వీడని వాసనలు - అచ్చంగా తెలుగు

 

వీడని వాసనలు

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు


 

బాల్యంలో

అజ్ఞానంతో చెలిమి చేసాను,

యవ్వనంలో

భ్రమలతో స్నేహం చేసాను .

మధ్య వయసులో

శ్రమలతో చేతులు కలిపాను,

జీవన సంధ్యాసమయంలో

నిర్లిప్తతతో నిండి పోయాను.

అస్తమించే తరుణంలో

అసంత్రుప్తులకు ఆప్తుడనయ్యాను.

మనసులో ముద్రించుకు పాయిన

ఈ భావనలన్నీ నాతోనే ఉండి

నను వీడనంటున్నాయి.

మరో జన్మకు కూడా నాకు తోడుగా

ఉంటానంటున్నాయి.

***

No comments:

Post a Comment

Pages