శివం -99
రాజ కార్తీక్
(కార్తికేయుడు కోటప్ప కొండ లో దర్శనం కోసం లోపలి కి వెళ్ళాక ..బయట ఉన్న నా కోసం విష్ణు దేవుడూ పార్వతీ మాత.. బ్రహ్మ.. దేవులు , లక్ష్మి మాత.. గాజన కుమారు లు నంది బ్రుంగి లు రావటం ..తిరిగి కార్తికేయుడు నా కొసం వస్తు ఉండ గా అందరూ దాక్కోవటం.. కార్తికేయుడు తెచ్చిన ప్రసాదాన్ని ఇద్దరం కలిసి తినడం.)
( నేను అంటే శివుడు)
అలా కార్తికేయుడ్ని సరదాగా ఆటపెట్టిస్తూ దీవిస్తూ.. ఆడిస్తూ. ఇద్దరము భోజనం ముగించాము..
కా " బాబు రాజా మంచి భార్య రావాలని ఆశీర్వదించావు బాగానే ఉంది.. మీ ఆవిడ కూడా మంచిదే అన్నావ్.. వెతికి వెతికి మరి అన్నం పెడుతుంది అన్నావ్ కోపం వస్తే గుండెల మీద కాలు పెట్టింది అన్నావ్ నాకు మాత్రం వెతికి వెతికి పెట్టకపోయినా సరే అడిగినప్పుడు అన్నం పెడితే చాలయ్య.. గుండెల మీద కాలు పెట్టే భార్య మాత్రం నాకు వద్దయ్యా నేను భరించలేను"
నేను " అలా అంటే ఎలా .. ప్రకృతి వికృతి.. ప్రేమ కోపం.. చల్లతనం వేడితనం.. అన్ని ఉండాలయ్య"
కా " ఏమోన్నయ్య నువ్వంటే మామూలు వాడివి కాదు అందుకే మీ ఆవిడ గుండెల మీద కాలు పెట్టిన.. వెతికి అన్నం పెట్టినా చెల్లు.. నేనేదో మామూలు వాడినయ్యా.. ఏదో ప్రేమ కి లొంగీ పోతాను గాని, అంత కోపం తెప్పించే పనులు నేనేం చేయనులే అయ్యా.. అసలే ఇప్పటివరకు ఏ బంధాలు నన్ను పెద్దగా అభిమానించలేదు ప్రేమoచలేదు.... అందుకే అనకువ గల భార్య రావాలని భగవంతుని ఆ భగవంతుడు రూపంలో ఉన్న నిన్ను కోరుకుంటున్న.. ఏదో ఉత్సవం రోజు కంటికి కనపడిన దేవుడివి కదా నీవు "
నేను "కార్తికేయ నేను మా ఆవిడకి నా సగభాగం ఇచ్చానయ్యా.. అప్పుడు తను నా గుండెల మీద కాలు ఎలా పెడుతుంది తన గుండె మీద తనే కాలు పెట్టుకుంది "
మీ పార్వతి మాత తో పాటు కైలాసవాసులు బ్రహ్మ విష్ణు దేవులు కూడా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు..
కా " ఆహా అద్వైత సిద్ధాంతాన్ని ఎంత బాగా వాడావయ్యా.. నీ తెలివితేటలు పట్టలేక మీ ఆవిడ అట్ల చేసి ఉంటది పరిచయం అయ్యి సరిగ్గా గంట కాలేదు అప్పుడే ఎన్ని మాటలు చెప్పావయ్యా.. నిజం చెప్పు మీ ఆవిడ నిన్ను వెతికి వెతికి పెళ్లి చేసుకుందా లేక నువ్వే అలా అయ్యే విధంగా పధక రచన చేసి.. అమలు చేసావా"
మీ పార్వతీ మాత కళ్ళతో చెప్పండి సమాధానం అన్నట్లు నా వైపు దబాయించి చూస్తుంది భక్తులారా
నేను "నేనేమీ చేయలేదు.. అందరూ కలిసి "
అనగానే విష్ణు దేవుడు బ్రహ్మదేవులు అందరూ తమని తాము చూసుకుంటున్నారు నేను వారి మీద ఏ చలొక్తి విసరబోతున్నానని.
