ఇహలోక నరకం రోగం!
ఒకప్పుడు రోగాలు
దూరపు బంధువుల్లా
అలా వచ్చి పలకరించి
ఇలా వెళ్ళిపోయేవి
ఎక్కడో ఓ వైద్యుడు ఉండేవాడు
నాడి పట్టుకుటే..రోగాన్ని పట్టుకున్నట్టే
మూడు పూటలకు మాత్రలు
కాస్త అరకు ఇదే వైద్యం..దెబ్బకు వ్యాధి
ఎవరో తరుముతున్నట్టు పారిపోయేది
ఇప్పుడలా కాదు
ఇంటి చుట్టూతా ఆకాశాన్నంటే ఆసుపత్రులే
ఇంద్రభవనాన్ని తలదన్నే రూపురేఖలు
ఓ తుమ్ము..చిన్న దగ్గుచాలు
శరీరాన్ని పరీక్షల కేంద్రం చేయడానికి
అశేష వ్యాధినామాలు
విశేష..వినూత్న విభాగాలు
ట్రీట్మెంట్ చేసే అదృష్టం ఎవరో ఒక డాక్టర్ని వరిస్తుంది
జీవితాంతం వాళ్ళకీ రోగికి ముడిపడిపోతుంది
ఇదో కొత్త ఋణానుబంధం
పస్తులు..ఉపవాసాలు తిండికే
మందులు చచ్చినట్టు బతకడానికి వేసుకోవాల్సిందే
తినడం..తాగడం అంతా కొలతలతోటే
ఇప్పుడు జనం కష్టపడేది మందులతో జానెడు పొట్ట
నింపుకోడానికే
నిత్యావసరాల్లో మందులదే మొదటి స్థానం
ఏ యుగంలో లేని శారీరక నరకం
కలియుగం ప్రత్యేకం
ఈ లోకంలో రోగగ్రస్త బొందిని విడవడమే ఆత్మకు స్వర్గం
మరో స్వర్గమంటూ వేరే ఉండదు!
No comments:
Post a Comment