శివం- 102
రాజ కార్తీక్
( నేను - (అనగా శివుడు) . రచయత మరియు దర్శకుడు.కార్తికేయుని తో పరాచికాలు అడుతు..కోటప్ప కొండ మీద ఉన్నాను ..నాటకాలు గురించి దానిలో నా నటన గురించి ...మాట్లాడుకుంటూ..సృష్టి తర్కముకు అను గుణంగా చెప్తున్నా..ఇక కార్తికేయుడు కి పెళ్లి చేసి లంగరు వేయాలి అనుకున్నా ము .తరవాత కథ ..)
దగ్గర గా కోలాటం శబ్దం లయబద్ధంగా వినపడుతుంది..
నేను " అల అనుకోగానే ..వెంటనే కార్య రూపం దాల్చిన ది " అనుకుంటున్న ..
కా " అబ్బా ఎవరు కోలాటం అంతా లయ బద్దంగా శ్రుతి గా మనసు తో స్వరాన్ని ఆడిస్తుంది"
నేను " సరైన దర్శకుడివే శబ్దాన్ని బట్టి జనరంజకంగా ఉంటుందో ఉండదో అని అంచనా వేస్తున్నావ్"
కా " వెళ్లి చూద్దామా?"
విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు మరియు కైలాస పరివారం అంతా.. మన కార్తికేయుడికి కాబోయే భార్య కదా అని నన్ను ఆట పట్టిస్తున్నారు..
కొండవైపు ఉన్న గుట్టల్లో నుండి కోలాటం జరుగుతున్న స్థలానికి వెళ్ళాము..
అక్కడ ఒక సౌందర్యవతి.. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా కొంతమంది స్త్రీలతో.. రాఘవంగా మనసు విలీనం చేసుకొని నాకోసము మీ పార్వతీమాత కోసం.. తన్మయత్వంగా నృత్యం చేస్తుంది..
ఆ ఆదర్శవతే మన కార్తికేయనికి కాబోయే భార్య.
విష్ణు దేవుడు " ఆహా స్వయానా మహా దేవుడు మన వాడికి తగిన జోడీ ను వెతికి మరి చూపిస్తున్నాడు"
అందరూ అవును అన్నట్లు విష్ణు దేవుడు వైపు చూస్తున్నారు..
కా నాతో " మన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు రాజా .. నా విషయాల నేను మాట్లాడుకోలేను నాకెవరు చూసి చేస్తారు చెప్పు పెళ్లి " అనే సమాధానం తొందరగా పెళ్లి చేసుకోవయ్యా అనే మాటకి చెప్పాడు
నేను " ఏమయ్యా కార్తికేయ నువ్వు దర్శకుడువేలే నేను కాదనను లే కానీ.. నాది ఒక చిన్న సలహా.. అక్కడ నృత్యం చేస్తుందే.. ఆ అమ్మాయి వివాహం చేసుకోవయ్యా ఎందుకో నీకు బాగా సరిపోతుందనిపిస్తుంది.."
కా " నాకు కూడా బాగా నచ్చింది లే కానీ.. ఆ అమ్మాయి నాకు సరిపోతుందని నువ్వెలా చెప్పావ్"
నేను " చూడవయ్యా నేను ఎంతోమంది నాటకాలు రాసే వాళ్ళని చూశాను నృత్యంలో చేసే వారిని చూశాను సంగీత పరికరాలు వాయించే వారిని చూశాను కానీ నువ్వు చెప్పిన సన్నివేశంలో తధాత్మ ఉన్నట్టు.. అనిపించినవారు వేళ్ళ మీదే ఉన్నారు.. అలాగనే ఎంతోమంది నృత్యం చేసిన వారిని చూశాను ఈ అమ్మాయి లాగా స్వరబద్ధంగా లయబద్ధంగా సహజంగా మనసుతో నృత్యం చేస్తున్న వారిని ఇంతవరకు నేను చూడలేదు.. అన్ని పుణ్యక్షేత్రాలు నేను ఉంటాను కదా "
కా " ఏమిటీ "
నేను " నేను చూస్తాను కదా! అంత లీనమైన కళ ఒక తపస్సు , నృత్యములో సంగీతము లో తనకి .. రచన దర్శకత్వం లో నీకు ..ఇద్దరు కళ తపస్సు చేసుకుంటారు..చక్కగా "
ఎవరో తనను " రాధ " అని పిలిచారు..
