మానసవీణ -44
మన్నె పిన్నక లలిత
దట్టమైన అడవి, తండా నిశి దుప్పటి
కప్పుకున్నాయి. చవితి
చంద్రుని వెలుగు సన్నగా పరుచుకుంది. దినేష్ లేచి కూర్చుని చుట్టూ పరికించాడు.
బొటానికల్
స్టూడెంట్, దినేష్ కు
పసరుతో ఆయుర్వేద వైద్యం చేయటంతో
లేచి కూర్చున్నాడు తల తడుముకుంటూ. అనిరుధ్, రవీంద్ర,
సాయిలను పరిచయం చేశాడు దినేష్ కు. వారితో పాటు వచ్చిన
శ్వేత, వర్షలను వెతుక్కుంటూ వస్తుంటే దినేష్
కనపడటం, చికిత్స చెయ్యటం గురించి చెప్పాడు అనిరుధ్ . దినేష్
సెల్ ఫోన్ తీసుకొని ఏదో మెసేజ్ పంపించాడు." ఓకేనా సార్!" అన్నాడు సాయి.
"ఎస్! ఎస్! అయామ్ ఓకే!" అన్నాడు దినేష్ .అమ్మాయిల్ని వెతకటానికి దినేష్ ,అనిరుధ్, రవీంద్ర, సాయి
బయలుదేరారు.
అడవి
రాత్రిపూట భయంకరంగా ఉంటుంది నిశ్శబ్దంగా అసాంఘిక కార్యకలాపాలు చేసుకునేవారికి
ఆలవాలంగా ఉంటుంది. చవితి చంద్రుని వెలుగు చెట్లలో
నుండి సన్నగా పడుతూ ఉంటే దారులు సన్నగా పాము మెలికల్లా కనిపిస్తూ
ఉన్నాయి.
అందరూ ఒకరి వెనుక ఒకరు మొబైల్ లైట్ ల వెలుగులో జాగ్రత్తగా చూచుకుంటూ
నడుస్తున్నారు .
దినేష్
ఒక పాపను ఇద్దరు బలిష్టులు తీసుకు వెళ్ళటం చూచి పట్టుకోవటానికి వెళ్తున్నప్పుడే,
వెనక నుండి తల మీద దెబ్బ పడింది.
"ఎవరు ఆ పాప? ఎందుకు
తీసుకు వెళుతున్నారు?" ఆలోచిస్తూనే వీళ్ళకి జాగ్రత్తలు
చెప్తూ ముందుకు సాగుతూ ఒక చోట ఆగాడు దినేష్ . మిగతా అందరూ కూడా ఆగి చూస్తున్నారు.
"ఈ అడవి లోకి వచ్చి ఆగమై పోతున్నాం. ఎందుకొచ్చిన బాధ? ఉన్న ఊరు వదిలి అగచాట్లు పడుతున్నాం. చెబితే వినవు కదా !బిడ్డఏమై పోనాదో?
ఏమో ?? ఈ
అడివిలో ఏడని వెతుకుతాం?
దేవుడా! అభం శుభం తెలియని
బిడ్డ కనపడేటట్టు చెయ్యి సామి! నీకు ఏటను బలిస్తాను."
అ మాటలు విన్న దినేష్ కు అర్థమైంది పరిస్థితి. ఆ ఇద్దరూ
తీసుకువెళ్ళింది
వీళ్ళ పాపనే అన్నమాట. వెదకబోయిన తీగ కాలికి తగిలింది. వాళ్ళ ముందుకు
వెళ్ళిన
దినేష్ ని చూచి వాళ్ళు భయపడిపోయారు .
"భయపడకండి. నేను మీ పాపను వెతికి ఇస్తాను.
నాతో మాట్లాడకుండా రండి." అన్నాడు దినేష్ .
"ఓలమ్మో! నా పాపకు ఏమైంది? ఎవరు తీసుకుపోనారు?" అంటూ గుండెలు బాదుకోసాగింది
ఆ స్త్రీ.
"అమ్మా! మీరేమీ మాట్లాడొద్దు. మీ పాపను
వెతికి ఇచ్చే బాధ్యత నాది, మాట్లాడకుండా నా వెనకే
రండి." అన్నాడు దినేష్.
"సరే సామి" అంటూ అందరూ కలిసి ముందుకు
సాగారు. వాళ్ల
వివరాలు అడిగి తెలుసుకున్నాడు దినేష్ .
దూరంగా
కనిపిస్తున్న వెలుతురు వీళ్లకు దిక్సూచిలా కనిపించింది. ఆ చిన్న తండాలో ఉన్న ఏకైక
చిన్న డాబా అది. అప్పలనాయుడు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు,
తన అవసరాల కోసం. ఇంటి ముందు ఒక ఆకారం నిలబడి కనిపిస్తూ ఉంటే,
ఇంటి వెనుకకు వెళ్లారు అందరూ నెమ్మదిగా. అక్కడ తలుపు ఒకటి ఓరగా తీసి
వుంది, లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి.
