
 
నీవు ఉల్లిపాయ వద్దన్నారు కాబట్టి, ఇంట్లోని ఇతర సభ్యులు దాన్ని తీసుకోవడాన్ని ఆపరు. అంతదాకా ఎందుకు, ఈసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు, నేను నీ భార్యను ఉల్లిపాయ బజ్జి చెయ్యమని అడిగి మరీ చేయించుకుని, నీ ముందే తింటాను. నీ సొంత వంటిల్లు నుంచి ఉల్లిపాయ వాసన నీ వ్యవస్థలోకి ప్రవేశించకుండా నువ్వు ఎలా ఆపుతావో చూస్తాను. నేను ఉల్లిపాయలు ఉంటాను కనుక నీవు దీనిని తప్పించుకోగలవా?

ఇలా అందరూ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతారు. పెద్ద పెద్ద ప్రబోధాలు చేస్తారు. నీవు తినట్లేదు కనుక అది మీ వ్యవస్థలోకి ప్రవేశించకుండా ఉండదు. 

ప్రకృతి మాత ఎంత శక్తివంతమైనదంటే, ఆమెకు మీ అహంకారం యొక్క వెన్ను విరచడం బాగా తెలుసు. ఎప్పుడు, ఎలా మిమ్మల్ని బేషరతైన శరణాగతి వేడేలా వంగదియ్యాలో ఆమెకు బాగా తెలుసు.
 
మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రపంచం సంపూర్ణమైనది. అది నిశ్చయమైనది కాదు. ఒకసారి నిశ్చితంగా మారితే, అది చనిపోతుంది. సరి చేసుకోవడానికి ఏమీ ఉండదు.
   
సంపూర్ణంగా ఉన్నంతవరకు ఈ ప్రపంచం సజీవంగా, ప్రేమమయంగా ఉంటుంది. సంపూర్ణతే ఆనందంగా జీవించడానికి చాలా ముఖ్యమైనది. నిశ్చితంగా ఉండడం అన్నది బానిసత్వం. నిశ్చితత్వంలో స్వేచ్ఛ ఉండదు.
 
మూర్ఖంగా మనలో చాలామంది ఆచరించే లేని వాటిని అవలంబిస్తూ, అదే మోక్షానికి మార్గమని అనుకుంటారు. ఆత్మసాక్షాత్కారం పొందడానికి అన్నిటికంటే ముందుగా ఉత్తమమైన మార్గం, ప్రకృతి యొక్క సంకల్పానికి సంపూర్ణంగా శరణాగతి వేడడమేనని గుర్తించరు. 
 
ఎవరో పాల ఉత్పత్తులను స్వీకరించమని అన్నారు. నీవు ఉల్లిపాయలు తిననని అంటున్నావు. మరొకామె 'బ్రకోలీ' తినను అంటుంది. దీనివల్ల స్వర్గమేమీ ఇలకు జారదనుకోండి.

మీకు ఏదైనా చేయాలని ఉంటే చెయ్యండి, కానీ ఇతర కుటుంబ సభ్యుల ముందు బిగ్గరగా టముకేయకండి. కుటుంబంలో ఉన్న ఇతరులు దానిని తినవచ్చు, లేదా తినడానికి ఇష్టపడుతుండవచ్చు. మీ మాటల ద్వారా మీ కుటుంబ సభ్యల లేక ఇతరుల భావాలను దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఇతరుల ముందు మీరటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, వారు ఉల్లిపాయ తింటున్నారు కనుక, వారి గురించి వారు తక్కువగా భావించుకునే అవకాశం ఉంది. అందుకే పరిణితి కలిగి ఉండండి. 

నీకు ఇప్పటికే వయసు వచ్చింది. ఆచరించలేని సూత్రాలు, నీతులతో నిన్ను నీవు బంధించు కోకు. నీకు అవన్నీ అక్కర్లేదు. నిజానికి ఈ మధ్యనే నీవు మరణానికి అడుగు దూరంలో ఉండి, అదృష్టవశాత్తూ బాగుపడి, బయటపడ్డావు.

ఇదంతా నీ గొప్పతనం కాదు, నీ చుట్టూ ఉన్నవారి ప్రార్ధనల ఫలితం. డాక్టర్లు, నర్సులు, అటెండెంట్ లు వంటి అనేక మంది ఉల్లిపాయ తినే వారు, ఇంకా ఎంతోమంది వల్ల ఇది సాధ్యం అయింది. వారే నీకు చికిత్స చేశారు. నీకు స్టెరాయిడ్లు, యాంటీబయటిక్ లు ఎక్కించారు. వాటిలో ఏమేమి ఉంటాయో భగవంతుడికి ఎరుక! పంది కాలేయం నుంచి తీసిన ఎంజైమ్లు, లేక గొర్రె క్రొవ్వు, కావచ్చు. ఎవరికీ తెలీదు! ఇవన్నీ ముందే నీ వ్యవస్థలో చేరిపోయాయి. నిజానికి ఇవే నిన్ను కాపాడాయి.
 
వేదాలు 'అన్నం న నిందయేత్... ప్రణోవా అన్నం' అంటాయి.

అన్నం గురించి తప్పుగా మాట్లాడకండి. దాన్ని నిరాదరించకండి. దానిలో జీవం ఉంది. అదే మిమ్మల్ని బ్రతికిస్తోంది. కాబట్టి మీరు తిన్నా, తినకపోయినా ఏ విధమైన ఆహారం గురించైనా తప్పుగా మాట్లాడకండి.
 
మీకు సమున్నతమైన విలువలు, నీతులు సిద్ధాంతాలు, ఉండవచ్చు. నేను చాలా సాధారణమైన, మామూలు, ఒదిగి ఉండే వ్యక్తిని. ఆహారాన్ని నిషేధించే ఇటువంటి ఉద్యమాలు నేను చేయలేను. ఎందుకంటే నాకు వేదాలే ప్రాథమిక మార్గదర్శకాలు.
 
'అన్నం ప్రాణమయం బ్రహ్మ'

***

No comments:

Post a Comment

Pages