ఒకటైపోదామా ఊహల వాహినిలో - 3
కొత్తపల్లి ఉదయబాబు
అతనికేసి సూటిగా చూసింది హరిత.
''అవును. వాళ్ళు నిజమైన సంఘ
సంస్కర్తలు. కేవలం ఇంటి గడప లోపలే ఉండిపోయిన స్త్రీ మూర్తులలో కొందరు పురుషులు
ఇచ్చిన చైతన్య స్పూర్తితో చదువుకోవడం మొదలు పెట్టారు. స్వతంత్ర భారత సంగ్రామంలో
స్త్రీలు పాల్గొన్నతరువాత దాదాపు అన్ని రంగాలలోను స్త్రీ చైతన్యం ప్రేరేపించబడి
పుంజుకుంది.
ఈనాడు
ఎన్నెనో రంగాలలో తనను తానూ నిరూపించుకుంటూ తమ ఆధిక్యతను చాటుకుంటూనే ఉంది స్త్రీ.
కానీ దురదృష్టం కొద్దీ ఆడదాని 'కోరిక' ను బట్టి ఆమెను కోరికలు తీర్చే ' ఆట వస్తువుగా' ను, ఆమె
ఆశలను బట్టి ఆమె డబ్బున్న ఇంటి కోడలు కావాలి అన్న ఉద్దేశంలో ఈనాడు స్త్రీ
చూడబడుతోంది. అవునా?''ప్రశ్నించింది హరిత.
''కాదు అనలేను. అది భగవంతుడు స్త్రీని సృష్టించి నిర్దేశించిన ప్రకృతి
ధర్మం. మగవారిలాగే స్త్రీలకూ అన్ని కోరికలూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మగవారికంటే
ఎక్కువగా ఉంటాయని, తమ కాల మాన పరిస్థితులవల్ల వాటిని
అణగతొక్కి, తమలోని చంపేసుకుని జీవితాలను చాలించిన స్త్రీలు ఈ
ప్రపంచంలో కోటానుకోట్లు అని నేను కూడా చదివాను.'' అన్నాడు
విరాజ్.
''కానీ ఒక మాట విరాజ్. ఒక స్త్రీ పురుషుల ఒక్కసారి కలయికతో ఆ అమ్మాయి, ఆమె జీవితం
పరిపూర్ణత సాధించినట్లే. ఈ ప్రపంచంలో అసలు
సిసలైన మానవ జీవన ధర్మం వారిద్దరికీ తెలిసిపోతుంది. ఆ కలయికలో ఆనందపు పరాకాష్టని
వాళ్ళు తెలుసుకుంటారు.
నిజానికి ఈ ప్రకృతి
కొనసాగడానికి, వయసు వచ్చాకా తమకు తెలియకుండానే
స్త్రీ, పురుషులు తమ వ్యతిరేక లింగం పట్ల ఆకర్షణ కలిగేలా
భగవంతుడు మనలను సృష్టించాడు. ఇది కేవలం మనకు మాత్రమే పరిమితం కాదు. ఈ సృష్టిలో
ప్రాణమున్న ప్రతీ జాతికీ వర్తించేలా చేయబడిన భగవంతుని అద్భుత సృష్టి.
అయితే ఆలోచనా శక్తి ఉన్న మానవులు తప్ప మిగతా జంతువులూ, పశు పక్ష్యాదులు ప్రకృతిసహజ ప్రేరణతో కేవలం ఋతుధర్మాన్ని
అనుసరిస్తూ ఒకదానితో ఒకటి ఇష్టపడి ప్రేమపూర్వకంగా కలుస్తాయి. కానీ మాటలు నేర్చిన
మన మానవ జాతికే వచ్చింది ఈ రిమ్మ తెగులు.
ఆనాటి సంఘ
సంస్కర్తలు ' స్త్రీ కూడా
తనలాంటి మనిషే. ఈ ప్రకృతిలో తనకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అంత ప్రాధాన్యత ఆమెకీ
ఉన్నది అని వారు సంస్కారవంతంగా ఆలోచించగలిగారు కాబట్టే స్త్రీ గడపదాటి బయటకు
రాగలిగింది అన్నది నిజమైన నిజం.
కానీ అలా
బయటకు వచ్చి తనను తానూ నిరూపించుకున్న స్త్రీలని ఎక్కువశాతం మగవాళ్ళు
అంగీకరించలేకపోతున్నారు. ఇక్కడ తమ తెలివి
తేటలు ఉపయోగించి సమాజ పరమైన బలహీనత ఆధారంగా ఆమెను ఆకర్షించి,ప్రలోభపెట్టో, బెదిరించో, భయపెట్టో,బలవంతంగా లొంగదీసుకునో, ' తమ కోరికలు తీర్చుకునే
ఆటవస్తువుగా మార్చేస్తున్నారు. ''
మగవాడు అలా
ఎందరి స్త్రీలనైనా కలవగలడు. కానీ ఆడదాని బ్రతుకు ఒక్కరితో కలిస్తే చాలు ఏదో
పవిత్రత కోల్పోయినట్టు, ఆమె వ్యభిచారి అనో, పతిత అనో ముద్ర వేస్తోంది సమాజం.
స్వాతంత్య్రం
వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సమాజంలో ఈ లింగ వివక్ష పోకపోవడం నాకు చాలా బాధగా ఉంది.
అటు అమ్మాయిలూ, అబ్బాయిలు తమ
యొక్క అహాన్ని పెంచుకోవడం వల్ల సమాజ్య
ఆరోగ్యం పాడైపోతోంది.
ఒకరిని చూసి
ఒకరు అన్నట్టుగా ఈ జాడ్యం కుల,
మత , వర్గ, రహితంగా
ఇష్టమైనన్ని నాళ్ళు కలిసి ఉందాం...ఒకరిమీద ఒకరికి భరోసా తగ్గినపుడో, ఒకరిమీద ఒకరికి ఇష్టం తగ్గినపుడో
విడిపోతున్నారు.
ఈ ఫలితం
ఆవేశంలో వారు కన్నా బిడ్డలా జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఒకరు చెబితే మరొకరు వినే
పరిస్థితి లేనంత స్వేశ్చతో బ్రతికేస్తున్నారు జనం. ''
''నీకు ఇంత లోతుగా ఈ వివరాలన్నీ ఎలా తెలుసు? అయినా నా
ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదంతా ఎందుకు
చెబుతున్నావో నాకు అర్ధం కావడం లేదు.''కొంచెం విసుగ్గానే
అన్నాడు విరాజ్.
''విజ్ఞానాన్ని చదివి తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో 'పుస్తక'మంత మంచి సాధనం మరోటి లేదు
విరాజ్.
నువ్వడిగిన
నీ కోరిక తీరిస్తే నాకు నీతో పెళ్లి అవుతుందో లేదో తెలీదు. కానీ నేను తల్లిని
మాత్రం అవుతాను. ఆ తరువాత నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి నాజీవితం, ఆ బిడ్డ జీవితం ఆధారపడుతుంది.
అంటే
మేమిద్దరం ఈ స్వేశ్చ భారతంలోను, సమాజం దృష్టిలోనూ దోషులుగా
మిగులుతాం. మళ్ళీ చరిత్ర పునరావృతం. లోకం మమ్మల్ని కాకుల్లా పొడుస్తుంది. నీ ఒక్క
కోరిక తీరిస్తే జరిగే పరిణామాలివి..'' హరిత ఆగి అతని కళ్ళల్లోకి
చూసింది.
No comments:
Post a Comment