సింహావలోకనం
మాళవిక ఒబ్బట్టు
ముకుంద్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ రోజు లెక్కల పరీక్ష.
అమ్మ: ఆల్ ది బెస్ట్.పరీక్ష బాగా రాయి.
ముకుంద్: సరే అమ్మ.
పరీక్ష హాల్ కు వెళ్లి ప్రశ్నాపత్రం అందుకున్న తర్వాత రాయడం మొదలుపెడతాడు. ముగియడానికి 30 నిమిషాల ముందు, బిట్ పేపర్ ఇస్తారు. ఒక సారి పేపర్ అంతా చదువుకున్నాడు.
ఒక ప్రశ్నలో, పూర్తిగా విశ్లేషణ పూర్తి కాకముందే, అతను తప్పు సమాధానానికి టిక్ పెట్టాడు. దాంతో మరో రెండు ప్రశ్నలను మిస్ అయ్యాడు. పేపర్ పూర్తి చేసి ఇంటికి చేరుకుంటాడు.
అమ్మ: పరీక్ష ఎలా రాసావ్??
ముకుంద్(నిరాశ తో ): hmmm .... బాగానే రాసాను.
అమ్మ నిరాశను గ్రహించి, అతని దగ్గర కూర్చొని, అతని తలపై చేయి వేసి, విషయం ఏమిటని అడుగుతుంది.
ముకుంద్: అమ్మ, నేను ఒక పొరపాటు చేశాను.మెయిన్ పేపర్ బాగా రాశాను కానీ బిట్ పేపర్ లో ఒక ప్రశ్నలో ఆలోచిస్తూ సరైన సమాధానం చెప్పేలోపే తడబడ్డాను. ఆ కారణంగా, నేను తప్పు సమాధానాన్ని టిక్ చేశాను. దాంతో మరో రెండు బిట్స్ మిస్సయ్యాను.
నా బాధ ఒక ప్రశ్న తప్పు చేశాను అనే దాని కన్నా ఎక్కువ దాని వల్ల ఇంకో రెండు తప్పు అయ్యాయి. ఆ హడావిడి నచ్చలేదు నాకు. నేను దీని పునరావృతం చేయాలనుకోవట్లేదు కానీ హడావిడి ఎలా తగ్గించుకోవాలో తెలియట్లేదు.
అమ్మ: పరీక్షకు సంబంధించి, నువ్వు ఏమీ చేయలేవు , కానీ తొందరపాటు విషయంలో, నువ్వు చాలా చేయగలవు.
ముకుంద్ (ఆశ్చర్యంతో): ఏమిటి?
అమ్మ : సింహం లాగా వుండు. నీకు ఇంక ఏ సమస్య ఉండదు.
ముకుంద్: దీనికి సంబంధం ఏమిటి?
అమ్మ: అడవిలో సింహం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా చూసావా?? అది కొన్ని అడుగులు వేసి, ఆగి, అన్ని దిక్కుల్లోనూ చూస్తూ నడకను కొనసాగిస్తుంది. 5 నుంచి 6 అడుగులు నడిచిన తర్వాత అదే రిపీట్ అవుతుంది.
సింహం ఏం చేస్తుందో తెలుసా..? ప్రతి 5 అడుగుల తర్వాత తాను వేసిన మార్గం సురక్షితమా కాదా అని అంచనా వేసి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ముకుంద్: అయితే??
అమ్మ: అంటే, ఏదైనా పని చేసేముందు, ముందు వుండే options ని ఒక సారి బాగా పరిశీలంచాలి. అన్ని చెక్ చేసాక ఏది సరి ఐంది అనిపిస్తుందో దాన్ని ఎంచుకోవాలి.
అప్పుడప్పుడు ఆగి నువ్వు చేసేది correct ఆ కాదా అని ఒక సారి check చేసుకో.
ముకుంద్: ఓ.కె., కానీ సింహం మాత్రమే ఎందుకు?
అమ్మ: ఎందుకంటే, కేవలం సింహం మాత్రమే ఇలా చేస్తుంది. సింహం జన్మతః నాయకుడు. ఒక నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలలో ఒకటి తాను చేసేది సరి అయ్యిందా కదా అని పరిశీలించుకుంటూ ముందుకి వెళ్ళటం. ఈ ప్రక్రియనే "సింహావలోకనం " అంటారు.
ముకుంద్: అమ్మ తో మాట్లాడాక ముకుంద్ చాలా ప్రశాంతంగా గా ఫీల్ అయ్యాడు. తర్వాత ఒక నడుస్తున్న సింహం video చూస్తాడు .
మరుసటి రోజు లెక్కలు పేపర్ 2 ఉంటుంది. ఎప్పుడు కొంచం హడావిడిగా చేస్తున్నాను అనిపించినా ఒక దీర్ఘ శ్వాస తీసుకుని, సమాధానం రాసాడు.ఉత్సాహంగా ఇంటికి వస్తాడు.
ముకుంద్i: అమ్మ, ఈ రోజు చాలా బాగా రాసాను. నువ్వు చెప్పిన సింహం పద్దతి బాగా ఉపయోగపడింది.
అమ్మ నవ్వుతుంది.
మనవి: ఏదైనా పని చేసే ముందు ఒక సారి ఏం చేయాలనుకుంటున్నామో?? ఎలా చేయాలనుకుంటున్నామో ?? ఒకటికి రెండు సార్లు అలోచించి చేయటం చాలా అంటే చాలా మంచిది.
***
No comments:
Post a Comment