శివం - 100
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
ఇది 100 వ ఎపిసోడ్.. శివం కథల ఫలితమంతా శివుడికి మాత్రమే చెందుతుంది.. మరొకసారి చెబుతున్నాను ఈ కథలు నేను రాయటం లేదు ఈ కథకి నేను కేవలం సిరా మాత్రమే.. రాద్దామని మొదలుపెట్టగానే శివుడే ఏమి రాయాలో దృశ్యం లాగా చూపిస్తాడు.. అందుకే శివం రాసిన వారు చదివిన వారు తెలిసినవారు ప్రచురించిన వారు అందరికీ ఒకటే ప్రమాణం.. శివోహం. ఇందులో వస్తున్న అనేక భక్తుల కథలు సన్నివేశాలు నిజంగా జరిగి ఉంటాయి ఎప్పుడో ఒకప్పుడు. వాటిని నటరాజు ఇలా వ్యక్తిగరిస్తున్నాడేమో అని నా అభిప్రాయం.. తప్పులు ఉంటే మన్నించు ప్రార్ధన తప్పులు ఉంటే అవి నావి గొప్పలు ఉంటే అవి శివునివి..)
నేను అనగా శివుడు
{ కోటప్పకొండలో తిరునాళ్లకు వచ్చిన దర్శకుడు కార్తికేయుడు.. సాక్షాత్తు నాకే శివుడి పాత్ర ఇచ్చి శివుడి పాత్రలో ఎలా అభినయించాలో సతిమాత అగ్నికి ఆహుతి అయినప్పుడు.. ఎలా నేను బాధపడ్డాను నాకే నటన చేసి చూపిస్తున్నాడు ఈ దిగ్గ దర్శకుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం..}
కార్తికేయుడు నటన నన్ను కదలి వేస్తుంది.. నా జ్ఞాపకల దొంతరలు అంతే తే ర్చుకుంటున్నాయి
.
కా " సతి ప్రేమలో ఇంత మాధుర్యం ఉంటుందని.. సామాన్య మనిషిలా నిన్ను ప్రేమించినందుకే నాకు అర్థమైంది.. బహుశా తలరాతని ఒకటి పెట్టి మానవుని బాధపెడుతున్నందుకు నాకు నేను రాసిన ప్రకృతి భాష్యం నాకే జరిగిందేమో .. ఈ విరహ వేదన ఎలా తట్టుకోవాలి.. భక్తి కాని ప్రేమ మార్గంలో నాకోసం వెలసిన ఆదిశక్తిని కోల్పోయిన ఈ బాధని ఎలా నేను పరిగణింప చేసుకోవాలి... సతీ సతీ"
అదృశ్య రూపంలో ఉన్న శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవుడు మరియు కైలాస పరివారం అందరూ ఈ సన్నివేశాన్ని తీక్షణంగా చూస్తూ భరిస్తూ అనుభవిస్తూ ఉన్నారు
నంది బృంగి అది జరిగినప్పుడు ఉన్నారు కావున వారు సతీమాతుని గుర్తు తెచ్చుకొని బాధపడ్డా ఆ సతిమాతే పార్వతీమాత వలె వచ్చింది కాబట్టి ఆమెను చూసి ఒక్కసారి సంతృప్తి పడ్డారు..