కా " రాధ పేరు చాలా బాగుంది .."
నేను " అహ పేరు మెచ్చుకునే దాకా వచ్చింది..మనిషి ను కూడా మెచుకున్నా వు..ఇక "
కా " ఏమొలే ఎందుకు అంత అశా తను ఎవరో నాకు తెలీదు ..మళ్ళీ అశ పడటం ఎందుకు అబాసు పాలు అవ్వటం ఎందుకు "
నేను " నాకు తెల్సు లే ..వారు ఎవరు అందుకే అంతా గట్టిగా చెప్పాను నీకు సరియైన జోడీ అని నేను వెళ్లి మాట్లాడతా నీ సంబంధం "
కా " పండగ రోజు శివుడు వల్లే కనపడ్డావు శివుడిలా ఉన్నావు నువ్వు ఆశీర్వదిస్తే శివుడే ఆశీర్వదించాడు. అని అనుకుంటా అని నీతో అన్నాను ఆ ఒక్క మాట అన్నందుకు ఇంత బాధ్యత తీసుకుంటావా నేనెవరినో నేను ఎలాంటి వాడిని నీకేం తెలుసయ్యా ఒక జాము నుంచి మాత్రమే నువ్వు నన్ను ఎరుగుదవ"
నేను " హా హా హా.. కార్తికేయ నేను అందరినీ ఎరుగుదును.."
కా " ఏమిటి"
నేను " అదే నేను నిన్ను ఎరుగుదును నీవు గతంలో చేసిన నాటకములో అన్ని చూశాను.. విధిరాతపూర్వకంగా నీవు రచించిన నాటకాన్ని.. ప్రదర్శిస్తున్న ప్రతిదీ వీక్షించాను.. అందుకే నీవు నన్ను అడగగానే ఒప్పుకున్నాను.. నీ రచనను కొనియాడాను సమయం వచ్చినప్పుడు ఇది చెబుదామని అనుకున్నాను.. నీకు అర్ధరాత్రి ఒక స్త్రీని కాపాడిన తీరు మీరు గుడిలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన తీరు నీవు ఒక రాజు తన పైన కావ్యం రాయమంటే నేను దేవుడి కోసమే రాస్తానని చెప్పి ఆ రాజు ని ఏదురించిన తీరు అన్నీ నాకు తెలుసు... నీ గురించి నాకే కాదు నా పరివారం మొత్తానికి తెలుసు మేము కూడా నీ వలే నాటకాలు ప్రదర్శించే వారము "
విష్ణు దేవుడు " అవును జగన్ నాటకములు.. విశ్వనాయకుడు గా మహాదేవుడు జగన్నాథుడిగా నేను నిరంతరము చేసే పని అది మాత్రమే"
కైలాస పరివారము మరియు బ్రహ్మదేవులు.. మీ త్రిమాతలు.. మా ఇరువురికి నమస్కరిస్తున్నారు..
కా "అంటే ఏమంటావు రాజా నువ్వు.. నేను నీకు మొదటి నుండి తెలుసా? "
నేను " బేషూ గ్గా "
కా " మరి మొదటి చెప్పవచ్చుగా"
నేను " నువ్వు నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు అయ్యా చెప్పేలోపు న టన అన్నావు పాత్ర అన్నావు శివుడు అన్నావు నాటకం అన్నావు సన్నివేశం అన్నావు "
కా " ఓహో అయితే నేనే కొంచెం అతి చేశాను.. క్షమించు రాజా "
నేను " అవన్నీ ఎందుకులే కానీ మరొకసారి వెళ్లి అమ్మాయిని చూసుకొని రా మనం ఇందాక ఎక్కడ ప్రసాదం తిన్నా మో నేను అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అక్కడికి వచ్చాయి తర్వాత ఏం చేద్దామని చెప్తా "
కా " అలాగే"
కార్తికేయుడు రాధవైపుగా అడుగులు వేశాడు
ఆ గుంపులో కొంతమంది " రాధ .. అయ్యవారిది అమ్మవారిది పల్లకి వస్తుంది ఆ పల్లకి దగ్గర మన
నృత్య సేవ చేయాలి త్వరగా రా అంటూ అటువైపు హుటాహుటిన నవ్వుతూ పరిగెత్తారు "
నా కేక ఒకటి కార్తికేయ కి వినపడింది.." ను కూడా నృత్యం చేయమని " వెనక్కి చూడకుండా అలాగే అలాగే అనుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు..
