మాధవా…
పెయ్యేటి రంగారావు
మాధవా…… మధుసూదనా
ఏ మోమున వరాల నడిగేది?
మొహము చెల్లదు – యోగ్యత లేదు
ఇప్పట్టున నిను ఏమని కోరేది? ||మాధవా||
దేవళమ్మున కేగలేదు
పూజలెన్నడు చేయలేదు
భక్తి అన్నది కలుగలేదు
బ్రతుకు భావము నెరుగలేదు ||మాధవా||
కామముతోనే కాలమాయెను
కాసుల పైనే మోహమాయెను
దానము ధర్మము చేయలేదు
దానవారికి మ్రొక్కలేదు ||మాధవా||
క్రోధము నెన్నడు వీడలేదు
లోభము నెన్నడు విడువలేదు
మోహము తోనే గడచి పోయెను
మదము తోనే జీవనమాయెను ||మాధవా||
మచ్చరమ్మున కులుకుచుంటిని
పుణ్యకార్యముల సలుపకుంటిని
వరమీ మానవ జీవితము
వ్యర్థము చేసితి ఇది నా గతము ||మాధవా||
ఒక పరి తలచిన దయను జూడవే
కేశవా యనిన క్లేశములుండవే
శ్రీరామా యన మోక్షము నిడవే
హరీ – శ్రీహరీ – చేదుకొనవే? ||మాధవా||
-------------------
No comments:
Post a Comment