వినాయకుడు కార్తికేయుడు మాత్రం
. నాన్నగారు అమ్మగారి ముందర స్వరూపం కోసం ఇంతలా బాధపడ్డారని మదనపడ్డారు
బ్రహ్మదేవుడు మాత్రం సృష్టి నియమాలు ఎవరికైనా ఒకటే మనము భయపడవలసింది భగవంతునికి కాదు మనం చేసుకుంటున్న కర్మకి అదే మనకి తిరిగి వస్తుంది అనే సత్యాన్ని క్రోడీకరిస్తూ ఒక చిన్ని నవ్వుతూ జరిగింది చూస్తున్నారు
అంటూ కార్తికేయుడు లేచి ఎలా చేశాను రాజా అని నన్ను అడిగారు
నేను "అద్భుతంగా చేశావు కార్తికేయ.. కళాకారులు ఎందుకు భగవంతుని మనసు గెలుచుకుంటారు నిన్ను చూస్తే నాకు బాగా అర్థమైంది మనసు కదిలిపోయింది అయ్యా.. అప్పుడు జరిగిన సన్నివేశాలు గుర్తుతెచ్చుకొని నేను కూడా కన్నీటి పర్యంతమయ్యా అంతా పని చేశావు "
కా "నాయనా శివుని పాత్రధారి.. సాక్షాత్తు ఆ సమయంలో నువ్వే ఉన్నట్టు.. భలే భావంలో పడి చెప్తున్నావే.. తస్సాదియా.. అలా భావనలో పడటమేలే మంచి నటుడి లక్షణం , నీలో నటనకి తిరుగులేదు పో"
అందరూ యధావిధిగా నవ్వుకుంటున్నారు అంతకుమించి కార్తికేయని మాటలకు ఎవరు మాత్రం ఏమి చేయగలరు
నేను "సరే తర్వాత సన్నివేశం ఏమిటి"
కా "ఇక్కడే ఒక వినూతమైన ఆలోచన వచ్చింది రాజా.. అది ఏమిటంటే సతీమాతం శివుని ముందు ప్రత్యక్షమై తను ఎందుకు అలా చేసిందో చెప్పి మన్నించవలసిందిగా శివుని కోరుకున్నట్టు ఒక సన్నివేశాన్ని సృష్టించాను"
చిరునవ్వు నా మొహం పైనే కాకుండా అందరి మొహం పైన ఉంది కార్తికేయ చెప్పేది వింటున్నాం
నేను "బాగు బాగు బహు బాగుంది.. కాసేపు సతిని చూస్తే శివునికి కూడా దుఃఖము తగ్గుతుంది నాటకం ఇంకా బాగా పండుతుంది ఆహా ఎంత గొప్ప రచన పట్టుత్వం "
కా "ఇదిగో ఇప్పుడు ఈ బండరాయి మీద శివుని కూర్చొని బాధపడుతూ ఉంటాడు.. అప్పుడు సతీమాత ప్రత్యక్షమై ప్రభువు మీరు ఇలా అవుతారని అనుకోలేదు అని చెబుతూ శివుని యొక్క దుఃఖాన్ని తగ్గిస్తుంది.. అప్పుడు శివుడు ఇక్కడ జ్ఞానాన్ని ఉపదేశించే దక్షిణామూర్తిగా కొలువైనట్లు చూపిద్దాం. ఎలా ఉందంటావ్ అన్నాడు చొక్కా ఎగరవేస్తూ"
నేను "బావుంది .. పాత్రల సారం లో చెడగొట్టకుండా ఎంత మంచిగా పండిస్తే భగవంతుడు కూడా అంత మంచిగా ఆనందపడతాడు.. అందుకే కదా కావ్యాలు రాసిన వాళ్ళకి కీర్తనలు రాసిన వాళ్ళకి భగవంతుడు కనపడి మోక్షం ఇచ్చాడు కార్తికేయ"
కా "వాళ్లందరూ చాలా గొప్పవాళ్లు రాజా నేను ఏముంది చిన్నా రచయితను చిన్న దర్శకుని ఏదో గుర్తింపు రావాలని.."
నేను "స్వార్థం కోసం ఏ పనైనా చేయటం భగవంతుని దృష్టిలో వ్యర్థం.. అదే కళాకారులు కలని గుర్తింపు కోసం ప్రదర్శించటం భగవంతునికి పెట్టే నైవేద్యం.. నిర్వచనాలు కూడా బాగున్నాయి.. నువ్వు కల్పితం చేసే సన్నివేశాల్లో భగవంతుని పాత్ర ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి నీకు మోక్షం వస్తుందేమో.. భగవంతుడు ఆనందపడితే ఎంతసేపు అయ్యా"
కా "ఏదో రాజా శివుని పాత్రలో నిన్ను పెట్టుకుందామనుకున్నా సాక్షాత్తు శివుని లాగే ఉన్నావు.. పైగా శివరాత్రి రోజు కనపడ్డావు.. ఐహిక జీవితం బాగుండాలని సుఖంగా బతకాలని ఆశీర్వదించావు.. అలాగే భౌతిక మరణం తర్వాత కూడా మోక్షం లభిస్తుందని కళా సేవ చేయమని చెప్పావు.. నువ్వు చెప్పింది చూడే చెప్పినట్టు భావిస్తున్నాను రాజా సంతోషం"
అని అంటూ కాస్త తన్మయత్వంలో అలా కోటప్పకొండ శిఖరం వైపు చూస్తున్నాడు
నేను "ఏమిటయ్యా చూస్తున్నావు ఏదో మొహంలో గొప్ప ఆలోచన చేసినట్టున్నావే మొహం లో ఉత్తేజం ఉల్లాసం చక్కగా కనబడుతున్నాయి" అని వెటకారంగా అన్నాను
కా "రాజా నిజంగా భగవంతుడు నీ వాక్కు చల్లగా ఫలించి ఇక్కడ గొప్ప గొప్ప నాటకాలు రచించి కాలాలను ప్రదర్శించి.. అవన్నీ ఒక ఎత్తు.. శివుని చేరుకున్న తర్వాత నేను రాసిన కథలు అన్ని శివుని పక్కన కూర్చొని.. ఆయనకి చదివి వినిపిస్తూ.. ఆయన చేత మండలాలు పొందాలని ఒక పేరాశ చేశాను"
నేను "ఇది కచ్చితంగా జరుగుతుంది లే భయపడమాకు. ఇప్పుడు అదే. జరుగుతుందనే అనుకో "
కార్తికేయుడు ఒకసారి నా వైపు చూశాడు
నేను "అదే నేను శివుని లాగా ఉన్నాను నేనే శివుడిని ఆశీర్వదించినప్పుడు భావించావు కదా అందుకే అన్నానులే"
కా "అది సరే తర్వాత సన్నివేశాన్ని వివరిస్తాను ఒక్కసారి చూడు"
సన్నివేశం నడుస్తుంది..