" అందరూ కలిసి లోక కళ్యాణం కోసం అంటూ ఏదో విరాగినయి ఇలా వేషం వేసుకొని తిరిగే నాకు.. అన్ని విద్యలు వాడి.. నేను కూడా నీ లాగానే అయ్యా ప్రేమకి తప్ప దేనికి లొంగను.. అలా ప్రేమగా మా ఆవిడ నన్ను లొంగదీసుకుంది.. ఏం చేస్తాం అయ్యా మగవాడా తర్వాత సృష్టిలో చిన్నప్పుడు తల్లికి పెద్దవగానే భార్యకి.. బతికున్నంత కాలం ఇద్దరికీ
. ఆ మాటకొస్తే మనల్ని నమ్మిన బాధ్యత ఉంచిన వారికి కట్టుబడి ఉండాలి "అంటూ ఉపోద్ఘాతంగా చెప్పాను
కా "ఇదిగో నువ్వు ఏదన్నా చెప్పు నాకు మాత్ర0 అనుకోవ కలిగిన భార్యని వచ్చే ఏర్పాటు చేయి స్వామి.. పండుగ రోజు శివుడి వలె తారసపడ్డావ్ నువ్వు ఆశీర్వదిస్తే సాక్షాత్తు శివుడే ఆశీర్వదించాడు. అని భావిస్తాను.. పైగా మనం కళాకారులము.. మనకి ఇంటిలో చేదోడు వాదోడుగా.. ఉండే భార్య. కచ్చితంగా కావాలి కదయ్యా రాజా "
నేను "అంతేనంటావా సరే కానీ ఎన్నోసార్లు తధాస్తు చెప్పాను మరొకసారి.. తధాస్తు అంటాను "తధాస్తు"
కార్తికేయుడు శిఖరం వైపు చూస్తూ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ అని నిజంగా శివుడే నా రూపం లో ఆశీర్వదించాడు అని అనుకుంటున్నాడు
నేను "ఇక చెప్పయ్యా నీకు క దేంటో .. ఏదో నటన నాటకం దర్శకుడు అంటున్నావు కదా"
విష్ణుదేవుల వారు బ్రహ్మ దేవుడితో " కథ మంచి పాకం పట్టింది.. ఇక బెల్లం వేయటమే తదుపరి"
కా " నేను ఒక నాటకాన్ని రచించానయ్య.. ఆ నాటక కథ సారాంశం ఏమిటంటే.. భగవంతుడైన శివుడు సతీమత ఆత్మహత్య చేసుకోగానే.. తన శరీరాన్ని.. తన వెంట తిప్పుకుంటూ.. భుజాన మోస్తూ. మహావిష్ణువు శక్తి పీఠాలు స్థాపించిన కథ ఆ తరువాత సతీదేవి లేదని శివుడు పడే ప్రేమ తపన.. తో ఏకపాత్రాభినయం"
అంటూ దీర్ఘ ఆలోచన చేస్తున్నాడు
కూర్చున్న నేను లేచి నుంచొని.. కార్తికేయుడు భుజం పైన చేయి వేసి.. "ఏమిటి మిత్రమా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ " అని అడిగాను
కా "ఏమీ లేదు రాజా బాబు! ఈ నాటకంలో సన్నివేశాలు రాసుకునేటప్పుడు.. నాకు తెలిసిన ఒక పండితుడు నీ రచనల కోసం దేవుడి పాత్రను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు దేవుడు అన్నాడు అనలేదు అనే మాటలు కాకుండా కథా సౌలభ్యం కోసం ఎట్లా పడితే అట్లా రాస్తున్నావు.. అట్ల రాయటం వల్లే నీవు శపింపబడి ఆర్థికంగా ఎదగలేకపోయావు.. శివుడి శోకం అనే ఈ సన్నివేశాల్లో నీ పైత్యం ఇక ఎట్లా ఉండునో అని మందలించిన విధంగా మాట్లాడాడు"
నేను "చూడు మిత్రమా.. భగవంతుడు కళా ప్రియుడు.. కలలు సృజించింది ఆత్మానందానికే.. అదే మానవజన్మ యొక్క పరమావది.. భగవంతుని యొక్క పాత్రను వెక్కిరించినట్టు కాకుండా కావాలని కించపరిచినట్టు కాకుండా.. తన ఉన్నతిని తన ప్రదర్శనను ఆకట్టుకునే విధంగా సూత్రీకరించి మనస్ఫూర్తిగా మంచి భావాన్ని కల్పించగలిగినట్లయితే.. అది ఎన్నటికీ తప్పు కాదు"
కా "అవును మిత్రమా ఇంత పొడుగు కాకపోయినా.. నువ్వు చెప్పినంత ఒక్క ముక్కలో చెప్పాను.."
