'గణితశాస్త్ర యశస్విని..'శకుంతలాదేవి'! - అచ్చంగా తెలుగు

'గణితశాస్త్ర యశస్విని..'శకుంతలాదేవి'!

Share This
'గణితశాస్త్ర యశస్విని..'శకుంతలాదేవి'!
-సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.

బడికి వెళ్ళకపోయినా
జీవిత పాఠశాలలో
అనుభవ జ్ఞానాన్ని ఆపోసన పట్టిన విజ్ఞాన శిఖామణి..
ఆడుతూ పాడుతూ గాలిలో చేతులు తిప్పుతూ 
ఆరేళ్ళ ప్రాయంలోనే అవలీలగా లెక్కలు చేసి 
ప్రతిభను చూపించి విశ్వమంతా 
గణిత దివ్వెలు నింపిన తేజో విదుషీణి..

అంకెల గారడీ ప్రదర్శనల్లో
అతి పెద్ద గుణకార, భాగహారాలకు అరసెకన్ లో 
సమాధాన సంకెళ్లు వేసి 
కంప్యూటర్ కన్నా సూపర్ ఫాస్ట్
అనిపించుకుని..
గణితాన్నే ఊపిరిగా చేసుకున్న గణితశాస్త్ర యశస్విని..
బతుకులోని ఆరోహణ, అవరోహణాలే 
జీవన గణాంకాలకి నిదర్శనమని..
గణితం గజిబిజి కాదు..
'లాజిక్కుతో చేసే ఓ మ్యాజిక్కు' అని..
లెక్కల్లోని గమ్మత్తులను
అంకెల బాంధవ్యాన్ని సంఖ్యల్లో చూపించి..
జాతీయ స్థాయికి చేర్చి..
ప్రపంచానికి చాటి చెప్పిన హ్యూమన్ కంప్యూటర్ బిరుదాంకితురాలు..
మన భారతీయ మహిళామణి..శకుంతలాదేవీ!
******

No comments:

Post a Comment

Pages