నాటకంలో శివుని విలాపం తర్వాత .. అక్కడ ప్రత్యక్షమైంది మీ సతీ మాత
"ప్రభు"
నేను "సతి ఎక్కడికి వెళ్లావు నువ్వు"
సతీ "ప్రభు మీ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను పిలవని పేరంటానికి వెళ్ళాను నన్ను మన్నించండి నా తల్లిదండ్రులే కదా నాకేం అవమానం ఉంటుంది అవమానించిన నా తల్లిదండ్రుల దగ్గర నాకేం ఉంటుంది అంటూ వెళ్లాను.. కానీ నా పిత దక్షుడు మిమ్మల్ని అనరాని మాటలు అన్నాడు..
ఆదిపరాశక్తి అయిన నేను నా తండ్రిని ఏమీ చేయలేక శివనింద వినలేక ధర్మాన్ని కాపాడలేక అక్కడికి నాకు నేనే అగ్నికి ఆహుతి అయ్యాను.."
నేను " సతి ఈ విరాగిని వదిలి పెట్టావు"అంటూ ప్రేమగా చూస్తున్నాను
సతీ "ప్రభు నేను మళ్ళీ వచ్చేదాని మీకోసమే జగన్మాతగా తిరిగి వస్తాను అప్పుడు మన కళ్యాణం ఎంతో వైభవంగా చేసుకుందాం దయచేసి మీరు తిరిగి పూర్వస్థితికి రండి ఎందుకంటే జగత్పిత లు తమరు"
అనగానే విరాగి రూపంలో ఉన్న నేను ఒక్కసారిగా కర్పూర గోరం కరుణావతారం అనే నాదం వస్తుండగా మీ మహాదేవుని వలె ప్రత్యక్షమయ్యాను
నా జటా జటాలను వాయిదేవుడు తాకి నమస్కరించుకున్నాడు.. ఆ తాకిడికి జటలు ఊగినాయి
నా త్రిశూలాన్ని నేలకు వాని ఇచ్చి రక్షగా నేనుంటానని ముందుకు పెట్టి నిల్చున్నాను.. భూమాత ఆనందంగా కొంచెం పంపించింది
నా నుదుటి నుంచి వచ్చే గంగా.. ఉల్లాసంగా ఉత్సాహంగా ఆహ్లాదంగా కొంత నన్ను అభిషేకిస్తూ నేల మీద పడ్డది
నా తల మీద ఉన్న విభూది కొంచెం జారీ.. మట్టిలో కలిసిపోయినది
పంచభూతాలు సప్త ఋషులు ముక్కోటి దేవతలు అందరూ హరహర మహాదేవ అని ఒకటే జయ నాదం చేశారు..
కా "ఎలా ఉంది అయ్యా సన్నివేశం"
నేను "ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నా బ్రహ్మాండంగా ఉంది మనోరంజకంగా ఉంది"
కైలాస పరివారం "మహాదేవుడంటేనే కథానాయకుడు ఆ కథానాయకుడిని ఇంత గొప్ప గా చూపిస్తే ఇంకా బాగుంటుంది.
బ్రహ్మదేవుడు మరియు విష్ణు దేవుడు
"ఓం నమశ్శివాయ హర హర మహాదేవ"
కా "తరువాతి సన్నివేశం చెప్తున్నా "
... కొనసాగుతూ ఉంటుంది. శివం శివుడే చెబుతున్న కథలు.. 100వ తపస్సు పూర్తి అయినది.
No comments:
Post a Comment