అందరూ నమ్మకంగా నవ్వారు నాతో సహా.
.నేను "ఇంతకీ ఇప్పుడు నా నుంచి నువ్వు ఏమి కోరుకుంటున్నావో అది సరిగ్గా పూర్తిగా వివరించి చెప్పలేదు"
కా "రాజాబాబు నేను శివుని శోకం అనే పేరు మీద ఒక ఏకపాత్రాభినయం రూపొందించబోతున్నాను అందుకు తగ్గ కదా సన్నివేశాలు నాటకం రచించాను.. తుదిమెరుగులు దిద్దుతున్నాను.. ఆ తరువాత జగన్నాటకము అనే మరో నాటకాన్ని కూడా రచిస్తున్నాను అది కొంత కాలంలో అయిపోతుంది అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా అమ్మవారు. అవతారాలు అందరూ నాకు పాత్రధారులుగా కావాలి స్వామి.. నీది మాత్రం ఎప్పటికీ శివుని పాత్ర అంత చక్కగా సరిపోయావు "
నేను " ఓహో నీ యొక్క నాటక సమూహంలో నాది శివుని పాత్ర ఆహా ఎంత గొప్ప పాత్ర ఇచ్చావ్.."
కా "నేను ఇచ్చింది ఏమీ లేదు రాజా బాబు ఈ తిరుణాలకి వచ్చాను కోటప్పకొండ.. కోటయ్య నీ రూపంలో చేదుకున్నాడు.. ఆయన తప్పక ఆదుకుంటాడు.. శివుని పాత్ర పోషించడం కోసమే పుట్టినట్టు ఉన్నావయ్యా నీకు కాక ఎవరికి ఆ పాత్ర"
అందరూ ఎప్పటిలాగే చక్కగా హాయిగా నవ్వుకుంటూనే ఉన్నారు....
నేను "మరి నాకు నటన ఉచ్చ రాదా నీకు తెలియదు కదా ఎలా నన్ను పెట్టేసుకున్నావ్"
కా "నీ ముఖంలోనే నటన ఉంది.. నీ వర్చ స్సు లో అభినయం ఉంది.. మీ హాంగికంలోనే మహా మహాభావాలు పలుకుతాయి మహానుభావా.. నీకు నటన రాకపోయినా పర్లేదు నీ చేత బాగా నటన చేయించుకుంటాలే "
నేను "బాగు బాగు .. నా పాత్రని రక్తి కట్టిచ్చే విధంగా నా నటనకు తర్ఫీదు ఇవ్వు దర్శక"
కా "సరే కానీ ఈ కోటప్పకొండ స్థల పురాణం ప్రకారం.. ఇక్కడికి మహాదేవుడు వచ్చి సతీమత చనిపోయిందని బాధపడ్డాడు కదా నేను ఒకసారి చేసి చూపిస్తా అలాగనే నీవు ఆ ఆ సన్నివేశం ఒకసారి చెయ్యి "
అదృశ్య రూపంగా ఉన్న అందరూ చూస్తున్నారు నేను కార్తికేయన్ ముందు నుంచొని అలాగే చేస్తా అన్నట్లు సరిగా చేశాను ఇప్పుడు కార్తికేయుడు అభినయం మొదలుపెట్టాడు
కార్తికేయుడు సన్నివేశాన్ని వివరంగా చెప్పాడు.. తాను నటిస్తున్నాడు..