"దొర! ఈ చిన్న గుంటను తీసుకొస్తుంటే ఈ
పెద్ద గుంటలు కూడా కనపడితే ఇద్దరినీ తీసుకొచ్చాం మీకోసం. ఇంకోటి ఉంది. అది
పారిపోయింది. లేకుంటే నా సామిరంగా! ఇయ్యాల ఇందు బోజనమే మీకు!"
మీసం
దువ్వుకుంటూ, నవ్వుకుంటూ, అంటున్నాడు
అప్పలనాయుడు "వీళ్లదేముందిరా. ఆ మానసను పట్టుకు రావాలి. అప్పుడు అసలైన విందు
భోజనం నాకు."
"అట్టాగే దొర.
ఆ మానసను తిరిగి రానీయండి, వచ్చిన రోజే మీ కాళ్ళ దగ్గర
పడేస్తాం."
నవ్వుకుంటూ
అక్కడ పెట్టిన పాల గ్లాసు తీసుకుని తాగబోతున్నాడు అప్పలనాయుడు. వెంటనే దినేష్
వెళ్లి గట్టిగా పట్టుకోగానే, ఆ పాల గ్లాస్
వెళ్లి దూరంగా పడింది. వెంటనే మెరుపువేగంతో వచ్చిన వర్ష, అప్పలనాయుడు
కళ్ళల్లో స్ప్రే చేసి, కుడిచేతిని ముందుకు చాపగానే వాచీలో
నుండి చాకులాంటిది వచ్చి అతని పొట్టలో గుచ్చుకుంది. అప్పలనాయుడు గిలగిలా
కొట్టుకుంటూ, అరుస్తూ కింద పడ్డాడు.
దినేష్
ఆశ్చర్యపోయాడు ఈ హఠాత్పరిణామానికి .
"సార్! మీరు ఎవరో నాకు తెలీదు. మేము
అడవుల్లో తిరుగుతూ ఉంటాం. షీ టీం సలహాలు తీసుకుంటాం కాబట్టి ఆత్మరక్షణార్థం
కొన్ని వస్తువులు దగ్గర పెట్టుకుంటాము. అవకాశం కోసం చూస్తున్నాను"
అన్నది వర్ష.
సాయి, రవీంద్ర వర్షను చూచి
సంతోషపడ్డారు.
అప్పలనాయుడి అరుపు విని బయట నుంచున్న వాళ్లు లోపలకు రాగానే,
చింపిరి జుట్టుతో ఉన్న ఆ పాప " లపెదనాన్నా" అంటూ
కౌగిలించుకుంది. అప్పుడే లోపలకు వచ్చిన భార్య భర్తలు "ఏంటన్నా! నువ్విక్కడ?"
"తమ్ముడుా! మీరు..."
"పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక, ఉన్న ఊర్లో తినడానికి తిండి లేక, ఆకలి బాధ భరించలేక,
పట్నంలో ఏదన్నా కూలీ దొరుకుతుందేమోనని వచ్చి, ఇక్కడ
దూరంగా ఉన్న
ఒకచోట వాచ్ మెన్ గా ఉన్నాను. ఇదిగో ఇదే నిద్రలో లేచి వచ్చిందేమో
కనపడకపోతే వెతుక్కుంటూ వస్తుంటే, ఈ సార్లు కనపడి మమ్మల్ని
ఇక్కడకు తీసుకువచ్చారు" అని అంటూ ఇద్దరూ వెళ్లి
పాపను ముద్దులు పెట్టుకుంటూ "నా బంగారు తల్లే!"
అంటూఎత్తుకున్నారు.
ఇదంతా చూస్తూ పారిపోతున్న అప్పలనాయుడిని గట్టిగా పట్టుకున్నాడు
దినేష్. అప్పుడే వచ్చిన పోలీసులను చూచి "రండి ఎస్ఐ గారు!
సినిమాల్లో లాగా అంతా అయిపోయిన తర్వాత వస్తున్నారు" అంటూ
నవ్వాడు.
వెనక
ఉన్న అమ్మాయిని చూచి "ఎవరు?" అనబోతుండగా,
"శ్వేతా !" అంటూ వర్ష ముందుకు వెళ్లి, ఆ అమ్మాయిని కౌగిలించుకుంది గట్టిగా. ఎస్ ఐ విక్రమ్ అప్పలనాయుడుకు బేడీలు
వేశారు...
చీకట్లు విచ్చుకుంటున్నాయి అప్పుడే పుచ్చపువ్వులాగా.
No comments:
Post a Comment