శ్రీధరమాధురి -111
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )
శ్రీమన్నారాయణుడితో మీకు మాట్లాడాలని అనిపిస్తే, ఆయన అలౌకిక ఉనికిని మీరు ఆస్వాదించాలి అనుకుంటే, మీరు మానవ తర్కాన్ని, కారణాలు వెతకడాన్ని, అవగాహనను అధిగమించి ప్రయాణించాలి. అన్నిటా అంతటా ఆయన ఉనికిని ఆస్వాదించాలి. మీ ప్రేమలో, మీ శత్రువుల పట్ల మీకున్న ద్వేషంలో, జంతువుల్లో, పక్షుల్లో, మొక్కల్లో, చెట్లలో, సమస్త ఉనికిలో మీరు అయినను గమనించడం నేర్చుకోవాలి.
'యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సచ మే నా ప్రణశ్యతి.'
అంతటా నన్ను చూసేవాడు అన్నిటినీ నాలోనే చూడగలడు. అటువంటి వ్యక్తి కృష్ణుడిని విడిచి ఉండడు, కృష్ణుడు కూడా అతడిని విడిచి ఉండడు. - భగవద్గీత.
***
సుదర్శనుడిని రజస్సు గా భావించవచ్చా, పాంచజన్యాన్ని తమస్సుగా భావించకూడదా, మధ్యలో ఉన్న దైవాన్ని శుద్ధ సత్వంగా భావించవచ్చా... అని తెలుసుకోవాలని ఒకరు అనుకున్నారు.
కాళీమాత అటువంటి ఉగ్రమైన రూపాన్ని ఎందుకు ధరించిందో తెలుసుకోవాలని ఇవాళ మరొకరు తెలుసుకోవాలని అనుకున్నారు.
వీటన్నిటికీ నావద్ద ఒకటే సమాధానం ఉంది. ఒక అవతారాన్ని అది ఉన్న విధంగా ఆస్వాదించండి. మీ ఉత్సుకతను తర్కము, కారణాలు వంటివాటితో కాకుండా, ఆశ్చర్యంతో నింపి, దైవాన్ని ఆస్వాదించండి.
మా నవతరం అనేక కారణాలతో, వివరణలతో వస్తుంది. దైవం అనేది హృదయానికి సంబంధించిన అంశం, కాని మీరు ఇందులో బుద్ధిని వాడుతున్నారు.
ఈ ఉత్సుకతను, తర్కం, కారణాలు వంటి వాటితో కాక, ఆశ్చర్యంతో ఎందుకు నింపకూడదు?
సుదర్శనుడు ఎల్లప్పుడు శక్తితో, బలముతో పరిభ్రమిస్తూ ఉంటాడని నేను మీకు చెప్పాలి. కాబట్టి ఆ శక్తిని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళడానికి 'రజస్సు' అనే గుణం అతడికి కావలసి ఉంటుంది. కాని పాంచజన్యం స్వభావరీత్యా సాధు గుణాన్ని కలిగి ఉంటుంది.
అది సాధు స్వభావంతో లేక ఎక్కువ నిద్రాణంగా ఉంటుంది కనుక అది తమో గుణాన్ని కలిగి ఉంటుంది.
కుడివైపు భాగమంతా సుదర్శనుడి తో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటే, ఎడమవైపు భాగము పాంచజన్యం సహాయంతో చీకటిగా ఉంటుంది. కాబట్టి అధిక ప్రకాశానికి, అధిక అంధకారానికి మధ్య ఉన్న సంతులనమే, పూర్తిగా సత్వగుణంతో కూడుకుని వుండే శ్రీమన్నారాయణుడు. అయినా ఎక్కువ ప్రకాశవంతంగా ఉండరు, అంధకారంగానూ ఉండరు. ఆయన వెలుగు చీకటుల సంగమం. సంధ్యా కాలపు వెలుగులా ఉంటారు. అందుకే నృసింహ భగవానుడు ఎక్కువ చీకటిగా, ఎక్కువ వెలుతురుగా లేని, ప్రదోషకాలాన్ని హిరణ్యకశిపుడికి మోక్షమిచ్చేందుకు గాను ఎంచుకున్నారు.
