శివ పంచాక్షరీ మంత్రం ప్రాశస్థ్యం - అచ్చంగా తెలుగు

శివ పంచాక్షరీ మంత్రం ప్రాశస్థ్యం

Share This
శివ పంచాక్షరీ మంత్రం ప్రాశస్థ్యం

రచన: సి.హెచ్.ప్రతాప్  



పంచాక్షరీ అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం. పంచాక్షరీ అనగానే అందరికీ గుర్తుచ్చేదీ శివ పంచాక్షరీ మంత్రం. ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం గా వేద శాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి. కేవలం కోరిన భౌతిక కోరికలు  తీర్చడమే కాదు ఇహంలోనూ పరంలోనూ అన్నింటిని సమకూర్చే  మహాద్భుత మంత్రం. ఓం ‘నమఃశివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. ఈ మంత్రాన్ని భక్తి, శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని, అంతేకాకుండా ఒక చిత్తశుద్ధితో, పవిత్రమైన మనస్సుతో ఎవరైతే జపిస్తారో వారికి సకలం సిద్ధిస్తుందని  శివపురాణం చెబుతోంది.

ఈ మంత్రాన్ని నిత్యం చిత్తశుద్ధితో పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.

భక్తితో ఉచ్చరించినంతమాత్రానే భక్తులకు  కైలాసం సిద్ధిస్తుందని అదే  అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం ఫలమ్‌’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది అని శాస్త్రం పేర్కొంటోంది.

ఓం నమః శివాయ మంత్రం సెకనుకు అనేక ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ తరంగాలు మానవ మేధస్సును వాంఛనీయ స్థాయికి పెంచుతాయి. ధ్యానం సమయంలో ఓం నమః శివాయ నిదానంగా జపించడం వల్ల సామరస్యం, ఏకాగ్రత మరియు బలం లభిస్తాయి.

ఈ పంచాక్షరి మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది. ఈ మంత్ర స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల దుష్టశక్తులు మన దరి చేరవు. ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మెదడు, శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు నిద్రలేమి, మానసిక, అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి ప్రశాంతత లభిస్తుంది.

ఒక పరిశోధకుడు విడుదల చేసిన ప్రమాణిక పత్రంలో ఈ మహా మంత్రానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

" ఓం నమః శివాయ మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది శివుడు తన తలపై చంద్రచంద్రాకారాన్ని కలిగి ఉన్నాడు. ఎవరైనా ఓం నమః శివాయ్ అని జపించడం ప్రారంభించినప్పుడు ఇది జపం చేసేవారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అతని/ఆమె మనస్సును చల్లబరుస్తుంది మరియు ముఖ్యంగా ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు వారికి మనశ్శాంతి, పట్టుదల మరియు ప్రశాంతతను పొందడంలో సహాయపడుతుంది.
ఓం నమః శివాయ మంత్రం మిమ్మల్ని మీ జంతు వాంఛ మరియు మొరటు ప్రవర్తన నుండి విముక్తి చేస్తుంది. ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది, ఇది మీ శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరం యొక్క విషాన్ని తగ్గిస్తుంది. మీ దూకుడు మరియు కోపం తగ్గినట్లు మీరు అనుభూతి చెందుతారు. ఈ మార్పులకు 25-30 రోజులు అవసరం. మీరు శివునిపై అధిక భక్తితో మంత్రాన్ని ఆచరించాలి.":

No comments:

Post a Comment

Pages