తనే శివుడు
" సతి ఎక్కడికి వెళ్లావు నీవు! నాతో ఉంటా అన్నా నన్ను కాస్త అన్నావ్ విరాగినైన నాకోసం తపస్సు చేశావు నన్ను గెలుచుకున్న ఎవరి మీద ప్రేమ అభిమానం లేని నాకు నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే విధంగా చేశావు.. ఈ సృష్టి నడిపే క్రమాన్ని క్రమబద్ధీకరించి సామాన్య మనిషి వలె నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాను.. వద్దు అని తగదు అని ఎన్నిసార్లు చెప్పినా నీ తండ్రి దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్లావు.. వద్దు సత్తి అని ఎన్నిసార్లు చెప్పినా నీ మీద ప్రమాణం చేసుకొని మరి ఆపొద్దు అని చెప్పి వెళ్లావు జరిగేది తెలిసి కూడా ఆపుకోలేకపోయినా సామాన్యుడిని అయిపోయాను నేను ఇది ప్రేమ వల్ల జరుగునేమో.. అగ్నికి ఆహుతి అయిపోయావు.. ఇది జరుగుతుందని భావించే నిన్ను వద్దు అంటే వద్దు అని చెప్పి మరి దూరం చేసుకున్నాను కానీ నీ ప్రేమతో నీ భక్తితో నన్ను ఎప్పటికీ దగ్గర చేసుకున్నాం నేను శివుడనే కావచ్చు నీవు శక్తి రూపానివే కావచ్చు శక్తి లేని శివుడు.. అంటూ బోట బొట కన్నీరు కారుస్తున్నాడ
అది చూస్తూ మీ పార్వతీ మాత కూడా తీవ్ర ఆవేశానికి లోనే కళ్ళెముటి నీళ్లు పెట్టుకుంది..
పార్వతీ మాత "ప్రభువా రోజు మీ మాట విని ఉండాల్సిందే మీరు ఇంత బాధ పడతారని నేను అనుకోలేదు మీరు ఇలా బాధపడతారు అని నాకు అనిపించి ఉంటే.." అంటూ కళ్ల వెంట నీరు తుడుచుకుంది
కా "ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రేమ కథ మనది ఆ ప్రేమ కథని ఈ రకంగా"అంటూ కిందపడి ఏడుస్తూ అభినయిస్తున్నాడు కార్తికేయుడు
నేను అతని అభినయాన్ని చూస్తూ నిజంగా అది జరిగిన సమయానికి వెనక్కి వెళ్లాను .. నాకు గుర్తుకు వచ్చింది నేను కూడా సతీ సతీ అంటూ ఇక్కడే గుండెలు పగిలిపోయేలాగా బాధ పడ్డాను.. భక్తులారా నా మీద ప్రేమ చూపించిన బంధం ఏ విధంగా ప్రేమ చూపించిన వారి కోసం అంతే బాధపడతారు ఇది మీ అమ్మ కోసం పడ్డాను కాబట్టి మీకు తెలిసింది మీకోసం నేను పడుతున్న బాధ మీకు తెలియదు కదా! అదంతా గుర్తుకు వచ్చే నాకు కూడా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి
మీ పార్వతీ మాత నన్ను తలుచుకుంటూ కళ్ల వెంట నీరు తుడు చు కొండి అని సైగ చేస్తుంది..
కార్తికేయుడు నటనలో లీన మైపోయాడు.. ఒక దర్శకుడికి నటన కూడా రావాలి..
(కొనసాగుతుంది)
No comments:
Post a Comment