దుష్ట శక్తులతో లలితా అమ్మవారు యుద్ధం చేస్తున్న సమయంలో కాళీమాత అవతరించింది. రక్తబీజాసురుడిని సంహరించాలి. భూమిపై పడిన అతడి ఒక్కొక్క రక్తపు బొట్టు, వెయ్యిమంది రక్తబీజాసురులను సృష్టిస్తుంది. కాబట్టి ఆమె అతడిని చంపగానే, తన నాలుకతో అతడి రక్తాన్ని తాగాలి. అందుకోసం ఆమె నాలుక బయటికి వేళ్లాడాలి. ఆమె ఆ రక్తాన్ని తన ఒకానొక కుడి చేతిలో ఉన్న వటపాత్రలో సేకరించి త్రాగుతూ ఉంది కూడానూ. రక్తబీజ సురుడి యొక్క దుష్టశక్తి అమిత శక్తివంతంగా, స్వభావరీత్యా నిర్దయగా ఉంది కనుక, కాళీ మాత లలితా దేవి సైన్యంపై అతడి అఘాయిత్యాన్ని ఎదుర్కోడానికి అటువంటి భయంకరమైన రూపాన్ని ధరించాల్సి వచ్చింది.
అంతా ఒక నాటకం వంటిది...
దైవానికి కాస్త వినోదం కావాలని అనిపించింది అందుకే ఆయన మంచిని చెడుని సృష్టించారు. రెండిటి మధ్య ఆటను గమనిస్తూ ఉన్నారు. హఠాత్తుగా ఆయనకు మంచి చాలా మంచిగా, చెడు చాలా చెడు గా అనిపించింది. అందుకే ఆయన మంచి వైపు ఉంటూ అది చెడుపై గెలిచేలా చేశారు. తను అమితమైన మంచి తనానికి ప్రతీకననీ, మంచితనానికి ఊతమిస్తానని దైవం మనకు చూపాలనుకున్నారు. కానీ చెడు ని కూడా ఆయనే సృష్టించారని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఈ యుద్ధం అంతా ఒక నాటకం వంటిదే. మనం మధ్యలో ఉంటూ గమనిస్తే ఈ నాటకాన్ని ఆస్వాదించగలుగుతాము.
కానీ ఇటువంటి సంఘటనలు జరగకపోతే, మీకు సినిమారంగం, వెండి తెర వంటివి ఉండేవి కాదు, మనగలిగేవి కాదు. వారి దీనికి కొంత మసాలాను జోడించి మీ అందరికీ వినోదాన్ని కల్పిస్తున్నారు.
అటువంటి సంఘటనలు జరగకపోతే 'అమర చిత్ర కథ' వంటివి ఉండేవి కాదు. వాటిని చదివేటప్పుడు మనం గంభీరంగా ఉండకూడదు కాబట్టే వాటిని మనం కామిక్స్ అన్నాము.
ఇవన్నీ లేకపోతే మనకు, దైవానికి వినోదమే ఉండేది కాదు. ఈ జీవితాన్ని గడపడానికి మనకు వినోదం కూడా చాలా అవసరం. ఈ కథలన్నీ తగినంత వినోదాన్ని పంచుతాయి.
నిశితంగా గమనిస్తే, ఇటువంటి వినోదభరితమైన కథల ద్వారా ఒకరు ఎదగడానికి, జాగృతితో కూడుకున్న వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ అవతారాలన్నీ పరోక్షంగా మనకు మానవ ధర్మాన్ని బోధిస్తున్నాయి. అవి మానవత్వాన్ని, నైతిక విలువలను బోధిస్తున్నాయి. ఒకరు ఎంత దయగా, ప్రేమగా ఉండాలో బోధిస్తున్నాయి. ఒకరు ప్రతీకార భావనతో, కోపంతో రగిలిపోతుంటే ఏమవుతుందో చూపిస్తున్నాయి.
ఇవి కోపాన్ని, పగను, ప్రతీకారాన్ని, అసూయను రోషాన్ని, అసుర లక్షణాలని చూపిస్తూ, ఇవన్నీ సమస్త విశ్వం లో ఉన్న సున్నితమైన సంతులనాన్ని పాడు చేస్తాయని చెబుతున్నాయి. ప్రకృతిలో ఉన్న సంతులనాన్ని పాడు చేసే దేనినైనా, ప్రకృతి సహించదు. అది తన సృష్టి లోని భాగమే అయినా సరే.
అటువంటప్పుడు, ఇటువంటి మానవ వివరణలు, అవతారాలు, సంఘటనల వెనుక ఉపయోగించే తర్కాలు మూర్ఖమైనవి కదా. నేను ఎల్లప్పుడూ భగవంతుని, అతని సృష్టిని చూసి ఆశ్చర్యపోతూ ఉండడాన్ని ఇష్ట పడతాను.
కాబట్టి మీ ఉత్సుకతను తర్కము కారణాలతో నింపే బదులు ఆశ్చర్యంతో నింపి, భగవంతుడితో ఆనంద నాట్యం చేయండి.
సత్-చిత్- ఆనంద...
సత్యాన్ని ఆస్వాదించండి. చిత్తంతో ఉత్సవం చేసుకోండి, ఆనందంతో నాట్యం చెయ్యండి.
***
No comments:
Post a Comment