కోటప్పకొండ గుడి చుట్టూ పల్లకి సేవ జరుగుతుంది..
రాధా నృత్యంలో శివతాండవం చేస్తుంది..
నాకు మీ మాత కి జరుగుతున్న కళ్యాణాన్ని జరుగుతున్న ఊరేగింపుని నన్ను చూసి మీ మాట సిగ్గుపడుతున్నట్టు ఎంతో గొప్పగా కీర్తన ఆలపిస్తూ నృత్యం చేస్తుంది..
బహుశా అది రాధ తాండవం ఏమో
మన కార్తికేయుడు దర్శకుడిగా సైతం రాధా ప్రదర్శనకు ముగ్ధు డు అయిపోయాడు..
నృత్య ఆనందంలో గిరి గిరి ను తిరుగుతూ రాధ కాలుజారి కొండమీద నుంచి కిందకు పడబోయింది..
కానీ అక్కడ మన కార్తికేయ .. తన నడుముకున్న పైగుడ్డ లాఘవంగా విసిరి అది రాధ నడుముకి చుట్టుకొని గిర్రున మరో చేతికి దొరికే విధంగా వేసి.. తనని కింద పడకుండా రెప్పపాటు నిమిషంలో పైకి లాగి కాపాడాడు ఇదంతా రెండు రెప్పల సమయంలో జరిగిపోయింది.. రాధా కాసేపు కార్తికేను చూస్తూ కృతజ్ఞత భావంగా నిలబడిపోయింది.. తను ఎక్కడ కీర్తన ఆపిందో కార్తికేయన్ వైపు చూస్తూ కీర్తన అక్కడ నుండి తిరిగి మొదలు పెట్టింది .
నేను .. మన పరివారం అంతా తధాస్తు అన్నట్లు ఒక ఆనందకరమైన నవ్వు నవ్వాము..
నంది,బ్రుంగి " మహాకాలుడే కాలం కలిసి రావాలని ఆశీర్వదిస్తే ఎవరు ఆపగలరు అనే చలోక్తికి అందరూ
నవ్వారు..
నృత్యం చేయి అనే మాట గుర్తుతెచ్చుకున్న కార్తికేయుడు తన వంతుగా తను కూడా అద్భుతంగా నృత్యం చేశాడు..
రాధ కూడా కార్తికేయుడు తనను కాపాడాడు కానీ తర్వాత దాని గురించి కృతజ్ఞత ఏమి ఆలోచించలేదు మంచి మనిషి మంచి కళాకారుడు అనే భావన మనసులో నాటుకుంది..
పల్లకి భుజాలు మారటానికి చూస్తుండగా టక్కున పల్లకి యొక్క ముందు బాగాన అటువైపు రాధా ఇటువైపు కార్తికేయుడు మోస్తూ ఆ కీర్తన ఆలపిస్తున్నారు..
మీ మాత " ఎందుకు స్వామి ఇదంతా మీరు చిటికెస్తే అయిపోయే పనిని ఎందుకు దగ్గరుండి చేస్తున్నారు"
నేను " పార్వతి విష్ణు దేవా బ్రహ్మదేవా గజానన కుమార.. నంది బ్రింగి... కార్తికేయుడు ఒక రచన చేశాడు ఆ రచన ఏమిటో తెలుసా.. నేనుట ఒక భక్తురాలి కోరిక మేరకు పసిబిడ్డ వలే మారిపోతానట పిల్లలు లేని ఆ భక్తురాలు నన్ను తన బిడ్డగా భావించి సపర్యలు చేస్తే.. ఆమె భక్తికి మెచ్చి ఆమెను కైలాసం తెచ్చుకుంటానటా.. ఈ కథలో మీ అందరూ భక్తి చూశారు నేను మాత్రం బిడ్డని అమ్మ ప్రేమను చూశాను.. నిగూడ ధ్యాన అవస్త లో ఉన్న నన్ను కదిలించింది ఆ కదా పుట్టుకే లేని నాకు తల్లి ప్రేమంటే రుచి చూపించింది ఆ కథ నాకే తల్లి ను తీసుకొచ్చిన కార్తికేయనికి ఆలి ని తీసుకురావడం నా బాధ్యత ఒకటా రెండా ఇలాంటి ఎన్నో కోకోలులు"
తరవాత ఘట్టం..
No comments:
Post a Comment