యోగాలు
జ్యోతిష్యం లో
యోగాలకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఉంటుంది.కొన్ని గ్రహాల కలయిక గానీ, గ్రహాల దృష్టి
వలన కానీ, యోగాలు
ఏర్పడతాయి. జ్యోతిష్యం లో ఎన్నో యోగాల గురించి వివరించడం జరిగింది. ఈ పాఠం లో
వాటిలో కొన్ని గురించి తెలుసుకుందాం
మహా భాగ్య యోగం
ఈ యోగం లగ్నం, రవి గ్రహం, చంద్ర గ్రహం వలన కలుగుతుంది
స్త్రీలకు అయితే
పైన గమనిస్తే, ఈ రాశులన్ని, సరి రాశులు లేదా స్త్రీ రాశులు అయ్యాయి.
పురుషులకు అయితే
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల జన్మించి
లగ్నం - మేషం, మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభం
రవి, చంద్రులు -
మేషం, మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభం లలో ఉంటే ఈ
యోగం ఉంటుంది
పైన గమనిస్తే, ఈ రాశులన్ని, బేసి రాశులు లేదా పురుష రాశులు అయ్యాయి.
ఈ యోగం లో జన్మించిన వారు
•
అదృష్టవంతులు
•
శరీరం, ఆత్మ, మనస్సు (బుద్ది) వీటి మీద నియంత్రణ కలిగి ఉంటారు
•
పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు
•
అధికారి స్థానాన్ని పొందుతారు లేడా పాలకుడి గా ఉంటారు, పాలనా వ్యవస్త లో ఉన్నత పదవి ని పొందుతారు
•
జీవితాంతం, ఆరోగ్యంగా
ఉంటారు
•
ధన సంపదలతో, పిల్ల పాపలతో
ఆనందంగా ఉంటారు
•
సదాలోచనలు కలిగి ఉంటారు
• వీరు ఆనందం తో
ఉండటం తో పాటూ, ఇతరులను ఆనందం
గా ఉంటారు.
త్రిలోచన యోగం
ఈ యోగం రవి గ్రహం, చంద్ర గ్రహం, కుజ గ్రహం వలన కలుగుతుంది
రవి గ్రహం నుండి కుజుడు, చంద్రుడు 5,9 భావాల్లో ఉండటం లేదా కుజుడు నుండి రవి, చంద్రులు 5,9 లో ఉండటం వలన ఈ యోగం ఏర్పడుతుంది.
ఈ యోగం ఉన్న వాళ్ళు
•
ధనవంతులుగా జీవిస్తారు
•
తెలివయినవారుగా ఉంటారు
•
పరిపూర్ణ ఆయుష్షు కలిగి ఉంటారు
•
శత్రువులకు భయం కలిగించే విధంగా
ఉంటారు
•
అదృష్టవంతులుగా ఉంటారు
•
తల్లి తండ్రుల సహాయ సహకారాలు
ఉంటాయి
•
విద్య కోసం కానీ, వృత్తిరిత్యా కానీ, విదేశాలకు వెళతారు
ఈ యోగం యొక్క ఫలితాలు
స్పష్టం గా రవి, చంద్ర కుజ దశలలో అనుభవిస్తారు
రవి దశ - 6 సం
చంద్ర దశ - 10 సం
కుజ దశ - 7 సం
మొత్తం 23 సం
ఈ 23 సంవత్సరాలు జీవితం
లో ఉన్నత స్తాయి కి చేరుకొని విజయాన్ని అందుకుంటారు
గంధర్వ యోగం
దశమ భావాధిపతి కామ
త్రికోణం లో ఉండి, లగ్నాధిపతి మరియు, గురుడు కలిసి ఉండి, రవి గ్రహం ఉచ్చ లో కానీ, స్వక్షేత్రం లో ఉండి, చంద్రుడు 9వ భావం లో ఉంటే ఈ యోగం కలుగుతుంది.
కామ త్రికోణం అనగా, సప్తమభావం నుండి కోణ స్థానాములు
అనగా 7, 11, 3 భావములు.
ఈ యోగం పూర్తి గా
ఉంటేనే గంధర్వ యోగం పరిపూర్ణంగా వర్తించి, సంగీతం, నృత్యం, చిత్రకారునిగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. కామ త్రికోణం లో ఉన్నందున, ఆ కళల పై అమిత ఇష్టం ఏర్పడుతుంది.
ఇవి పూర్తి గా లేనిచో
వాటి పై ఆసక్తి ఉంటుంది కానీ, అమితమయిన ఇష్టం ఏర్పడదు.
ఈ యోగం ఉన్న వాళ్ళు
• లలిత కళల యందు విశేష ప్రతిభ ఉంటుంది.
• కళల యందు అమిత అభిమానం ఉంటుంది
• సాంప్రదాయమయిన వేష ధారణ యందు అభిలాష
• పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు.
No comments:
Post a Comment