ఆయాంతి - అచ్చంగా తెలుగు

 ఆయాంతి 

                                                               (సూపర్ వుమెన్)                                                                                               

మాళవిక ఒబ్బట్టు 


ఒక వర్షాకాలం సాయంత్రం అయాంతి ఏదో ఫైల్స్ చదువుతుంటే ఆమె కూతురు పూజ వచ్చి తన స్నేహితురాలి బర్త్ డే పార్టీకి వెళ్తున్నానని, లేట్ అవుతుందని చెప్పి బయలుదేరబోతోంది.
అయాంతి: తప్పకుండా, కానీ ఒక విషయం.
నీ ఒళ్ళు తో పాటు డ్రెస్ కూడా కనిపించేలాంటి డ్రెస్ వేసు.కో అలాగే నీ జుట్టు తో పాటు మొహం కూడా కనిపించేలా హెయిర్ స్టైల్ చేసుకో. ఆలా చెప్పి ఆయాంతి పూజ రూమ్ లో కి వెళ్లి ఒక డ్రెస్, ఇంకా పూజ ఈజీ గ చేసుకోగల హెయిర్ స్టైల్ చూపించి వెళ్ళిపోతుంది.
పూజ: మామ్, నువ్వు చాలా ఓల్డ్ ఫ్యాషనేడ్. ఇది ఇప్పటి ట్రెండ్. నేను  ఇలానే వెళ్తాను. నాన్న,  కనీసం నువ్వైనా అమ్మకి చెప్పు. ప్లీజ్.
అలోక్ (అయాంతి భర్త): నవ్వుతూ.. పూజ నువ్వు మీ అమ్మ చెప్పినట్టు చేయి. she is never wrong. ఆ విషయం నీకు నీ పార్టీ లో తెలుస్తుంది  

పూజ తన గదిలోకి వెళ్లి అమ్మ చెప్పినట్లు రెడీ అయి చాలా చిరాకుతో పార్టీకి వెళ్తుంది.

ఆమె లుక్ అందరికీ నచ్చడంతో అందరూ ఆమెను మెచ్చుకున్నారు. ఇంటికి తిరుగు ప్రయాణంలో పార్టీకి వెళ్ళే ముందు జరిగిన చర్చ గురించి ఆమె ఆలోచిస్తూనే ఉంది.
ఇంటికి రాగానే హాల్ లో నాన్న ని చూసి జరిగింది మొత్తం చెపుతుంది.
పూజ: నాన్నా నువ్వు చెప్పింది నిజమే. పార్టీలో అందరూ నా లుక్స్ గురించి మెచ్చుకున్నారు. అమ్మ అంత బాగా ఎలా judge చేయగలిగింది??
అలోక్ (నవ్వుతూ): మీ అమ్మ జీనియస్. ఎవరూ ఊహించని విధంగా ఆమె ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేస్తుంది.
మరుసటి రోజు పూజ కాలేజ్ కి వెళ్ళబోతుండగా ఓ మ్యాగజైన్ లో తన తల్లి ఫోటో చూస్తుంది. ఈ పత్రిక శీర్షిక, అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. పూజ ఆ లిస్ట్ చూసి తన అమ్మ ఫస్ట్ ప్లేస్ లో ఉందని తెలుసుకుంటుంది.
అలోక్ (వెనుక నుంచి వచ్చాడు): చూసావా.. నేను  చెప్పాను కదా.. మీ అమ్మ జీనియస్ అని. ఆశ్చర్యం తో పాటు అర్ధం కానీ చూపులు చూస్తున్న పూజ తో అలోక్ ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
నీ చిన్నప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్ళాం అక్కడ ఎన్నో రకాల గేమ్స్ వున్నాయి. ఒక గేమ్ లో నేను వున్న మనీ అంతా పోగొట్టుకున్నాను. అయినా కూడా ఇంకా ఆడుతూనే వున్నాను. ఇది గమనించిన మీ అమ్మ నిన్ను డ్రైవర్ కి ఇచ్చి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దింపి రమ్మని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికి మొత్తం అయిపోయింది.
ఆ సమయంలో నేను ఎదుర్కొన్న డిప్రెషన్ ను మాటల్లో వర్ణించలేం. ఆ కష్టకాలంలో మీ అమ్మ నాకు తోడుగా నిలిచింది. ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ప్రతిదాన్ని మళ్లీ నిర్మించడానికి ఆమె నన్ను ప్రోత్సహించింది.
గుర్రపు స్వారీలో నా ప్రతిభను గుర్తు చేసింది మీ అమ్మ. గుర్రపు పందేలు నిర్వహించే పర్నాతో మాట్లాడేలా చేసింది. పర్నా నన్ను పరీక్షించి తన బృందంలోకి అనుమతించారు. నేను మన తిండి కి మాత్రమే సరిపోయేంత సంపాదిస్తూ వున్నాను అది చాలదు మనం ఎదగాలి అని ఆలోచన కల్పించింది మీ అమ్మే. తనే రాబోయే ప్రపంచ పోటీల్లో నేను పార్టిసిపేట్ చేయాలని చెప్పింది. అదే విషయం నేను పర్ణ తో మాట్లాడితే తను kark మీద interested  గా వున్నానని చెప్పాడు. అప్పుడు మళ్ళీ మీ అమ్మ మా ఇద్దరికీ కాంపిటీషన్ పెట్టండి గెలిచిన వాళ్ళని ఫైనల్స్ కి పంపండి అని ఐడియా ఇచ్చింది. ఆ కాంపిటీషన్ లో నేను గెలిచాను.
rest is history.
రేసింగ్ లో నా రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేదు, మీ అమ్మ, నేను కలిసి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని సొంతంగా నిర్మించుకున్నాం. ఆమె నిర్ణయాలు, దూరదృష్టి లేకపోతే నేను బతికి ఉండేవాడిని కాదు.
ఇదంతా విన్న పూజ చాలా ఎమోషనల్ అయ్యింది. అమ్మ దగ్గరకు వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది.
ఆ రోజు రాత్రి అయాంతి తన కూతురి గదిలోకి ప్రవేశించగానే పడక గోడపై ఒక Quote కనిపించింది ...
“Ayanti…. The superwoman…. My mom”.
ఆయాంతి ఆనందం తో కళ్ళు తుడుచుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది.

***

No comments:

Post a Comment

Pages